విషాదంలోనూ.. మానవత్వం! | - | Sakshi
Sakshi News home page

విషాదంలోనూ.. మానవత్వం!

Oct 26 2026 7:18 AM | Updated on Oct 26 2026 7:18 AM

పెందుర్తి: పుట్టెడు దుఃఖంలోనూ ఓ కుటుంబం గొప్ప మనసు చాటుకుంది. కుటుంబ పెద్దను కోల్పోయిన విషాదంలోనూ ఆయన అవయవాలను దానం చేసి పలువురి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. పెందుర్తి మండలం చింతలగ్రహారానికి చెందిన బొడ్డేటి సత్యనారాయణ (61) కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న సాయిహెల్పింగ్‌ హ్యాండ్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్‌.. సత్యనారాయణ కుటుంబ సభ్యులను సంప్రదించి అవయవదానంపై అవగాహన కల్పించారు. దీంతో ఆయన భార్య లక్ష్మీదేవి, కుమారుడు వరహాప్రసాద్‌, కుమార్తె సంధ్య, సోదరులు వెంకటరావు, పవన్‌కుమార్‌ అవయవదానానికి అంగీకరించారు. విమ్స్‌ డైరెక్టర్‌, జీవన్‌దాన్‌ చీఫ్‌ కోఆర్డినేటర్‌ జి.మన్మధరావు, ట్రాన్స్‌ప్లాంట్‌ ఇన్‌చార్జి రౌతు సంజీవ్‌ ఆధ్వర్యంలో సత్యనారాయణ కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కళ్లు సురక్షితంగా సేకరించారు. తీవ్ర విషాదంలోనూ అవయవదానానికి అంగీకరించి మానవత్వాన్ని చాటుకున్న సత్యనారాయణ కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement