లక్నో: సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన కానాపురం సాత్విక్ రెడ్డి–రేషిక (భారత్) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ రెడ్డి–రేషిక ద్వయం 21–8, 21–14తో విరాజ్–రుతపర్ణ పాండా (భారత్) జంటపై గెలిచింది.
మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీకి మార్గోట్ లాంబోర్ట్–కామిలి (ఫ్రాన్స్) నుంచి ‘వాకోవర్’ లభించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో తన్వీ శర్మ 21–19, 18–21, 21–14తో ప్రతివి (ఇండోనేసియా)పై, ఉన్నతి 21–19, 15–21, 21–18తో అన్‌మోల్‌పై గెలిచి సెమీఫైనల్ చేరారు.


