Photo Credit: BCCI Twitter
టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయం విషయంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. వెల్లింగ్‌టన్ వేదికగా న్యూజిలాండ్‌తో రేపు జరగనున్న మూడో టీ20కి కూడా ఇషాన్ కిషన్ అందుబాటులో ఉండడని బీసీసీఐ సోమవారం ‘ఎక్స్’ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. మూడో టీ20కి ఇషాన్ దూరమవ్వడంతో అతడి స్థానంలో ఎంపికైన కుమార్ కుషాగ్ర జట్టుతో పాటే ఉంటాడని పేర్కొంది.
‘‘గజ్జల్లో గాయంతో బాధపడుతున్న ఇషాన్ కిషన్ వేగంగానే కోలుకుంటున్నాడు. అతను ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో రేపు వెల్లింగ్‌టన్‌లో జరగనున్న మూడవ టీ20ఐకి దూరమయ్యాడు. బీసీసీఐ వైద్య బృందం ఇషాన్ పురోగతిని పర్యవేక్షిస్తోంది. దీంతో కుమార్ కుశాగ్ర జట్టుతోనే ఉంటాడు’’ అని బీసీసీఐ తెలిపింది.
ఇక మూడో టీ20కి కూడా ఇషాన్ కిషన్ దూరమవ్వడంతో వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశమిస్తారా లేక శివమ్ దూబేను ఆడిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే రెండో టీ20లో ఇషాన్ కిషన్ స్థానమైన మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన వైభవ్ సూర్యవంశీ 8 బంతులాడి కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో వైభవ్ ఆటపై విమర్శలు వస్తున్నప్పటికీ, అతడికి మరో చాన్స్ ఇచ్చే యోచనలో జట్టు మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
తొలి టీ20లో ఆడిన ఇషాన్ కిషన్ గజ్జల్లో గాయం కారణంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐదో స్థానంలో వచ్చినప్పటికీ ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. రీఎంట్రీ తర్వాత మంచి ఫామ్ కనబరుస్తున్న ఇషాన్ కిషన్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇషాన్ 67 టీ20ల్లో 1,955 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 13 అర్థసెంచరీలున్నాయి.
Update Ishan Kishan is recovering well from his low grade right adductor strain, which he sustained during the first T20I of the series against New Zealand. He is yet to regain match fitness and is ruled out of the third T20I to be played on October 27, 2026 in Wellington. The BCCI Medical Team is monitoring Ishan's progress. Kumar Kushagra will continue to be with the team for the third T20I. #TeamIndia | #NZvIND
— BCCI (@BCCI) October 26, 2026
ఇదీ చదవండి:


