బీజేపీలోకి షమీ..? | Mohammed Shami meets BJP chief Nitin Nabin, sparks political debut buzz | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి షమీ..?

Nov 29 2026 5:42 PM | Updated on Nov 29 2026 5:56 PM

Mohammed Shami meets BJP chief Nitin Nabin, sparks political debut buzz

source: X

టీమిండియా వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ పొలిటికల్‌ ఎంట్రీపై ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. షమీ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ గతకొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి తాజాగా మరో కొనసాగింపు దొరికింది.

షమీ ఇవాళ న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో భేటీ అయ్యాడు. ఈ భేటీలో బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు కున్వర్ బాసిత్ అలీ కూడా ఉన్నాడు. ఈ భేటీ అనంతరం షమీ బీజేపీలో చేరనున్నాడంటూ సోషల్‌మీడియా కోడై కూస్తోంది.

ఇటీవలే మరో భారత క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్ బీజేపీలో చేరిన నేపథ్యంలో షమీ కూడా అదే బాట పడతాడని నెటిజన్లు అనుకుంటున్నారు. షమీ ఇటీవలే టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

గతంలోనూ రాజకీయ నేతలతో భేటీ
రాజకీయ ప్రముఖులతో షమీ సమావేశం కావడం ఇదే తొలిసారి కాదు. సెప్టెంబర్‌లో కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) అధినేత జయంత్ చౌధరీతో అతడు భేటీ అయ్యాడు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఆ సమావేశం కూడా రాజకీయ ఊహాగానాలకు దారితీసింది.

వైట్‌బాల్ క్రికెట్ కొనసాగింపు
36 ఏళ్ల షమీ టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా వైట్‌ బాల్‌ క్రికెట్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. అయితే ఈ ఫార్మాట్లలో అతడికి అవకాశాలు రావడం లేదు. అతడు చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ తరఫున ఆడాడు.  షమీ ఇటీవలే ఐపీఎల్‌లో జట్టు మారాడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ నుంచి రాజస్థాన్‌ రాయల్స్‌కు ట్రేడ్‌ అయ్యాడు. ప్రస్తుతం అతను దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇదీ చదవండి: బుమ్రా చెత్త రికార్డు.. కెరీర్‌లోనే అత్యంత చేదు అనుభవం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement