న్యూజిలాండ్‌-ఏతో టెస్టు.. సెంచ‌రీతో చెల‌రేగిన ప‌డిక్క‌ల్‌ | Devdutt-Padikkal-Unbeaten-Century-Vs NZA-1st Unofficial Test Match | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌-ఏతో టెస్టు.. సెంచ‌రీతో చెల‌రేగిన ప‌డిక్క‌ల్‌

Oct 26 2026 7:20 AM | Updated on Oct 26 2026 7:25 AM

Devdutt-Padikkal-Unbeaten-Century-Vs NZA-1st Unofficial Test Match

Photo Credit: Twitter

న్యూజిలాండ్‌-ఏతో జ‌రుగుతున్న తొలి అన‌ధికారిక టెస్టులో భార‌త్-ఏ జ‌ట్టు రెండో ఇన్నింగ్స్‌లో నిల‌క‌డ‌గా ఆడుతుంది. వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ అజేయ సెంచ‌రీకి తోడు సాయి సుద‌ర్శ‌న్ (91) సెంచ‌రీ చేజార్చుకున్న‌ప్ప‌టికీ, ఇద్ద‌రు క‌లిసి టీమిండియాను ఆధిక్యంలోకి తీసుకొచ్చారు. 106-2 క్రితం రోజు స్కోరుతో మూడో రోజు ఆట‌ను ప్రారంభించిన ఇండియా-ఏ జ‌ట్టుకు ప‌డిక్క‌ల్‌, సాయి సుద‌ర్శ‌న్ నిల‌క‌డ ప్ర‌ద‌ర్శిస్తూ ప‌రుగులు రాబ‌ట్టారు. 

ఈ క్ర‌మంలో సాయి సుద‌ర్శ‌న్ 128 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన‌ప్పుడల్లా బౌండ‌రీలు బాదుతూ స్కోరును పెంచారు. ఈ క్ర‌మంలో వేగంగా ఆడిన ప‌డిక్క‌ల్‌ ప‌డిక్క‌ల్ 128 బంతుల్లో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. జైడ‌న్ లెన్నోక్స్ బౌలింగ్‌లో ప‌డిక్క‌ల్‌ సిక్స‌ర్ బాది శ‌త‌కం పూర్తి చేసుకోవ‌డం విశేషం. 

అయితే 91 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద క్రిస్టియ‌న్ క్లార్క్ బౌలింగ్‌లో వెనుదిరిగిన సాయి సుద‌ర్శ‌న్ సెంచ‌రీ చేజార్చుకున్నాడు. కాగా ప‌డిక్క‌ల్‌, సాయి సుద‌ర్శ‌న్ క‌లిసి నాలుగో వికెట్‌కు 340 బంతుల్లో 215 ప‌రుగులు జోడించారు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన ధ్రువ్ జురేల్ (2) ఎక్కువ‌సేపు నిల‌వ‌లేదు. అనంత‌రం బ్యాటింగ్‌కు వ‌చ్చిన య‌శ్ రాథోడ్ నిల‌క‌డ ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో ప‌డిక్క‌ల్ డబుల్ సెంచ‌రీ దిశ‌గా సాగుతున్నాడు. 

79 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఇండియా-ఏ జ‌ట్టు 4 వికెట్ల న‌ష్టానికి 297 ప‌రుగులు చేసింది. ప‌డిక్క‌ల్ (172 నాటౌట్‌), య‌శ్ రాథోడ్ (31 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం భార‌త‌-ఏ జ‌ట్టు 108 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.  న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో జాక్ గిబ్స‌న్‌, క్రిస్టియ‌న్ క్లార్క్‌, సిమోన్ నీ, ఫ్రేస‌ర్ షీట్‌లు త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. అంత‌క‌ముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 317 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

ఇదీ చదవండి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement