ఐదు వికెట్ల‌తో చెల‌రేగిన ఆకాశ్‌.. కివీస్ 356 ఆలౌట్‌ | Akash Deep Fifer-NZ-356 Runs All-Out Vs IND 2nd Test-Christchurch | Sakshi
Sakshi News home page

NZ Vs IND: ఐదు వికెట్ల‌తో చెల‌రేగిన ఆకాశ్‌.. కివీస్ 356 ఆలౌట్‌

Nov 28 2026 7:22 AM | Updated on Nov 28 2026 7:31 AM

Akash Deep Fifer-NZ-356 Runs All-Out Vs IND 2nd Test-Christchurch

Photo Credit: BCCI Twitter

క్రైస్ట్‌చ‌ర్చి వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 356 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆకాశ్ దీప్ ఐదు వికెట్ల‌తో చెల‌రేగి కివీస్ ప‌తనాన్ని శాసించాడు. న్యూజిలాండ్ బ్యాట‌ర్ల‌లో టామ్ బ్లండెల్ (89) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, కెప్టెన్ టామ్ లాథ‌మ్ (59) అర్థ‌సెంచ‌రీ సాధించాడు. 

మిగిలిన బ్యాట‌ర్ల‌లో గ్లెన్ ఫిలిప్స్ (36),  కాన్వే (31), డారిల్ మిచెల్ (31) రాణించారు. భారత బౌల‌ర్ల‌లో ఆకాశ్‌దీప్ ఐదు వికెట్లు తీయ‌గా, అన్షుల్ కాంబోజ్‌, గుర్నూర్ బ్రార్ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. బుమ్రా 26 ఓవ‌ర్లు వేసిన‌ప్ప‌టికీ ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు. 


PC: Twitter

అనంత‌రం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే గ‌ట్టిషాక్ త‌గిలింది. మాట్ హెన్రీ బౌలింగ్‌లో య‌శ‌స్వి జైస్వాల్ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం భార‌త్ 5 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 8 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్ (4), ప‌డిక్క‌ల్ (1)  క్రీజులో ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement