సెమీస్‌లో సాత్విక్, మీనల్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కె. సాత్విక్ రెడ్డి, మీనల్ సెమీఫైనల్‌కు చేరుకున్నారు. అమీర్‌పేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శనివారం జరిగిన అండర్–15 బాలుర సింగిల్స్ క్వార్టర్స్‌లో పుల్లెల గోపీచంద్ అకాడమీకి చెందిన సాత్విక్ 15–9, 15–10తో జి. అక్షిత్ రెడ్డి (జేఎస్కే)పై గెలుపొందాడు. బాలికల విభాగంలో మీనల్ (అపెక్స్) 15–13, 15–14తో పల్లవి జోషిని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో హృతిక షెనాయ్ (వీబీఏ) 15–10, 15–12తో టి. అనూష రెడ్డిపై, అను సోఫియా 15–13, 15–11తో శాన్వి (సీఏబీఏ)పై, శ్రేయాన్షి 15–12, 15–14తో శ్రీ అదితిపై విజయం సాధించారు. బాలుర మ్యాచ్‌ల్లో సుహాస్ 15–11, 15–9తో జనిత్పై, విఘ్నేశ్ 15–11, 15–9తో పునీత్ శర్మపై, ధరణ్ (సీఏబీఏ) 15–12, 15–13తో ఎన్. రాహుల్‌పై నెగ్గారు.
అండర్–13 బాలుర క్వార్టర్స్ ఫలితాలు: జి. అక్షిత్ రెడ్డి (జేఎస్కే) 15–12, 15–13తో సీహెచ్ భవ్యాంక్పై, బి. అంకిత్ 15–11, 15–14తో జ్ఞాన దత్తు (సుచిత్ర)పై, సాత్విక్ రెడ్డి 15–9, 15–13తో వర్షిత్ (పీజీబీఏ)పై, ఆర్నవ్ (జీవీఎస్) 15–11, 15–9తో ప్రణవ్‌పై గెలిచారు.