వరుదు కల్యాణికి సామాజిక వర్గాల అండ! | - | Sakshi
Sakshi News home page

వరుదు కల్యాణికి సామాజిక వర్గాల అండ!

Oct 26 2026 7:18 AM | Updated on Oct 26 2026 7:18 AM

● రెడ్డి, కళింగ వైశ్య సంఘాల ఆత్మీయ సమావేశాలు ● వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి విజయానికి సంఘాల ప్రతినిధుల భరోసా

సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణికి మద్దతుగా వివిధ సామాజిక వర్గాల నాయకులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని హెచ్‌బీ కాలనీ రాధాకృష్ణ ఫంక్షన్‌ హాల్‌లో కాయల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వరుదు కల్యాణితో పాటు వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాయల సూరరెడ్డి, రామకృష్ణారెడ్డి, మురళీకృష్ణారెడ్డితో పాటు పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థులు, రెడ్డి సంఘ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

కళింగ వైశ్య సంఘం ఆత్మీయ సమావేశం

హోటల్‌ దసపల్లా ఎగ్జిక్యూటివ్‌ కోర్ట్‌లో కళింగ వైశ్య సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ జిల్లా బీసీ విభాగ కళింగ వైశ్య సంఘం అధ్యక్షుడు తాళాసు సాయి మోహన్‌, సకలాభక్తుల ప్రసాద్‌రావు, విశాఖ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు పట్నాన వెంకటరమణ, వారణాసి శ్రీను, భోగి జనార్దన్‌రావు, రంగనాథ్‌, పొట్నూరు మధుసూదన్‌రావుతో పాటు కళింగ వైశ్య సంఘ ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో వరుదు కల్యాణి విజయానికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని సామాజిక వర్గ ప్రతినిధులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement