Photo Credit: Twitter
న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్ పరుగు తేడాతో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. 199 పరుగులు చేసిన పడిక్కల్ జాక్ గిబ్సన్ బౌలింగ్‌లో మిచెల్ హేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ద్విశతకానికి పరుగు దూరంలో నిలిచిపోయిన పడిక్కల్ బాధాతప్త హృదయంతో పెవిలియన్ చేరాడు. 248 బంతులాడిన పడిక్కల్ 199 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
పడిక్కల్ ఔటా? నాటౌటా?
అయితే పడిక్కల్ ఔటైన విధానం వివాదాస్పదంగా మారింది. గిబ్సన్ వేసిన బంతి లెగ్‌సైడ్ దిశగా వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. బంతి బ్యాట్‌కు తాకినట్లు శబ్దం వినిపించడంతో అంపైర్ ఔటిచ్చాడు. దీంతో పడిక్కల్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. బంతి తన బ్యాట్‌కు ఎంత దూరంలో వెళుతుందనేది అంపైర్‌కు వివరించాడు.
బంతి బ్యాట్‌ను దాటినప్పుడు కొంత శబ్దం వచ్చింది, కానీ అది బహుశా ప్యాడ్‌కు తగిలి ఉంటుందని పడిక్కల్ వాదన. అప్పీల్ కూడా అంత నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ, అంపైర్ ఔట్ అంటూ వేలు పైకెత్తడంతో పడిక్కల్ ఏం చేయలేక నిరాశగా వెళ్లిపోయాడు. అనధికారిక టెస్టుల్లో డీఆర్‌ఎస్ అవకాశం ఉండదు. దీంతో ఒక అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది.
215 రన్స్ భాగస్వామ్యం
ఇక తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసిన పడిక్కల్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తన ఫామ్‌ను ప్రదర్శించాడు. కేఎల్ రాహుల్, జైస్వాల్, కెప్టెన్ ధ్రువ్ జురేల్‌లు విఫలమైనప్పటికీ, పడిక్కల్ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. సాయి సుదర్శన్ (91)తో కలిసి నాలుగో వికెట్‌కు 215 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన పడిక్కల్ భారత-ఏ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.
టీ విరామ సమయానికి ఇండియా-ఏ జట్టు 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. యశ్ రాథోడ్ (66) అజేయ అర్థసెంచరీతో ఆడుతుండగా, సుందర్ (2) అతడికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ 173 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ గిబ్సన్ రెండు వికెట్లు తీయగా, సిమోన్ కీన్, క్రిస్టియన్ క్లార్క్, ఫ్రేసర్ షీట్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు.
🔴DEVDUTT PADIKKAL ANGRY OVER A CONTROVERSIAL UMPIRING DECISION! 🤯 - Padikkal was batting on 199 when the bowler delivered the ball wide. - Padikkal tried to play the delivery, but the umpire suddenly declared him out, apparently believing the ball had edged the bat. - Padikkal was left shocked by the decision. Note: There is no DRS in unofficial Test matches. ❌ https://t.co/WfZMaQfAXM
— Sam (@cricsam02) October 26, 2026
ఇదీ చదవండి:


