రొమ్ము క్యాన్సర్‌ విజేతలు స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

రొమ్ము క్యాన్సర్‌ విజేతలు స్ఫూర్తిదాయకం

Oct 26 2026 7:18 AM | Updated on Oct 26 2026 7:18 AM

ఎంవీపీ కాలనీ: రొమ్ము క్యాన్సర్‌ను జయించిన ‘పింక్‌ ఛాంపియన్స్‌’ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని మహాత్మాగాంధీ క్యాన్సర్‌ ఆస్పత్రి ఎండీ, చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్‌ ఆస్పత్రి ప్రాంగణంలో పింక్‌ ఛాంపియన్స్‌తో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రిలో రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స పొందిన 100 మందికి పైగా మహిళలు పాల్గొని, తమ అనుభవాలను పంచుకున్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మురళీకృష్ణ మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్‌ చికిత్సలో ఆధునిక వైద్య విధానాలతో పాటు రోగుల్లో ఆత్మస్థైర్యం నింపడం ఎంతో ముఖ్యమన్నారు. రోగులకు చికిత్స అందించడంతోనే తమ బాధ్యత ముగిసిపోదని, చికిత్స అనంతరం కూడా వారు ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో, ఆనందంగా జీవించాలన్నదే ఆస్పత్రి లక్ష్యమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూపొందించిన ‘క్యాన్సర్‌ ఛాంపియన్స్‌ ప్రివిలేజ్‌ కార్డు’ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రొమ్ము క్యాన్సర్‌ను జయించిన మహిళలతో పాటు ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement