అభిమాన ముద్దు.. ఆత్మీయ కౌగిలి | Huge Response In Visakhapatnam For Varudu Kalyani | Sakshi
Sakshi News home page

అభిమాన ముద్దు.. ఆత్మీయ కౌగిలి

Oct 26 2026 7:49 AM | Updated on Oct 26 2026 7:49 AM

Huge Response In Visakhapatnam For Varudu Kalyani

ఎన్నికల ప్రచారం అంటే కేవలం ఓట్ల అభ్యర్థనలు, నినాదాలు, మైకుల హోరు మాత్రమే కాదు.. ప్రజలతో నాయకులకు ఉండే ప్రేమానురాగాలకు అద్దం పట్టే వేదిక కూడా.. జీవీఎంసీ మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి చేపట్టిన ప్రచార పర్వంలో సరిగ్గా అలాంటి ఒక అరుదైన, కంటికి ఇంపైన దృశ్యం విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద ఆవిష్కృతమైంది.  ప్రచారంలో భాగంగా మత్స్యకార కుటుంబాలను పలకరిస్తూ ముందుకెళ్తున్న వరుదు కల్యాణికి ఒక వృద్ధురాలు ఎదురైంది. 

ముడతలు పడిన ఆ చేతులు, అనుభవాల సముద్రమైన ఆ కళ్లు.. ప్రజాప్రతినిధిగా వస్తున్న కల్యాణిని చూడగానే అమితమైన వాత్సల్యంతో నిండిపోయాయి. ఏమాత్రం సంకోచించకుండా ఆ అవ్వ కల్యాణిని దగ్గరకు తీసి, చెంపపై ముద్దుపెడుతూ గుండెలకు హత్తుకుంది. ఆ ఆత్మీయ స్పర్శకు వరుదు కల్యాణి మురిసిపోతూ, చిరునవ్వుతో ఆ వృద్ధురాలిని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఓ అమ్మ ఇచ్చిన దివ్యదీవెనగా దీనిని భావిస్తున్నానని వరుదు కల్యాణి స్పందించారు.
 – ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement