Photo Credit: Twitter
న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో ఇండియా-ఏ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 119 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 488 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అజేయ అర్థసెంచరీ సాధించాడు.
75 బంతుల్లో 51 పరుగులతో అజేయంగా నిలిచిన సుందర్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు ఉన్నాయి. ఆకాశ్ దీప్ క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 284 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. అంతకముందు దేవదత్ పడిక్కల్ (199) పరుగు తేడాతో డబుల్ సెంచరీ చేజార్చుకోగా, సాయి సుదర్శన్ (91) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

Photo Credit: Twitter
ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 215 పరుగులు జోడించి భారత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. యశ్ రాథోడ్ (66) అర్థసెంచరీ చేయగా, లోయర్ ఆర్డర్‌లో అన్షుల్ కంబోజ్ (23), అకిబ్ నబీ (38) సుందర్‌కు సహకరించడంతో ఇండియా-ఏ స్కోరు 450 మార్క్‌ను దాటింది. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్, జాక్ గిబ్సన్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.
మ్యాచ్‌కు రేపు ఆఖరి రోజు కావడంతో తొలి సెషన్‌లోనే భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశముంది. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు కూడా పొంచి ఉండడంతో డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి:


