కేఎల్ రాహుల్ (PC: BCCI X)
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. క్రైస్ట్‌చర్చ్‌లో శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి.. ఆరు వికెట్ల నష్టానికి కేవలం 116 పరుగులు చేసింది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్‌లో భాగంగా న్యూజిలాండ్- టీమిండియా మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో.. వెల్లింగ్‌టన్‌లో తొలి టెస్టు ‘డ్రా’ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్ మైదానం వేదికగా శుక్రవారం రెండో టెస్టు మొదలైంది.
టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. శనివారం నాటి రెండో రోజు ఆటను 246/5 ఓవర్ నైట్ స్కోరుతో మొదలుపెట్టింది. ఈ క్రమంలో మరో 110 పరుగులు జోడించి 356 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఓపెనర్లలో
కెప్టెన్ లాథమ్ అర్ధ శతకం (59) సాధించగా.. డెవాన్ కాన్వే (31) ఫర్వాలేదనిపించాడు. హెన్రీ నికోల్స్ (16), రచిన్ రవీంద్ర (0) విఫలం కాగా.. డారిల్ మిచెల్ 31, గ్లెన్ ఫిలిప్స్ 36, నాథన్ స్మిత్ 26 పరుగులు చేశారు. టెయిలెండర్లు కైలీ జెమీసన్, మ్యాట్ హెన్రీ చెరో 19 పరుగులు చేశారు.
ఇక వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్ 89 పరుగులతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ ఐదు వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్ చెరో రెండు.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు.


