కూటమి ప్రభుత్వానికి జీవీఎంసీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వానికి జీవీఎంసీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి

Oct 26 2026 7:18 AM | Updated on Oct 26 2026 7:18 AM

సింహాచలం: సూపర్‌ సిక్స్‌ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి జీవీఎంసీ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ విశాఖ పార్లమెంటరీ సమన్వయకర్త, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి పిలుపునిచ్చారు. 120వ వార్డు అడవివరం ప్రాంతం చాకిరేవుకొండలో ఆదివారం రాత్రి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి కర్రి అప్పలస్వామికి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలన మోసపూరితమేనన్నారు. ఒక్క కొత్త పింఛన్‌ కూడా మంజూరు చేయలేదన్నారు. పంచగ్రామాల భూ సమస్యను కూడా పట్టించుకోవడం లేదన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్పొరేటర్‌ అభ్యర్థి కర్రి అప్పలస్వామి మాట్లాడుతూ చాకిరేవుకొండలో విద్యుద్దీపాలు ఏర్పాటు చేస్తామని, సామాజిక భవనాన్ని కల్యాణ మండపంగా మారుస్తామని, కొండపై ఉన్న అంగన్‌వాడీ భవనాన్ని మార్పు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కొలసు ఈశ్వరరావు, నాయకులు లంక సత్తిబాబు, కర్రి సత్తిబాబు, ఆకుల నూకరాజు, తొమురోతు రాము, బోర మోహన్‌రెడ్డి, బోరకృష్ణారెడ్డి, బోర ప్రసాద్‌రెడ్డి, ఆదిరెడ్డి, బొట్టా శ్రీను, మజ్జిఽ దర్మా పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ విశాఖ పార్లమెంటరీ

సమన్వయకర్త బొత్స ఝాన్సీలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement