Photo Credit: Twitter
ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్‌గా ఎంపికైన కీరన్ పొలార్డ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొత్త కోచింగ్ బాధ్యతల కారణంగా SA20 సీజన్‌కు తాను అందుబాటులో ఉండబోనని జోబర్గ్స్ సూపర్‌కింగ్స్ యాజమాన్యానికి తెలియజేశాడు. అక్టోబర్ 7న జరిగిన SA20 వేలంలో సీఎస్‌కే ఆధ్వర్యంలోని జోహన్నెస్‌బర్గ్ ఆధారిత ఫ్రాంచైజీ రూ.1.5 మిలియన్లకు కీరన్ పొలార్డ్‌ను కొనుగోలు చేసింది.
ఇక ముంబై ఇండియన్స్ యజమాన్యం SA20లో MI కేప్ టౌన్‌కు ఓనర్‌గా ఉంది. పొలార్డ్ గతంలో ఈ పోటీలో MI కేప్ టౌన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ముంబై ఇండియన్స్‌తో పొలార్డ్‌కు ఉన్న సుదీర్ఘ అనుబంధం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. SA20 లీగ్ నుంచి వైదొలగడం వల్ల, ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌లో కోచ్‌గా తన కొత్త బాధ్యతలపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పొలార్డ్ తెలిపాడు.
అయితే ముంబై యాజమాన్యం పొలార్డ్ వేరే లీగ్స్‌లో పాల్గొనడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇంతకముందే స్పష్టం చేశాయి. కానీ పొలార్డ్ మాత్రం హెడ్‌కోచ్‌గా నియమించి తన బాధ్యతను పెంచిన ముంబై ఇండియన్స్‌కే పూర్తిగా సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నాడు.
SA20 టోర్నమెంట్ నుండి వైదొలగాలన్న పొలార్డ్ నిర్ణయాన్ని సీఎస్కే చీఫ్ ఎగ్జిక్యూటివ్ కాశీ విశ్వనాథన్ ధృవీకరించారు. ''తాను జోబర్గ్ సూపర్ కింగ్స్ తరఫున ఆడలేనని పొలార్డ్ మాకు తెలియజేశాడు. జనవరి-ఫిబ్రవరిలో జరిగే టోర్నమెంట్ కోసం తాము ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నాం.'' అని చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి:


