జలంధర్: సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నీలో భారత జట్టు జోరు సాగుతోంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 13–0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించిన ఐదు సార్లు చాంపియన్ టీమిండియా... గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో 5–2 గోల్స్ తేడాతో చైనాను చిత్తుచేసింది.
భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (27వ 31వ నిమిషాల్లో), సుఖ్‌జీత్ (12వ, 34వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో చెలరేగగా... జుగ్‌రాజ్ సింగ్ (47వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. చైనా జట్టు తరఫున పెంగ్ యాంగ్ (26వ ని.లో), చాంగ్‌కాంగ్ చెన్ (36వ ని.లో) చెరో గోల్ చేశారు. ఇతర మ్యాచ్‌ల్లో మలేసియా 3–1తో దక్షిణ కొరియాపై, జాపన్ 1–0తో బంగ్లాదేశ్‌పై గెలుపొందాయి. తదుపరి మ్యాచ్‌ల్లో శుక్రవారం జపాన్‌తో భారత్, దక్షిణ కొరియాతో చైనా, బంగ్లాదేశ్‌తో మలేసియా తలపడనున్నాయి.


