సింధు, హంపిలకు వైఎస్‌ జగన్‌ అభినందనలు | YS Jagan-Heartiest-Congrats-Proud-About-Koneru-Humpy-PV Sindhu | Sakshi
Sakshi News home page

సింధు, హంపిలకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

Oct 26 2026 12:26 PM | Updated on Oct 26 2026 1:19 PM

YS Jagan-Heartiest-Congrats-Proud-About-Koneru-Humpy-PV Sindhu

Photo Credit: Twitter

భారత మహిళా క్రీడాకారిణులు కోనేరు హంపి, పీవీ సింధుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు. ఇటీవలే యూరోపియన్ చెస్ క్లబ్ ఫర్ వుమెన్ టోర్నీలో కోనేరు హంపి వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సింధు ఫైనల్లో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా వీరిద్దరిని పొగడ్తలతో ముంచెత్తారు. 

‘మహిళల యూరోపియన్ చెస్ క్లబ్ కప్‌లో వ్యక్తిగత స్వర్ణం గెలిచి, మాంటె కార్లో విజయంలో పాలుపంచుకున్న కోనేరు హంపికి; ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో రెండవ స్థానం సాధించిన పీవీ సింధుకు నా హృదయపూర్వక అభినందనలు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మీరిద్దరూ మన రాష్ట్రానికి, దేశానికి మీ ప్రదర్శనతో గౌరవాన్ని పెంచారు. 

ప్రతీ విజయం వెనుక సంవత్సరాల తరబడి కఠోర శ్రమ, త్యాగం, పట్టుదల ఉంటాయి. మీ ప్రయాణం ఎందరో యువతులకు పెద్ద కలలు కనడానికి, తమను తాము విశ్వసించడానికి ధైర్యాన్ని ఇస్తున్నాయి. మీరిద్దరూ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము. మన ప్రజలకు మీరు ఇలాగే గర్వకారణంగా నిలవాలని కోరుకుంటున్నా’ అని జగన్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement