టాప్‌ లేపిన భారత స్పిన్నర్‌.. 99 పరుగులకే ఆలౌట్‌ | MP-Spinner-Saransh Jain-7-Wicket-Hual-Bihar-99 Runs All-Out-Ranji Trophy | Sakshi
Sakshi News home page

Ranji Trophy: టాప్‌ లేపిన భారత స్పిన్నర్‌.. 99 పరుగులకే ఆలౌట్‌

Oct 26 2026 12:08 PM | Updated on Oct 26 2026 1:16 PM

MP-Spinner-Saransh Jain-7-Wicket-Hual-Bihar-99 Runs All-Out-Ranji Trophy

Photo Credit: Twitter

రంజీ ట్రోఫీలో భాగంగా ఎలైట్ గ్రూప్‌-ఏలో బీహార్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ బౌల‌ర్ సారాన్ష్‌ జైన్ ఏడు వికెట్ల‌తో చెల‌రేగాడు. సారాంశ్ ధాటికి బీహార్ జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 99 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బీహార్‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్ బౌల‌ర్లు ఆది నుంచే చుక్క‌లు చూపారు. 

ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఓపెన‌ర్ న‌మ‌న్ గౌర‌వ్‌తో పాటు వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన స్ర‌మ‌న్ నిగ్రోధ్ డ‌కౌట్ అయ్యారు. ఆ త‌ర్వాత బౌలింగ్‌కు వ‌చ్చిన స్పిన్న‌ర్ సారాన్ష్ వ‌రుస ఓవ‌ర్ల‌లో వికెట్లు తీసి బీహార్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ ద‌శ‌లో ఓపెన‌ర్ మంగ‌ల్ మ‌హ్‌రౌర్ (42) ఒంట‌రిపోరాటం చేశాడు. మిడిలార్డ‌ర్‌లో ఆయుశ్ లోహారుకా (1), కెప్టెన్ స‌కిబుల్ గ‌ని (2), ఆకాశ్ రాజ్ (0) దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు.

లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో సూర‌జ్ క‌శ్య‌ప్ (15) కాసేపు వికెట్ల ప‌తనాన్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే మ‌రోద‌ఫా బౌలింగ్‌కు వ‌చ్చిన సారాన్ష్ బీహార్‌ను దెబ్బ‌కొట్టాడు. ఇక చివ‌రి వికెట్‌గా మంగ‌ల్ వెనుదిర‌గ‌డంతో బీహార్ ఇన్నింగ్స్‌కు తెర‌ప‌డింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ బౌల‌ర్లలో సారాన్ష్ జైన్ (13-1-40-7) అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, ఆవేశ్‌ఖాన్ రెండు, కుమార్ కార్తికేయ ఒక వికెట్ తీశారు. 

కాగా ఈ సీజ‌న్‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ తాము ఆడిన రెండు మ్యాచ్‌ల‌ను డ్రా చేసుకొని ఆరు పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో కొన‌సాగుతుండ‌గా, ఆడిన రెండు మ్యాచ్‌లోనూ ప‌రాజ‌యం చ‌విచూసిన బీహార్ ఏడో స్థానంలో ఉంది. ఇక 33 ఏళ్ల సారాన్ష్ జైన్ శ్రీలంక‌తో జ‌రిగిన టెస్టు సిరీస్ ద్వారా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 

కొలంబో వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో ఆడిన సారాన్ష్ జైన్ రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి మూడు వికెట్లు తీశాడు. లంక బ్యాట‌ర్ల వీరోచిత పోరాటంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. టెస్టు సిరీస్‌ను భార‌త్ 1-0తో కైవ‌సం చేసుకుంది.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement