Photo Credit: Twitter
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో పాకిస్తాన్-ఎ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం దోహా వేదికగా బంగ్లాదేశ్-ఎతో జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.
వన్‌డౌన్ బ్యాటర్ షాహదత్ హొసెన్ (118 బంతుల్లో 103 నాటౌట్) అజేయ సెంచరీ సాధించగా, వికెట్‌కీపర్ మహిదుల్ ఇస్లామ్ (42), మెహరోబ్ (28) రాణించారు. పాక్ బౌలర్లలో సుఫ్యాన్ మొకిమ్ మూడు వికెట్లు తీయగా, హసన్ నవాజ్, అలీ రాజా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్-ఎ 45.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.
హసన్ నవాజ్ (62), షహజైబ్ ఖాన్ (50) అర్థసెంచరీలతో రాణించగా, ఆఖర్లో కెప్టెన్ అబ్దుల్ సమద్ (44), ఫర్హాన్ యూసఫ్ (46 నాటౌట్) జట్టును గెలిపించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన హసన్ నవాజ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
గురువారం జరిగిన తొలి సెమీస్‌లో భారత్‌పై విజయం సాధించిన శ్రీలంక ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. రేపు జరగనున్న టైటిల్ పోరులో లంక జట్టుతో పాకిస్తాన్ అమీతుమీకి సిద్ధమైంది.
THE STAGE IS SET FOR THE GRAND FINAL! 🏆🔥 Pakistan A and Sri Lanka A will lock horns in the final of the ACC Men's Asia Cup Rising Stars 2026 on November 29 at 3:30 PM. Who will lift the coveted trophy? #PAKvsSL #AsiaCupRisingStars https://t.co/YsVI5TEV10
— CricInformer (@CricInformer) November 27, 2026
ACC Men's Asia Cup 2026 Semi Final Asian town cricket stadium Doha Pakistan A vs Bangladesh A Pakistan A won by 5 wickets Bangladesh A 232-8 Pakistan A 233-5 https://t.co/rZAHVo5ehq
— Mozan (@immozan) November 27, 2026


