దీప్తీ ఆల్‌రౌండ్‌ షో.. జింబాబ్వేను చిత్తు చేసిన భారత్‌ | IND W vs ZIM W 2nd ODI: India Women Crush Zimbabwe by 121 Runs to Seal Series 2-0 | Sakshi
Sakshi News home page

IND vs ZIM: దీప్తీ ఆల్‌రౌండ్‌ షో.. జింబాబ్వేను చిత్తు చేసిన భారత్‌

Oct 25 2026 9:20 PM | Updated on Oct 25 2026 9:21 PM

IND W vs ZIM W 2nd ODI: India Women Crush Zimbabwe by 121 Runs to Seal Series 2-0

వ‌డోద‌ర వేదిక‌గా జింబాబ్వే మ‌హిళ‌ల జ‌ట్టుతో జ‌రిగిన రెండో వ‌న్డేలో 121 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. త‌ద్వారా మ‌రో మ్యాచ్ మిగిలుండ‌గానే మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-0తో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు సాధించింది.

భార‌త ఇన్నింగ్స్‌లో మాజీ కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌( 121 బంతుల్లో 15 ఫోర్లతో 126 పరుగులు),  దీప్తీ శర్మ(86 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 106 పరుగులు) అద్భుత సెంచ‌రీలతో చెల‌రేగారు. వారిద్ద‌రితో పాటు ఓపెనర్ ప్రతీకా రావల్‌(61) హాఫ్ సెంచరీతో రాణించింది. జింబాబ్వే బౌలర్లలో నోమ్వెలో సిబాన్డా 2 వికెట్లు తీయగా, ఒలిండా చారే, మిచెల్ మవుంగా, టెండాయ్ మకూషా, న్యాషా గ్వాన్జుర తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

వైష్ణ‌వి మ్యాజిక్‌
అనంత‌రం 329 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన జింబాబ్వే 48.5 ఓవ‌ర్ల‌లో 207 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భార‌త స్పిన్న‌ర్ వైష్ణ‌వి శ‌ర్మ నాలుగు వికెట్ల‌తో ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టును దెబ్బ‌తీసింది. ఆమెతో పాటు దీప్తీ శ‌ర్మ మూడు, సయాలి సత్ఘరే, శ్రీచ‌ర‌ణి త‌లా వికెట్ సాధించారు. జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో మోడెస్టర్ ముపాచిక్వా(49),చిపో ముగేరి-తిరిపానో(46) టాప్ స్కోరర్ల‌గా నిలిచారు.
చదవండి: బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ మెహెదీ హసన్ కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement