క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పైచేయి సాధించినప్పటికీ.. భారత్ కూడా పోరాటపటిమ ప్రదర్శిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి, 243 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. 117 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినా దృవ్ జురెల్ (88), ఆకాశ్ దీప్ (29), గుర్నూర్ బ్రార్ (10) అనూహ్య పోరాటపటిమ కనబర్చి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. దీనికి ముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులకు ఆలౌటైంది.
ఇదిలా ఉంటే, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. ఆకాశ్ దీప్-న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆకాశ్ దీప్‌పై జేమీసన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆకాశ్ దీప్‌పై పదే పదే బౌన్సర్లు సంధిస్తుండటంతో జేమీసన్‌ను అతని సహచరులే ఎందుకు అలా చేస్తున్నావని ప్రశ్నించారు.
Jamieson 🗣: "What? He gave it to us. Why should I care for him man? Why? He gives to us, we give it back. We didn't start it, but we'll finish it." https://t.co/X8UrIHjF4m
— Rushilll (@rushilthefirst) November 29, 2026
దీనికి అతడు బదులిస్తూ.. అతడి గురించి నేనెందుకు పట్టించుకోవాలి..? ఇలా చేయడం అతడే మొదలుపెట్టాడు. ముగించేది మాత్రం నేనే అన్నాడు. ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
జేమీసన్ సంధించిన రాకాసి బౌన్సర్ల ధాటికి ఆకాశ్ దీప్ చివరికి కంకషన్‌కు గురయ్యాడు. దీంతో మిగిలిన ఆటకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ప్రసిద్ద్ కృష్ణ జట్టులోకి వచ్చాడు.
ఇదీ చదవండి: టీమిండియాతో టెస్టు.. చరిత్ర సృష్టించిన కివీస్ బౌలర్


