Photo Credit: Twitter
టీమిండియా ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ మరోసారి తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. ఇటీవలే న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో టిమ్ సీఫెర్ట్‌తో కయ్యం పెట్టుకున్న గుర్నూర్.. తాజాగా క్రైస్ట్‌చర్చి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మరోసారి కంట్రోల్ తప్పాడు. జిడ్డు బ్యాటింగ్‌తో విసుగు తెప్పించిన న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ బ్లండెల్‌పై నోరు జారాడు.
ఆట రెండో రోజు ఉదయం సెషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 104వ ఓవర్లో బ్లండెల్ ఆటపై ఏకాగ్రత దెబ్బతీసేందుకు గుర్నూర్ బ్రార్ స్లెడ్జింగ్ మొదలుపెట్టాడు. క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లను విసిగిస్తున్న బ్లండెల్ ఒక గుడ్ లెంగ్త్ బంతిని వదిలేయగా, గుర్నూర్ అతని వద్దకు నడుచుకుంటూ వెళ్లి మాటలు వదిలాడు.

PC: Twitter
దానికి బ్లండెల్ స్పందించకుండా కేవలం చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. ఆ తర్వాత గుర్నూర్ వేసిన బంతిని బ్లండెల్ ఫైన్ లెగ్ దిశగా ఆడగా, గుర్నూర్ మరోసారి అతడి దగ్గరకు వెళ్లి ముఖం ముందే వెటకారంగా చప్పట్లు కొడుతూ రెచ్చగొట్టాడు. అయితే ఈసారి సహనం కోల్పోయిన బ్లండెల్.. గుర్నూర్ దగ్గరకు వెళ్లి తన నోటితో గట్టిగా బదులిచ్చే ప్రయత్నం చేశాడు.
ఇది గమనించిన అంపైర్లు పరిస్థితి అదుపు తప్పకముందే కల్పించుకొని వారిని విడదీశారు. గిల్ వచ్చి గుర్నూర్‌ను పక్కకు తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. గుర్నూర్‌తో వాగ్వాదం జరిగినప్పటికీ, టామ్ బ్లండెల్ మాత్రం బ్యాట్‌తో అదరగొట్టాడు.
211 బంతులాడిన బ్లండెల్ 89 పరుగులు చేసి సెంచరీ మిస్ అయినప్పటికీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే చివరికి గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లోనే ఆకాష్ దీప్‌కు క్యాచ్ ఇచ్చి బ్లండెల్ ఔటవ్వడంతో వాగ్వాదానికి తెరపడినట్లయింది.
రెండో రోజు ముగిసిన ఆట.. భారత్ 116/6
మ్యాచ్ విషయానికొస్తే, రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (7) క్రీజులో ఉన్నాడు. 240 పరుగులు వెనుకబడి ఉన్న భారత్ కష్టాల్లో పడింది. ఆది నుంచే కివీస్ బౌలర్లు విజృంభించడంతో భారత్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది.
మధ్యలో కేఎల్ రాహుల్ (25), పంత్ (23) ప్రతిఘటించినప్పటికీ స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔటయ్యారు. పది పరుగులు చేసిన సుందర్ ఔటైన తర్వాత రోజు ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. అంతకముందు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులకు ఆలౌటైంది.
Gurnoor Brar continues his verbal exchanges with the Kiwis – this time, Tom Blundell is on the receiving end!😄 #NZvIND #TeamIndia #Christchurch #NewZealand https://t.co/ovzEY9mYQ6
— lightningspeed (@lightningspeedk) November 28, 2026
A fine 89 comes to an end, courtesy of Gurnoor Brar 👏🏻 Watch the 2nd #NZvIND Test LIVE on #SonyLIV & #SonySportsNetwork 📺 https://t.co/uShkw3caiI
— Sony LIV (@SonyLIV) November 28, 2026
ఇదీ చదవండి: బంగ్లాదేశ్‌పై విజయం.. ఆసియా కప్ ఫైనల్లో పాక్


