సాక్షి,తాడేపల్లి : మహర్షి వాల్మీకి జయంతి వేడుకల సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదికవికి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
‘సత్యం, ధర్మం, న్యాయం, మానవీయ విలువల ఔన్నత్యాన్ని రామాయణ మహాకావ్యం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ఆదికవి వాల్మీకి మహర్షి గారు. ఆయన రచించిన రామాయణం భారతీయ సంస్కృతికి అమూల్యమైన సాహిత్య సంపద’ అని వైఎస్ జగన్ తన ట్వీట్‌లో కొనియాడారు. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
సత్యం, ధర్మం, న్యాయం, మానవీయ విలువల ఔన్నత్యాన్ని రామాయణ మహాకావ్యం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ఆదికవి వాల్మీకి మహర్షి గారు. ఆయన రచించిన రామాయణం భారతీయ సంస్కృతికి అమూల్యమైన సాహిత్య సంపద. వాల్మీకి మహర్షి గారి జయంతి సందర్భంగా నివాళులు. #ValmikiJayanti https://t.co/tliKWawS9V
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 26, 2026


