భీమునిపట్నం: స్కేటింగ్ చేస్తూ జ్యోతిర్లింగాల దర్శనానికి వెళుతున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సింటు సర్గం(28) భీమిలి వద్ద ఆదివారం కాసేపు ఆగాడు. ఈ సందర్భంగా తనతో మాట్లాడిని స్థానికులతో కొన్ని విషయాలు పంచుకున్నారు. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ద్వాదశ(12) జ్యోతిర్లింగాలను స్కేటింగ్ చేస్తు దర్శించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికి రెండు జ్యోతిర్లింగాలను దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు దక్షిణ భారత దేశంలోని రామేశ్వరం, శ్రీశైలం జ్యోతిర్లింగాల దర్శనానికి వెళుతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో భీమిలి మీదుగా విశాఖ వెళుతూ కొద్ది సేపు ఇక్కడ ఆగాడు. అతని సంకల్పం తెలుసుకున్న పలువురు ప్రశంసించారు.


