పొత్తు ధర్మం ఎక్కడ పాటించారు? | Jana Sena Leaders Confront Minister Savitha In Penukonda Over TDP Jana Sena Seat Sharing Dispute | Sakshi
Sakshi News home page

పొత్తు ధర్మం ఎక్కడ పాటించారు?

Oct 26 2026 8:59 AM | Updated on Oct 26 2026 10:11 AM

TDP And Janasena Leaders Intranl Fight In Sathya Sai District

మంత్రి సవితను అడ్డుకుంటున్న జనసేన నాయకులు, కార్యకర్తలు

పెనుకొండ(శ్రీసత్యసాయి జిల్లా : ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను జనసేన నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి సవిత ఆదివారం పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు వెంకటరెడ్డిపల్లికి ఎన్నికల ప్రచార నిమిత్తం వెళ్లారు. అక్కడే ప్రచారంలో ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు పొత్తులో భాగంగా తమ పార్టీకి ఈ వార్డు కేటాయించి...మళ్లీ టీడీపీ అభ్యర్థిని ఎలా బరిలో నిలుపుతారని మంత్రిని నిలదీశారు. పార్టీ పెద్దల నిర్ణయం అంటూ మంత్రి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. 

వార్డు కౌన్సిలర్‌ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్న లోకేష్‌ మాట్లాడుతూ పార్టీ సీనియర్లు అయిన తమతో చర్చించకుండానే ఏకపక్షంగా 13వ వార్డు జనసేనకు ఎలా కేటాయిస్తారని మంత్రిని ప్రశ్నించారు. తమ పార్టీకి అనుకూలమైన వార్డును.. అది కూడా తమతో చర్చించి ఇవ్వాలే గానీ మీరే ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తారని నిలదీశారు. పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే బెదిరింపులకు దిగుతారా? పొత్తు ధర్మం ఎక్కడ పాటించారు? అంటూ మండిపడ్డారు. తన కార్యాలయానికి వస్తే మాట్లాడుకుందామంటూ మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత జనసేన కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మీ ఓట్ల కోసమైతే అందరూ కావాలంటూ మా ఇళ్ల వద్దకు వస్తారు. ఇప్పుడు మాత్రం మాతో మాట్లాడకుండా వెళ్లిపోతారా? మేము మీ ఇంటి వద్దకు రావాలా? సీట్ల పంపిణీ మాకు తెలియకుండానే చేపట్టి, మా పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి అన్యాయం చేస్తారా? మా నాయకుడు పవన్‌ కల్యాణ్‌ లేకుంటే టీడీపీకి అధికారం వచ్చి ఉండేదే కాదు. 

పెనుకొండలో జనసేనకు విలువే లేకుండా చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 240 స్టోర్లు (చౌక డిపోలు) ఉంటే.. జనసేన వారికి ఒక్కటి మాత్రమే కేటాయించారు. మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ పదవులు రెండు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. పార్టీ భవిష్యత్తు కోసం పోటీ చేస్తే బెదిరింపులకు దిగుతున్నారు. మా వెంట నడిచే వారి రేషన్‌ కార్డులు, పింఛన్లు తొలగిస్తామంటూ బెదిరిస్తున్నారు’ అని పెనుకొండ పట్టణ జనసేన కన్వీనర్, 2వ వార్డు అభ్యర్థి లోకేష్‌  ఆవేదన వెలిబుచ్చారు.  

ఇదీ చదవండి: అభిమాన ముద్దు.. ఆత్మీయ కౌగిలి


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement