సాక్షి; తాడేపల్లి: ఏపీలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా భక్తులకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తల్లి దీవెనలతో ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ఉండాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, భక్తుల కొంగుబంగారం.. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అమ్మవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలనీ.. ఆ తల్లి దీవెనలతో ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అని పోస్టు చేశారు.
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, భక్తుల కొంగుబంగారం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అమ్మవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, ఆ తల్లి దీవెనలతో ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 26, 2026
ఇదీ చదవండి: కూటమిలో ట్విస్ట్.. పొత్తు ధర్మం ఎక్కడ పాటించారు?


