Photo Credit: Twitter
క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (7) క్రీజులో ఉన్నాడు. టీమిండియా మరో 240 పరుగులు వెనుకబడి ఉంది. అయితే న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులకు ఆలౌటైంది.
టీమిండియా ఫీల్డర్ల పుణ్యమా అని కివీస్ ఇంత స్కోరు చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే రెండో టెస్టులో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు డ్రాప్ చేయడం గమనార్హం. ఒకటి లేదా రెండు కష్టతరమైనప్పటికీ, మిగిలినవన్నీ చేతిలోకి వచ్చినా జారవిడిచారు. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ భారత ఫీల్డింగ్‌పై పెదవి విరిచాడు.
కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ ఇచ్చిన క్యాచ్‌తో పాటు మరో క్యాచ్‌ను కెప్టెన్ గిల్ వదిలేయడం, వికెట్ కీపర్ పంత్ నాలుగు క్యాచ్‌లు జారవిడవడం గమనార్హం. ఇక ఇన్నింగ్స్ 96వ ఓవర్లో కివీస్ బ్యాటర్ నాథన్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్ రాహుల్ వదిలేసినప్పటికీ, అది కాస్త కష్టతరమైనదే.
ఈ సమయంలో కామెంటరీ నిర్వహిస్తున్న సునీల్ గావస్కర్.. రాహుల్ క్యాచ్ డ్రాప్ చేయడంపై ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది. నిరాశతో తన చేతిని గాలిలో కొట్టుకుంటుండగా, ఆయన కాలు టేబుల్‌కు తగిలింది. ఇక అర్థసెంచరీ సాధించిన టామ్ లాథమ్ క్యాచ్‌ను గిల్ జారవిడవడంతో టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కేఎల్ రాహుల్ స్లిప్‌లో పేలవ ఫీల్డింగ్ కనబరుస్తున్నాడు. తొలి రోజు ఆటలో కూడా టామ్ లాథమ్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను జారవిడిచాడు.
The passion is still as fierce as ever! 💙 Sunny G can't help but react as the catch falls just short at slip. He's been asking for that fielder to come a yard closer since yesterday evening! 😬 Watch the HERO VIDA India Tour of New Zealand 2nd Test, Day 2, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #NZvIND
— Sony Sports Network (@SonySportsNetwk) November 28, 2026
ఇదీ చదవండి: కంట్రోల్ తప్పిన భారత బౌలర్.. వెకిలి చేష్టలు అవసరమా?


