జైస్వాల్‌ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు | Jaiswal Become-1st Ever Indian batter Register Duck Every SENA Nation | Sakshi
Sakshi News home page

జైస్వాల్‌ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు

Nov 28 2026 9:05 AM | Updated on Nov 28 2026 9:18 AM

Jaiswal Become-1st Ever Indian batter Register Duck Every SENA Nation

Photo Credit: Twitter

టీమిండియా ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. ఆరు బంతులాడిన జైస్వాల్ కివీస్ పేస‌ర్ కైల్ జేమిస‌న్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ నేప‌థ్యంలో జైస్వాల్ త‌న పేరిట అత్యంత చెత్త రికార్డు లిఖించుకున్నాడు. వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) సైకిల్‌లో భార‌త్ త‌ర‌ఫున టెస్టుల్లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన బ్యాట‌ర్‌గా జైస్వాల్ నిలిచాడు. 

కోహ్లి రికార్డు బ్రేక్‌
డబ్ల్యూటీసీ సైకిల్‌లో జైస్వాల్ డ‌కౌటవ్వ‌డం ఇది ఎనిమిదోసారి. తద్వారా కోహ్లి (ఏడు సార్లు డ‌కౌట్‌) పేరిట ఉన్న చెత్త రికార్డును జైస్వాల్‌ త‌న పేరిట‌కు మార్చుకున్నాడు. ఇక చ‌తేశ్వ‌ర్ పుజారా ఆరుసార్లు డ‌కౌట‌య్యి మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు. జైస్వాల్‌కు 59 ఇన్నింగ్స్‌ల్లో ఇది ఎనిమిదో డ‌కౌట్ కాగా, స‌గ‌టున ప్ర‌తీ ఏడు ఇన్నింగ్స్‌ల త‌ర్వాత ఒక డ‌కౌట్ న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం.


Photo Credit: Twitter

తొలి భార‌త బ్యాట‌ర్‌గా..
ఇక SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో క‌నీసం ఒక్క‌సారైనా డ‌కౌట్ అయిన తొలి భార‌త బ్యాట‌ర్‌గా జైస్వాల్ నిలిచాడు. త‌న కెరీర్‌లో ఎనిమిది సార్లు డ‌కౌట్ అయితే అందులో ఆరు డ‌కౌట్‌లు SENA దేశాల్లోనే న‌మోదు చేశాడు. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై రెండుసార్లు, ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై రెండుసార్లు, సౌతాఫ్రికాలో ఒక‌సారి, తాజాగా న్యూజిలాండ్ గ‌డ్డ‌పై ఒక‌సారి డ‌కౌట్ అయ్యాడు. మిగిలిన రెండింటిలో ఒక‌సారి స్వ‌దేశంలో, మ‌రోసారి లంక గ‌డ్డ‌పై డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

ఓవ‌రాల్‌గా SENA దేశాల్లో భార‌త్ త‌ర‌ఫున డ‌కౌట్ అయిన ఆరో ఆట‌గాడిగా, తొలి బ్యాట‌ర్‌గా జైస్వాల్ చెత్త రికార్డు అందుకున్నాడు. గ‌తంలో అనిల్ కుంబ్లే, హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, జ‌హీర్ ఖాన్‌, ఇషాంత్ శ‌ర్మ‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా SENA దేశాల్లో డ‌కౌట్ అయిన‌ప్ప‌టికీ వీరంతా బౌల‌ర్లు. 

తాజాగా డ‌కౌట్ అయిన జైస్వాల్ ఇందులో ఏకైక బ్యాట‌ర్‌గా ఉన్నాడు. తొలి టెస్టులో 89 బంతుల్లో 85 ప‌రుగులు చేసి మంచి ట‌చ్‌లో క‌నిపించిన జైస్వాల్ రెండో టెస్టులో మాత్రం డ‌కౌటయ్యి తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు.

మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌..
మ్యాచ్ విష‌యానికొస్తే, 20 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 67 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్ (22), రిష‌బ్ పంత్ (3) క్రీజులో ఉన్నారు. అంత‌క‌ముందు న్యూజిలండ్ తొలి ఇన్నింగ్స్‌లో 356 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

ఇదీ చదవండి: NZ Vs IND: కివీస్‌ గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన భార‌త బౌల‌ర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement