తొలి ఇన్నింగ్స్‌ హీరోకు గాయం.. టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ! | Akash Deep Injured-Big Blow-India-Prasidh-Replaced-Concussion Substitute | Sakshi
Sakshi News home page

తొలి ఇన్నింగ్స్‌ హీరోకు గాయం.. టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ!

Nov 29 2026 9:34 AM | Updated on Nov 29 2026 9:37 AM

Akash Deep Injured-Big Blow-India-Prasidh-Replaced-Concussion Substitute

Photo Credit: Twitter

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా టీమిండియా బౌలర్ ఆకాశ్ దీప్ గాయానికి గురయ్యాడు. భారత బ్యాటింగ్ సమయంలో కివీస్ బౌలర్ జేమిసన్ బౌలింగ్‌లో ఆకాశ్ గాయపడ్డాడు. కైల్ జేమిసన్‌ బౌలింగ్‌లో ఆకాశ్ దీప్ హెల్మెట్‌కు రెండు సార్లు బౌన్సర్లు తగిలాయి. 

ఫిజియో పర్యవేక్షణ తర్వాత బ్యాటింగ్ కొనసాగించిన ఆకాశ్ దీప్, వైద్య పరీక్షల కోసం వెళ్లడంతో టీమ్‌కు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ప్రసిద్ధ్ కృష్ణకు తుది జట్టులో చోటు దక్కింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఆకాశ్ దీప్ ఉన్నపళంగా జట్టుకు దూరమవ్వడం పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. 

అయితే ఆకాశ్‌దీప్ స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ప్రసిధ్ క్రిష్ణ కాకుండా సిరాజ్‌కు అవకాశమివ్వాల్సిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయమై క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘భారత జట్టుకు కంకషన్ సబ్‌. ఆకాశ్ దీప్ తప్పుకోవడంతో ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చాడు. మహ్మద్ సిరాజ్ విషయంలో ఏదో సీరియస్ సమస్యే ఉన్నట్టుంది. ఎందుకో అతన్ని సెలక్ట్ చేయకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు ఆకాశ్ దీప్ బెస్ట్ బౌలర్‌గా ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతను లేకపోవడం, టీమిండియాకు పెద్ద నష్టమే’ అంటూ ట్వీట్ చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఆకాశ్ దీప్, టీమిండియా తరపున టాప్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. జస్ప్రిత్ బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో 100 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీసిన ప్రసిద్ధ్ కృష్ణ, రెండో ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. 

తొలి టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ప్రసిధ్‌ కృష్ణను తప్పించి, రెండో టెస్టులో అతని స్థానంలో ఆకాశ్ దీప్‌ను జట్టులోకి తీసుకొచ్చారు. తాజాగా ఆకాశ్ దీప్ గాయంతో దూరం కాగా, మళ్లీ ప్రసిధ్‌నే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: రికార్డు భాగస్వామ్యం.. చ‌రిత్ర‌కెక్కిన‌ టీమిండియా

NZ Vs IND: చ‌రిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement