కల్లూరులో టీడీపీకి భారీ షాక్‌.. | Kallur 70 Families Join YSRCP AP Politics Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కల్లూరులో టీడీపీకి భారీ షాక్‌..

Oct 26 2026 8:37 AM | Updated on Oct 26 2026 8:48 AM

Kallur 70 Families Join YSRCP AP Politics Andhra Pradesh

కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ వీడి వైఎస్సార్‌సీపీలో చేరిక

సాక్షి, కల్లూరు: స్థానిక సంస్థలు ఎన్నికల వేళ కల్లూరు అర్బన్‌ 44వ వార్డులో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. గత 34 సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగుతూ విసిగిపోయిన రెడ్డిపోగు అంజి, కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 70 కుటుంబాలు ఆదివారం టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు.

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా వైఎస్సార్‌సీపీలో చేరారు. దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరడం 44వ వార్డులో పార్టీకి మరింత బలాన్ని చేకూర్చింది. కాటసాని రాంభూపాల్‌రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో పెద్ద సంఖ్యలో కుటుంబాలు వైఎస్సార్‌సీపీ వైపు అడుగులు వేయడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.

పార్టీలో చేరిన వారందరకీ కాటసాని రాంభూపాల్‌రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కార్యకర్తలను ఎల్లప్పుడు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక, నగర మేయర్‌ అభ్యర్థి సుశీలమ్మ, మాజీ కార్పొరేటర్లు మైతాపు నరసింహులు, సాన శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి.. వైఎస్సార్‌సీపీలోకి చేరికలు..
జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి మరో అడుగు పడింది. కూటమి ప్రభుత్వ పాలనపై వ్యక్తమవుతున్న అసంతృప్తితో లక్కవరం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి.

పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు సమక్షంలో, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గంగా సురేష్‌ బండారు ఆధ్వర్యంలో, గ్రామ పార్టీ అధ్యక్షుడు చిర్ల దుర్గా రెడ్డి నేతృత్వంలో ఈ చేరికల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, సంక్షేమ పథకాల అమలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకత్వంపై నమ్మకంతోనే తాము పార్టీలో చేరుతున్నట్లు నూతనంగా పార్టీలోకి వచ్చిన కుటుంబాల సభ్యులు తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ నాయకులు సాదరంగా ఆహ్వానించి, కండువాలు కప్పారు. లక్కవరంలో వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ప్రజాదరణకు ఈ భారీ చేరికలే నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు మహంకాళి రంగప్రసాద్‌, వందనపు వెంకటేశ్వరరావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పొత్తు ఉత్తుత్తి.. దూస్తున్నారు కత్తి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement