Photo Credit: Twitter
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ వికెట్ తేడాతో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షాదాబ్ ఖాన్ వీరోచిత సెంచరీతో జట్టును గెలిపించడమే గాక ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. మ్యాచ్‌లో 96 బంతులెదుర్కొన్న షాదాబ్ ఖాన్ 113 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిది లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా షాదాబ్ ఖాన్ నిలిచాడు. గతంలో ఐర్లాండ్ బ్యాటర్ సిమీ సింగ్ (100 నాటౌట్ వర్సెస్ సౌతాఫ్రికా) పేరిట ఉన్న రికార్డును షాదాబ్ తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ క్రమంలో షాదాబ్ ఖాన్ చివరి వికెట్‌కు హరీస్ రవూఫ్ (7 నాటౌట్)తో కలిసి 80 బంతుల్లో 89 పరుగులు జోడించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో విజయవంతమైన ఛేదనల్లో చివరి వికెట్‌కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యంగా రికార్డులకెక్కింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 46.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (111 బంతుల్లో 105; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కగా... స్యామ్ కరన్ (42; 5 ఫోర్లు), అట్కిన్సన్ (36 నాటౌట్; 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.
పాక్ బౌలర్లలో కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది 4 వికెట్లు పడగొట్టగా... రజాఉల్లా, అరాఫత్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 47.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసి గెలిచింది. ఒక దశలో 154/9తో ఓటమి అంచున నిలిచిన జట్టును ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షాదాబ్ ఖాన్ (96 బంతుల్లో 113 నాటౌట్; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ శతకంతో విజయతీరాలకు చేర్చాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ మూడు వికెట్లు తీయగా, లియామ్ డాసన్, గస్ అకిన్‌సన్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. వన్డే ట్రై సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన పాకిస్తాన్ ఫైనల్‌కు దూసుకెళ్లగా... వరుసగా మూడో పరాజయంతో ఇంగ్లండ్ ఫైనల్ రేసుకు దూరమైంది. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం శ్రీలంకతో పాకిస్తాన్ ఆడుతుంది.
Pakistan pull victory from the jaws of defeat against England thanks to Shadab Khan's sensational hundred 🔥 Details ➡️ https://t.co/aeu0dFPM57 https://t.co/kfO7fxS542
— ICC (@ICC) October 25, 2026
Haris Rauf hits the winning runs as Pakistan snatch victory from the jaws of defeat! #PAKvENG https://t.co/PXdNqnEEEk
— Cricinfo (@cricinfo) October 25, 2026
A inng to remember for life time and what a stage to bring maiden 💯 character shown by @76Shadabkhan excellent from @HarisRauf14 from other end congratulations @TheRealPCB for reaching into the final🫡 https://t.co/zSkxIeEIm1
— Aamir Jamal (@iaamirjamal) October 25, 2026
ఇదీ చదవండి:


