ప్రజాసేవలో మేటి.. కౌన్సిలర్‌గా పోటీ | YSRCP Volunteer Sindhu Priya Enters Municipal Polls As Councillor Candidate In Peddapuram, Check More Details | Sakshi
Sakshi News home page

ప్రజాసేవలో మేటి.. కౌన్సిలర్‌గా పోటీ

Oct 26 2026 11:05 AM | Updated on Oct 26 2026 11:39 AM

YSRCP Volunteer Sindhupriya Contest Councillor Peddapuram

వైఎస్సార్‌ సీపీ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న సింధుప్రియ, పక్కన భర్త అబ్బులు

పెద్దాపురం(తూర్పుగోదావరి): గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వలంటీర్‌గా సేవలందించిన ఆ యువతి నేడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పెద్దాపురం కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు ఆశీసులతో వైఎస్సార్‌ సీపీ పార్టీ తరఫున కౌన్సిలర్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచింది. వివరాల్లోకి వెళితే.. పెద్దాపురం పట్టణానికి చెందిన ఐతి సింధుప్రియ గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఒకటో వార్డులో వలంటీర్‌గా ప్రజలకు ఎన్నో సేవలందించింది. ఎస్సీలు ఎక్కువగా నివాసం ఉండే ఆ ప్రాంతంలో కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు తోడుగా నిలిచింది.

 ప్రాణాలకు కూడా లెక్కచేయకుండా సేవలు అందిస్తూ, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలను పాటిస్తూ ప్రజాసేవకు అంకితమైంది. దీంతో పార్టీ పెద్దాపురం కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు ఆమె సేవలను గుర్తించి కౌన్సిలర్‌గా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఒకటో వార్డు కౌన్సిలర్‌ సీటు కోసం ఎంతో మంది పోటీ పడినా సింధుప్రియకే ఖరారు చేసి, బీఫారం కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజా క్షేత్రంలోకి వచ్చానన్నారు. పేద వర్గాలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని, భర్త అబ్బులు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు.


  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement