NZ Vs IND: తొలిరోజు ముగిసిన ఆట.. బుమ్రా ఖాతాలో చెత్త రికార్డు | NZ Batters Fifties-Bumrah-Wicketless Vs IND 2nd Test Day-1 Stumps | Sakshi
Sakshi News home page

NZ Vs IND: తొలిరోజు ముగిసిన ఆట.. బుమ్రా ఖాతాలో చెత్త రికార్డు

Nov 27 2026 11:32 AM | Updated on Nov 27 2026 11:39 AM

NZ Batters Fifties-Bumrah-Wicketless Vs IND 2nd Test Day-1 Stumps

Photo Credit: Twitter

క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్‌, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. డే-1 స్టంప్స్ సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. టామ్ బ్లండెల్ (53) అజేయ అర్థశతకం సాధించగా, గ్లెన్ ఫిలిప్స్ (36) క్రీజులో ఉన్నారు. 

అంతకముందు కెప్టెన్ టామ్ లాథమ్ (59) అర్థసెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్‌, వాషిం‍గ్టన్ సుందర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. తొలి రోజు ఆటలో ఒక సెషన్‌లో భారత బౌలర్లు ఆధిపత్యం​ ప్రదర్శించగా, రెండు సెషన్ల పాటు న్యూజిలాండ్ నిలకడైన బ్యాటింగ్ కొనసాగించింది.

బుమ్రాకు దక్కని వికెట్‌
బుమ్రా గత 38ఓవర్లుగా (తొలి టెస్టు, రెండో టెస్టు) వికెట్ తీయలేకపోయాడు. తొలి టెస్టులో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌లోనే వికెట్ తీసిన బుమ్రా ఆ తర్వాత 19 ఓవర్లలో మరో వికెట్ పడగొట్టలేకపోయాడు. తాజాగా రెండో టెస్టులో 19 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 37 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 

ఈ నేపథ్యంలో బుమ్రా ఖాతాలో అనుకోని రికార్డు చేరింది. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఒక టెస్టు సిరీస్‌లో వికెట్ తీయకుండా ఎక్కువ ఓవర్లు వేయడం మళ్లీ ఇదే. ఆనాటి డబ్ల్యూటీసీ ఫైనల్లో బుమ్రా 36 ఓవర్లు వేసి ఒక్క వికెట​కూడా తీయలేకపోయాడు. తాజాగా కివీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇప్పటివరకు 38 ఓవర్లు వేసి వికెట్ లేమితో ఆ చెత్త రికార్డును అధిగమించాడు.

తొలి సెషన్‌లో ఓపెనర్ల దూకుడు
తొలి సెషన్‌లో న్యూజిలాండ్ ఓపెనర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. కాన్వే, టామ్ లాథమ్ కలిసి తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే గుర్నూర్ బ్రార్ కాన్వేను ఔట్ చేసి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. రెండో సెషన్‌లో మాత్రం భారత బౌలర్లు విజృంభించారు. 

రెండో సెషన్‌ మనదే..
హాఫ్ సెంచరీ సాధించిన టామ్ లాథమ్‌తో పాటు హెన్రీ నికోల్స్, రచిన్ రవీంద్ర వికెట్లు వెనువెంటనే పడ్డాయి. దీంతో న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులతో టీ విరామానికి వెళ్లింది. టీ విరామం అనంతరం న్యూజిలాండ్ బ్యాటర్లు జోరును ప్రదర్శించారు.  డారిల్ మిచెల్ (31) ఔటైనప్పటికీ, టామ్ బ్లండెల్ అజేయ అర్థశతకంతో పాటు ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ కూడా ధాటిగా ఆడడంతో కివీస్ 5 వికెట్ల నష్టానికి 246 పరుగులతో రోజును ముగించింది.

ఇదీ చదవండి: సిరాజ్‌కు ద‌క్క‌ని చోటు.. ఆరేళ్ల‌లో ఇదే తొలిసారి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement