మూడోరోజు ముగిసిన ఆట‌.. భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్‌ | NZ Vs IND Day-3 Stumps: NZ Lead-By 243 Runs Vs IND 2nd Test | Sakshi
Sakshi News home page

మూడోరోజు ముగిసిన ఆట‌.. భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్‌

Nov 29 2026 11:28 AM | Updated on Nov 29 2026 11:33 AM

NZ Vs IND Day-3 Stumps: NZ Lead-By 243 Runs Vs IND 2nd Test

Photo Credit: BCCI Twitter

క్రైస్ట్‌చ‌ర్చి వేదిక‌గా న్యూజిలాండ్‌, టీమిండియా మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే స‌మ‌యానికి న్యూజిలాండ్ 46 ఓవర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 133 ప‌రుగులు చేసింది. ర‌చిన్ ర‌వీంద్ర (46), డారిల్ మిచెల్ (5) క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం న్యూజిలాండ్ 243 ప‌రుగుల ఆధిక్యంలో కొన‌సాగుతుంది. 

ఆట‌కు మ‌రో రెండు రోజులు మిగిలి ఉండ‌డం, కివీస్ చేతిలో మ‌రో ఏడు వికెట్లు ఉన్నాయి. ఈ లెక్క‌న న్యూజిలాండ్ నాలుగో రోజు మొద‌టి సెష‌న్‌లో వేగంగా ఆడి టీమిండియా ముంగిట భారీ టార్గెట్‌ను ఉంచ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భార‌త బ్యాట‌ర్లు ఏ మేర‌కు రాణిస్తార‌నేది చూడాలి.

భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా రెండు వికెట్లు తీయ‌గా, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు. ఓపెన‌ర్ డెవాన్ కాన్వే (97 బంతుల్లో 51) అర్థ‌సెంచ‌రీ సాధించగా, హెన్రీ నికోల్స్ (22) ప‌ర్వాలేద‌నిపించాడు. అంత‌క‌ముందు భార‌త్ తొలి ఇన్నింగ్స్ 246 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ధ్రువ్ జురెల్ (170 బంతుల్లో 88) వీరోచిత పోరాటం చేయ‌గా, ఆకాశ్ దీప్ (29), కేఎల్ రాహుల్ (25), పంత్ (23) రాణించారు. 

న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో కైల్ జేమిస‌న్ 4 వికెట్లు తీయ‌గా, మాట్ హెన్రీ, నాథ‌న్ స్మిత్‌, జాక‌బ్ డ‌ఫీ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఇక న్యూజిలాండ్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 356 ప‌రుగుల‌కు ఆలౌటైంది. టామ్ బ్లండెల్ (89), టామ్ లాథ‌మ్ (59), గ్లెన్ ఫిలిప్స్ (36) రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో ఆకాశ్ దీప్ ఐదు వికెట్లతో చెల‌రేగ‌గా, కాంబోజ్‌, గుర్నూర్ బ్రార్‌లు చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.

ఇదీ చదవండి: వారెవ్వా జైస్వాల్‌.. అమాంతం గాల్లోకి ఎగిరి స్టన్నింగ్‌ క్యాచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement