breaking news
Sakibul Gani
-
32 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్ సూర్యవంశీ కెప్టెన్
దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో తొలి రోజే రికార్డుల మోత మోగింది. అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు బిహార్ ఆటగాళ్లు (వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ లోహారుకా, సకీబుల్ గనీ) విధ్వంసకర శతకాలు బాదారు. ఫలితంగా లిస్ట్-ఏ క్రికెట్ (50 ఓవర్ల ఫార్మాట్) చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్ (574/6)నమోదైంది.ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్ సూర్యవంశీబిహార్ ఇన్నింగ్స్‌లో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీది తొలి శతకం. వైభవ్ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, లిస్ట్-ఎ క్రికెట్లో అత్యంత పిన్న వయసులో (14 ఏళ్ల 272 రోజులు) ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. అలాగే లిస్ట్-ఏ క్రికెట్లో అన్మోల్ప్రీత్ సింగ్ (35 బంతులు) తర్వాత అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసిన భారత ఆటగాడిగానూ నిలిచాడు. ఓవరాల్‌గా లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెగర్క్ (29 బంతులు) పేరిట ఉంది. ఆతర్వాతి స్థానంలో ఏబీ డివిలియర్స్ (31 బంతులు) ఉన్నాడు.ప్రపంచ రికార్డు బద్దలుసెంచరీ తర్వాత కూడా జోరు కొనసాగించిన వైభవ్.. కేవలం 54 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసి, లిస్ట్-ఎ క్రికెట్లో అత్యంత వేగంగా 150 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా, ఏబీ డివిలియర్స్ (64 బంతులు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 150 పరుగుల తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన వైభవ్.. దురదృష్టవశాత్తు డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. 84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 190 పరుగులు చేసి ఔటయ్యాడు.కొద్ది నిమిషాల్లోనే బద్దలైన రికార్డువైభవ్ విధ్వంసం కళ్ల ముందు మెదులుతూ ఉండగానే మరో భారీ రికార్డు నమోదైంది. ఇదే మ్యాచ్‌లో వైభవ్ కెప్టెన్ (బిహార్ కెప్టెన్) సకీబుల్ గనీ కేవలం 32 బంతుల్లోనే శతక్కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. కొద్ది నిమిషాల ముందే వైభవ్ 36 బంతుల్లో శతక్కొట్టి, అన్మోల్ప్రీత్ సింగ్ (35 బంతులు) తర్వాత అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసిన భారత ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే. తాజా ప్రదర్శన తర్వాత అన్మోల్ప్రీత్ పేరిట ఉండిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సకీబుల్ గనీ ఖాతాలోకి చేరింది. ఈమ్యాచ్‌లో సకీబుల్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్స సాయంతో 128 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీలు (టాప్-5)..జేక్ ఫ్రేజర్- 29 బంతులుఏబీ డివిలియర్స్- 31సకీబుల్ గనీ- 32ఇషాన్ కిషన్- 33అన్మోల్ప్రీత్ సింగ్- 35ఆయుశ్ మెరుపు సెంచరీఇదే మ్యాచ్‌లో మరో సెంచరీ చేసిన ఆటగాడు ఆయుశ్ లోమాకురా. ఆయుశ్ 56 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో బిహార్ చేసిన స్కోర్ (574) లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా నిలిచింది. దీనికి ముందు ఈ రికార్డు తమిళనాడు పేరిట ఉండేది. 2022 ఎడిషన్ విజయ్ హజారే ట్రోఫీలో ఆ జట్టు ఇదే అరుణాచల్ ప్రదేశ్‌పై రెండు వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది.లిస్ట్-ఎ క్రికెట్లో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు👉బిహార్- అరుణాచల్ ప్రదేశ్ మీద 2025లో 574/6👉తమిళనాడు- అరుణాచల్ ప్రదేశ్ మీద 2022లో 506/2👉ఇంగ్లండ్- నెదర్లాండ్స్ మీద 2022లో 498/4👉సర్రే- గ్లౌసెస్టర్షైర్ మీద 2007లో 496/4 👉ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మీద 2018లో 481/6. -
తిరుగులేని ఇషాన్ కిషన్.. వైభవ్ రికార్డు బద్దలు
జార్ఖండ్ కెప్టెన్, టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో తన జోరు కొనసాగిస్తున్నాడు. ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. విధ్వంసకర శతకాలతో విరుచుకుపడి.. 500కు పైగా పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.అంతేకాదు.. జార్ఖండ్‌కు తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. ఈ క్రమంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నీలోనూ సారథిగా జార్ఖండ్‌ను ముందుకు నడిపిస్తున్నాడు ఇషాన్ కిషన్ (Ishan Kishan). ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-ఎ లో ఉన్న జార్ఖండ్ కర్ణాటకతో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది.మెరుపు అర్ధ శతకాలుఅహ్మదాబాద్ వేదికగా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 412 పరుగులు సాధించింది. ఓపెనర్లలో శిఖర్ మోహన్ (44) ఫర్వాలేదనిపించగా.. ఉత్కర్ష్ సింగ్ (8) విఫలమయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ శుభ్ శర్మ 15 పరుగులే చేయగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన విరాట్ సింగ్ (68 బంతుల్లో 88), కుమార్ కుశాగ్రా (47 బంతుల్లో 63) మెరుపు అర్ధ శతకాలతో దుమ్ములేపారు.ఆకాశమే హద్దుగాఇక ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 33 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా లిస్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన రెండో భారత బ్యాటర్‌గా ఇషాన్ చరిత్రకెక్కాడు.నిజానికి విజయ్ హజారే తాజా సీజన్ ఆరంభానికి ముందు లిస్ట్-ఎ క్రికెట్ ఫాస్టెస్ట్ సెంచూరియన్‌గా పంజాబీ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ (35 బంతుల్లో 115*) ఉన్నాడు. అయితే, బుధవారం నాటి మరో మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్ మీద బిహార్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో శతకం బాది అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.వైభవ్ రికార్డు బద్దలుకానీ కాసేపటికే వైభవ్‌ను అధిగమించి.. ఇషాన్ రెండో స్థానానికి ఎగబాకాడు. మరోవైపు.. బిహార్ కెప్టెన్ సకీబుల్ గని కేవలం 32 బంతుల్లోనే సెంచరీ చేసి.. అన్మోల్ప్రీత్ సింగ్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరగా.. ఇషాన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. కర్ణాటకతో మ్యాచ్‌లో ఇషాన్ మొత్తంగా 39 బంతుల్లో 7 ఫోర్లు, 14 సిక్స్‌లు బాది 125 పరుగులు సాధించాడు.మిగతా వారిలో అనుకూల్ రాయ్ (13), రాబిన్ మింజ్ (0) విఫలం కాగా.. సుశాంత్ మిశ్రా (1), సౌరభ్ శేఖర్ (0) అజేయంగా నిలిచారు. కర్ణాటక బౌలర్లలో అభిలాష్ శెట్టి నాలుగు వికెట్లు తీయగా.. విద్యాధర్ పాటిల్, శ్రేయస్ గోపాల్ చెరో రెండు.. ధ్రువ్ ప్రభాకర్ ఒక వికెట్ పడగొట్టారు. లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన భారత ఆటగాళ్లు👉సకీబుల్ గని- 32 బంతుల్లో👉ఇషాన్ కిషన్- 33 బంతుల్లో👉అన్మోల్ప్రీత్ సింగ్- 35 బంతుల్లో👉వైభవ్ సూర్యవంశీ- 36 బంతుల్లో. చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలు -
‘వన్డే’ల్లో వరల్డ్ రికార్డు.. ఇది టెస్టు స్కోరు కాదు సామీ!
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ఆరంభ మ్యాచ్‌లోనే అద్భుతం జరిగింది. లిస్ట్-ఎ క్రికెట్లో (వన్డే) అత్యధికస్కోరు సాధించిన జట్టుగా బిహార్ ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ప్లేట్ గ్రూప్‌లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా 574 పరుగులు సాధించి ఈ ఫీట్ అందుకుంది.విధ్వంసకర సెంచరీలుచాలా సందర్భాల్లో టెస్టు ఇన్నింగ్స్‌లోనూ సాధ్యంకాని రీతిలో ఈ మేరు అత్యంత భారీ స్కోరు సాధించి.. బిహార్ సరికొత్త చరిత్ర లిఖించింది. కెప్టెన్ సకీబుల్ గనీ, వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన విధ్వంసకర శతకాల కారణంగానే ఇది సాధ్యమైంది. రాంచి వేదికగా టాస్ గెలిచిన బిహార్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో మంగళ్ మహ్రౌర్ (33) ఫర్వాలేదనిపించగా.. వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా 84 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, 15 సిక్స్‌ల సాయంతో 190 పరుగులు చేసి.. డబుల్ సెంచరీ జస్ట్ మిస్సయ్యాడు.ఆ ఇద్దరూ శతొక్కొట్టేశారు!వన్‌డౌన్‌లో వచ్చిన పీయూశ్ సింగ్ సైతం అర్ధ శతకం (77)తో మెరవగా.. నాలుగో స్థానంలో ఆడిన వికెట్ కీపర్ బ్యాటర్ ఆయుశ్ లొహరుకా అద్భుత శతకం (56 బంతుల్లో 116) సాధించాడు. ఇక ఐదో నంబర్ బ్యాటర్‌గా వచ్చిన కెప్టెన్ సకీబుల్ గని కేవలం 32 బంతుల్లోనే శతక్కొట్టి.. వైభవ్ రికార్డును బ్రేక్ చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 40 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సర్లు బాదిన గని.. 128 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో బిపిన్ సౌరభ్ (1), ఆకాశ్ రాజ్ (8) విఫలం కాగా.. సూరజ్ కశ్యప్ మూడు పరుగులతో.. గనీతో కలిసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో బిహార్ ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 574 పరుగులు స్కోరు చేసింది.ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరుకాగా లిస్ట్-ఎ క్రికెట్లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతకు ముందు ఈ రికార్డు తమిళనాడు పేరిట ఉండేది. విజయ్ హజారే ట్రోఫీ 2022 సీజన్లో తమిళనాడు జట్టు.. అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లోనే రెండు వికెట్ల నష్టానికి 506 పరుగులు సాధించింది. తాజాగా వరల్డ్ రికార్డును బిహార్ తిరగరాసింది.లిస్ట్-ఎ క్రికెట్లో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు👉బిహార్- అరుణాచల్ ప్రదేశ్ మీద 2025లో 574/6👉తమిళనాడు- అరుణాచల్ ప్రదేశ్ మీద 2022లో 506/2👉ఇంగ్లండ్- నెదర్లాండ్స్ మీద 2022లో 498/4👉సర్రే- గ్లౌసెస్టర్షైర్ మీద 2007లో 496/4 👉ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మీద 2018లో 481/6.చదవండి: IND vs NZ: కివీస్ జట్ల ప్రకటన.. గాయాల వల్ల కీలక ప్లేయర్లు దూరం


