సెమీఫైనల్లో సింధు, లక్ష్యసేన్, అన్‌మోల్‌ | PV Sindhu reaches the semi finals at the BWF Tour Super 500 Hylo Open | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో సింధు, లక్ష్యసేన్, అన్‌మోల్‌

Oct 31 2026 12:41 AM | Updated on Oct 31 2026 12:41 AM

PV Sindhu reaches the semi finals at the BWF Tour Super 500 Hylo Open

బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ హైలో ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రెండో సీడ్‌ సింధు 21–12, 21–10 స్కోరుతో అమేలియా షుల్‌ను చిత్తు చేసింది. 28 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించింది. మరో భారత క్రీడాకారిణి అన్‌మోల్‌ ఖర్బ్‌ కూడా సెమీస్‌లోకి అడుగు పెట్టింది.

క్వార్టర్స్‌ పోరులో అన్‌మోల్‌ 21–17, 18–21, 21–16 తేడాతో భారత్‌కే చెందిన ఆరో సీడ్‌ ఉన్నతి హుడాపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ లక్ష్యసేన్‌ కూడా సెమీస్‌కు చేరుకున్నాడు. క్వార్టర్‌ ఫైనల్లో అతను 14–21, 21–17, 21–13తో కేల్‌ కాల్‌నెన్‌ (ఫిన్లాండ్‌)పై గెలుపొందాడు. 66 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో లక్ష్య తొలి గేమ్‌లో ఓడినా... పట్టుదలగా ఆడి ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement