గీత దాటితే వేటే! | Chittoor Collector Issues Notices To 51 ROs Over Alleged Election Rule Violations, Warns Of Suspension And Criminal Action | Sakshi
Sakshi News home page

గీత దాటితే వేటే!

Oct 26 2026 9:12 AM | Updated on Oct 26 2026 9:32 AM

Chittoor ROs Issued Notices to 51 Officers for Election Rules Violations

‘‘ఎన్నికల విధుల్లో నిష్పాక్షితను తుంగలో తొక్కి అధికార పార్టీ అభ్యర్థులకు కొమ్ముకాసే అధికారుల ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయం. ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేస్తూ పక్షపాతం ప్రదర్శిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు.  సర్వేస్‌  నుంచి తొలగించడంతోపాటు క్రిమినల్‌ చర్యలు తప్పవు. తప్పులు చేస్తే చూసీచూడనట్టు ఉండబోము. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించే సిబ్బందిపై వేటు తప్పదు’’ అని ఎన్నికల అధికారులు హెచ్చరించారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : స్థానిక సంస్థల ఎన్నికల రణరంగంలో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) దారి తప్పుతు న్నారా? రాజ్యాంగబద్ధమైన కర్తవ్యాన్ని పక్కనబెట్టి అధికారి పార్టీ అభ్యర్థులకు ఏకపక్షంగా కొమ్ముకాస్తున్నారా? అంటే కొంతమంది ఆర్వోలు వ్యవహరిస్తున్న తీరు అవుననే మాట జిల్లా వ్యాప్తంగా వినిపిస్తోంది. తప్పులు చేస్తే క్షమించేది లేదని, నిబంధలను పాటించాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికా రులు ఆదేశాలు జారీచేశారు. ఇటీవల చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియలో నిబంధనలను అతిక్రమించిన 51 మంది ఆర్వోలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ నోటీసులు జారీచేసిన విషయం విధితమే. దీంతో నిబంధనలను అతిక్రమించే ఆర్వోల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
 
రిపీట్‌ చేస్తే అంతే! 
ఇటీవల చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 51 మంది రిటరి్నంగ్‌ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు. అధికార పారీ్టకి తొత్తులుగా మారి ఎన్నిక ల నిబంధనలను పూర్తిగా హరించారు. నామినేషన్ల పరిశీలన మొదలుకుని అభ్యర్థుల బలవంతపు విత్‌డ్రాల వరకు అనేక అక్రమాలకు సహకరించారనే ఫిర్యాదులతో జిల్లా ఎన్నికల అధికారి కఠినంగా స్పందించారు. నిబంధనలు పాటించని ఆ 51 మంది ఆర్వోలకు నోటీసులు జారీచేశారు. లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ ఆదేశించారు. ఈ క్రమంలో ఆ ఆర్వోల భవితవ్యం త్రిశంకు స్వర్గంలో పడింది.  

ఉద్యోగాలా? ప్రజాప్రతినిధుల మన్ననలా? 
తాత్కాలికంగా రాజకీయ నాయకుల మెప్పు పొందేందుకు తమ భవిష్యత్తును, సరీ్వసును ఫణంగా పెట్టొద్దని పలువురు సీనియర్‌ అధికారులు తోటి ఆర్వోలకు సూచిస్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని రేపు నోటీసులు, సస్పెన్షన్లు ఎదుర్కోవడం కంటే.. చట్టం, ఎన్నికల నిబంధనలకు తూచా తప్పకుండా పాటిస్తూ నిష్పక్షపాతంగా విధులు నిర్వహించడమే తమ ఉద్యోగాలకు శ్రీరామరక్ష అని గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. దశాబ్దాల కష్టంతో కాపాడుకున్న ప్రభుత్వ ఉద్యోగాలను ఊడగొట్టుకుంటారా? లేక చట్టం ప్రకారం నిష్పాక్షికంగా నడుచుకుని తమ పోస్టులను కాపాడుకుంటారా? అనేది ఇప్పుడు ప్రతి ఆర్వో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 51 మంది ఆర్వోలకు నోటీసులు జారీకావడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల నిబంధనలు పాటించి ఉద్యోగాలను కాపాడుకుంటారా.. లేక అధికార పక్షం చెప్పినట్లు విని సస్పెండ్‌ అవుతారా అన్నది ఇప్పుడు ప్రతి ఆర్వో ముందున్న పెద్ద ప్రశ్న.

ప్రతి ఆర్వోపైనా షాడో నిఘా 
కార్పొరేషన్‌ ఎన్నికల ప్రక్రియలో జరిగిన దారు ణాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం నిర్వహిస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ లో విధుల్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్‌వోపైనా ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు షాడో నిఘా ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి దొంగ సంతకాలను ప్రోత్సహించినా, పోటీలో ఉన్న అభ్యర్థులను బెదిరించి బలవంతపు విత్‌డ్రాలకు తావిచ్చినా, చెల్లుబాటు అయ్యే నామినేషన్లను సాకులు చెప్పి తిరస్కరించినా సదరు ఆర్వోల ఉద్యోగాలు పోవడం ఖాయ మని తెలుస్తోంది. నిబంధనలను అతిక్రమించే అధికారులపై బదిలీలతో సరిపెట్టకుండా తక్షణ సస్పెన్షన్‌ వేటుతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది.   

చిత్తూరు కార్పొరేషన్‌ ఆర్వోలకు జారీచేసిన ఉత్తర్వులు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement