హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ-2026లో భారత్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. శుక్రవారం జలంధర్ వేదికగా జపాన్‌తో జరిగిన ప్రిలిమినరీ రౌండ్ మూడో మ్యాచ్‌లో భారత హాకీ జట్టు 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. . ఈ గెలుపుతో పూల్ పాయింట్ల పట్టికలో టీమిండియా మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది.
మ్యాచ్ తొలి క్వార్టర్‌లోనే భారత్ బోణీ కొట్టింది. అద్భుతమైన టీమ్ మూవ్‌తో అభిషేక్ నైన్ తొలి గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే తొలి క్వార్టర్ ఆఖరి క్షణాల్లో జపాన్ జట్టుకు తమ లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలచి 1-1తో స్కోరును సమం చేసింది.
ఆ తర్వాత రెండు, మూడు క్వార్టర్లలో ఇరు జట్ల డిఫెండర్లు గట్టి పోటీనివ్వడంతో స్కోరు సమంగా కొనసాగింది. చివరి క్వార్టర్‌కు ముందు రెండు జట్లు 1-1తో నిలవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే నాలుగో క్వార్టర్ (చివరి 15 నిమిషాల్లో) భారత ఆటగాళ్లు విజృంభించారు.
కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ సింగ్ లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి టీమిండియాను మళ్లీ ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ వెంటనే అభిషేక్ నైన్ తన వ్యక్తిగత రెండో గోల్‌ను సాధించగా, విష్ణుకాంత్ సింగ్ నాలుగో గోల్ బాది భారత్‌ను విజేతగా నిలిపాడు. చివరి 15 నిమిషాల్లోనే ఏకంగా మూడు గోల్స్ సాధించిన భారత్, 4-1 తేడాతో జపాన్‌పై ఆధిపత్యం ప్రదర్శించి అద్భుత విజయాన్ని అందుకుంది.


