ప్రపంచ అత్యుత్తమ వన్డే జట్టు ఇదే.. ఆసీస్‌, పాక్‌ ఆటగాళ్లకు ఘోర అవమానం! | Cheteshwar Pujara Picks World ODI XI; No Pakistani | Sakshi
Sakshi News home page

ప్రపంచ అత్యుత్తమ వన్డే జట్టు ఇదే.. ఆసీస్‌, పాక్‌ ఆటగాళ్లకు ఘోర అవమానం!

Oct 26 2026 12:10 PM | Updated on Oct 26 2026 12:12 PM

Cheteshwar Pujara Picks World ODI XI; No Pakistani

వన్డే ప్రపంచకప్‌‌-2027కు సమయం దగ్గరపడుతుండటంతో మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా  భారత మాజీ టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ప్రస్తుత ప్రపంచ వన్డే బెస్ట్ ప్లెయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. 

ఈ తుది జట్టులో భారత్ నుంచి ఆరుగురు ఆటగాళ్లకు చోటు దక్కడం విశేషం. అయితే వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ల నుంచి ఒక్క ప్లేయర్‌కు కూడా పుజారా జట్టులో చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఓపెనర్లుగా రోహిత్, గిల్‌
పుజారా తన ఎంచుకున్న జట్టులో  ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లకు అవకాశమిచ్చాడు.  మూడో స్థానంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి చోటు ఇచ్చాడు.  నాలుగు, ఐదు స్ధాన్లాలో వరుసగా స్టార్ క్రికెటర్లు జో రూట్‌, కేఎల్ రాహల్‌కు పుజారా ఛాన్స్ ఇచ్చాడు. ఈ జట్టులో స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ ఎంపికయ్యాడు. 

ఆల్‌రౌండర్ల కోటాలో సౌతాఫ్రికా స్టార్ మార్క్ జాన్సెన్‌ను పుజారా సెలక్ట్ చేశాడు. స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌.. ఫాస్ట్ బౌలర్లగా జస్ప్రీత్ బుమ్రా, మాట్ హెన్రీ, జైడన్ సీల్స్‌కు చోటు దక్కింది. జస్ప్రీత్‌ బుమ్రా గత మూడేళ్లలో కేవలం 2 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ, తన బౌలింగ్ స్కిల్స్‌ ఆధారంగా పుజారా అతడికి చోటు కల్పించడం విశేషం.

పుజారా ఎంచుకున్న వరల్డ్ వన్డే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, జో రూట్, కేఎల్ రాహుల్, షాయ్ హోప్, మార్కో జాన్సెన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, జేడెన్ సీల్స్, మాట్ హెన్రీ.
చదవండి: ENG vs PAK: పాకిస్తాన్ ప్లేయ‌ర్ల ప్ర‌పంచ రికార్డు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement