breaking news
Akashdeep
-
టీమిండియాకు బిగ్ షాక్.. కన్ఫర్మ్ చేసిన శుభ్‌మన్ గిల్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే నాలుగో టెస్ట్‌కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. సిరీస్‌లో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌కు ముందు ముగ్గురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఈ విషయాన్ని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అధికారికంగా ధృవీకరించినట్లు తెలుస్తుంది. నితీశ్ కుమార్ రెడ్డి సిరీస్‌లోని మిగతా రెండు మ్యాచ్‌లకు దూరం కాగా.. పేసర్లు అర్షదీప్ సింగ్, ఆకాశ్‌దీప్ నాలుగో టెస్ట్‌కు దూరమయ్యారని గిల్ పేర్కొన్నట్లు సమాచారం. పైన పేర్కొన్న విషయాల్లో నితీశ్, అర్షదీప్ అందుబాటులో ఉండరన్న విషయంపై క్లారిటీ ఉన్నప్పటికీ.. ఆకాశ్‌దీప్ విషయంలో మాత్రం గిల్ పూర్తి సమచారాన్ని అందించినట్లు తెలుస్తుంది. ఆకాశ్‌దీప్‌కు ప్రత్యామ్నాయంపై కూడా గిల్ మాట్లాడినట్లు సమాచారం. అన్షుల్ కంబోజ్, ప్రసిద్ద్ కృష్ణల్లో ఎవరిని ఆడిస్తారనే విషయంపై మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు నిర్ణయం తీసుకుంటామని గిల్ చెప్పినట్లు తెలుస్తుంది.అలాగే కరుణ్ నాయర్ భవితవ్యంపై కూడా గిల్ మాట్లాడినట్లు సమాచారం. కరుణ్‌కు మరో అవకాశం ఉంటుందని గిల్ పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తుంది. కరుణ్ ఈ సిరీస్‌లో తన స్థాయి ప్రదర్శన చేయలేదన్న విషయాన్ని అంగీకరించిన గిల్.. అతనికి మరో అవకాశం ఉంటుందని చెప్పినట్లు సమాచారం. ఈ సిరీస్‌లో కరుణ్ ఫామ్‌ను అందిపుచ్చుకుంటాడని గిల్ ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.పంత్ విషయంలోనూ గిల్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. నాలుగో టెస్ట్‌లో పంత్ వికెట్‌కీపింగ్ చేస్తాడని గిల్ ధృవీకరించినట్లు తెలుస్తుంది. ఈ విషయాలతో పాటు గిల్ మూడో టెస్ట్ సందర్భంగా జరిగిన ఓ విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 90 సెకెన్లు ఆలస్యంగా బరిలోకి దిగిందని, ఇలా చేయడం క్రీడాస్పూర్తికి విరుద్దమని గిల్ అసహనం వ్యక్తిం చేసినట్లు సమాచారం.నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవెన్..జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.టీమిండియా (అంచనా)..యశస్వి జైస్వాల్, KL రాహుల్, కరుణ్ నాయర్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK), ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
Akash Deep: ‘ఆకాశ’మంత ఆనందం...
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులోనూ టీమిండియా మెరుగైన ప్రదర్శనే చేసింది. 15 సెషన్ల పాటు సాగిన పోరులో... అధిక భాగం మనదే ఆధిపత్యం. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ శతకాలతో ప్రత్యర్థి ముందు 371 పరుగుల లక్ష్యం నిలిచింది. ఎలాంటి పిచ్‌పైనైనా నాలుగో ఇన్నింగ్స్‌లో ఈ స్కోరు ఛేదించడం కష్టతరమే! అందులోనూ ప్రపంచ అత్యుత్తమ పేసర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టడం అంటే ఆషామాషీ కాదు! అయితే ఇక్కడే ఇంగ్లండ్ ప్లేయర్లు తమ గేమ్ ప్లాన్‌తో ఆకట్టుకున్నారు. ]బుమ్రాను గౌరవించిన ఆతిథ్య ఆటగాళ్లు ఇతర బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిర్జీవ పిచ్‌పై ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగుల పండగ చేసుకుంటుంటే... మనవాళ్లు చేష్టలుడిగి చూస్తుండటం తప్ప మరేం చేయలేకపోయారు. సిరాజ్ ప్రభావం చూపలేకపోగా... ప్రసిధ్ కృష్ణ టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఏ బౌలర్‌కు సాధ్యం కాని చెత్త గణాంకాలు ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ నిర్ణయాలు బెడిసికొట్టడంతో... ఇక సిరీస్‌లో టీమిండియా కోలుకోవడం కష్టమే అనే వార్తలు వినిపించాయి. దీనికి తోడు ఆరు నెలల ముందు నుంచే బుమ్రా ఇంగ్లండ్ పర్యటనలో మూడు టెస్టులే ఆడుతాడు అని మేనేజ్మెంట్ ఊదరగొడుతుండగా... రెండో మ్యాచ్‌కు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. బరి్మంగ్హామ్లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్ గెలిచిన చరిత్రలేని భారత జట్టు... ప్రధాన పేసర్ బుమ్రా లేకుండానే బరిలోకి దిగింది. ఇంకేముంది మరో పరాజయానికి బాటలు పడ్డట్లే అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇలాంటి స్థితిలోనే టీమిండియా అద్భుతం చేసింది. మహామహా ఆటగాళ్లకు సాధ్యం కాని ఘనతను ఖాతాలో వేసుకుంది. యువ సారథి శుబ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేయడం వల్లే టీమిండియా కొండంత స్కోరు చేసిన మాట వాస్తవమే అయినా... ఆత్మవిశ్వాసం లోపించిన బౌలింగ్ దళంలో జవసత్వాలు నింపిన ఘనత మాత్రం ఆకాశ్దీప్కే దక్కుతుంది. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయాల్సిన తీవ్ర ఒత్తిడిలో... కొత్త బంతి అందుకున్న ఆకాశ్‌దీప్ తన రెండో ఓవర్లోనే ఇంగ్లండ్‌కు ‘డబుల్ స్ట్రోక్’ ఇచ్చాడు. ఓ చక్కటి బంతితో డకెట్‌ను బుట్టలో వేసుకున్న ఈ బీహార్ పేసర్... తదుపరి బంతికి ఓలీ పోప్‌ను పెవిలియన్ బాట పట్టించి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఈ రెండు వికెట్లలో క్యాచ్‌లు పట్టిన గిల్, రాహుల్‌కు కూడా సమాన పాత్ర ఉన్నా... జట్టులో ఒక్కసారిగా సానుకూల దృక్పథం తీసుకొచ్చింది మాత్రం ముమ్మాటికీ ఆకాశ్‌దీపే. మరో ఎండ్‌లో సిరాజ్ కూడా రాణించడంతో ఇంగ్లండ్ వెనకడుగు వేసినట్లే అనిపించినా... బ్రూక్, స్మిత్ ట్రిపుల్ సెంచరీ భాగస్వామ్యం తిరిగి ఆతిథ్య జట్టును పోటీలోకి తెచ్చింది. ఈ దశలో మరోసారి ఆకాశ్‌దీప్ డబుల్ ధమాకా మోగించాడు. బ్రూక్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాశ్‌దీప్... వోక్స్‌కు పెవిలియన్ బాట చూపెట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అతడి బౌలింగ్ మరింత పదునెక్కింది. నాలుగో రోజు రెండు వికెట్లు తీసిన ఆకాశ్... ఆఖరి రోజు తన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను బెంబేలెత్తించాడు. వర్షం విరామం అనంతరం కాస్త సీమ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై చక్కటి బంతులతో పోప్, బ్రూక్‌ను అవుట్ చేసి భారత విజయానికి బాటలు వేశాడు. ఈ క్రమంలో కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో అదుర్స్ అనిపించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్‌దీప్ తీసిన ఐదు వికెట్లు వరుసగా డకెట్, రూట్, పోప్, బ్రూక్, స్మిత్వి కావడం అతడి బౌలింగ్ నైపుణ్యాన్ని చాటుతోంది. బుమ్రాలాగా మెరుపు వేగం లేకున్నా... లైన్ అండ్ లెంగ్త్‌తో కూడిన క్రమశిక్షణ కట్టిపడేసింది. తొలి ఇన్నింగ్స్ ప్రదర్శన అనంతరం ‘తదుపరి మ్యాచ్‌లో అవకాశం దక్కుతుందో లేదో’ అని అనుమానం వ్యక్తం చేసిన ఆకాశ్... రెండో ఇన్నింగ్స్ ప్రదర్శనతో తనను జట్టు నుంచి తప్పించలేని పరిస్థితి కలి్పంచాడు. ఈ జోరు ఇలాగే సాగిస్తే సుదీర్ఘకాలం అతడు జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఖాయమే!1692: ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన పరుగులు. భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్‌లో ఇవే అత్యధికం సాక్షి క్రీడా విభాగం -
పదేసిన ఆకాశ్‌దీప్.. ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రక విజయం
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. చివరి రోజు వరకు సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. విదేశాల్లో భారత్‌కు ఇదే భారీ విజయం. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు ఇదే తొలి విజయం (58 ఏళ్ల తర్వాత). ఈ వేదికపై భారత్ ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. 8 మ్యాచ్‌ల్లో ఏడింట ఓడి, ఓ మ్యాచ్ డ్రా చేసుకుంది. ఈ గెలుపుతో గిల్ ఎడ్జ్‌బాస్టన్‌లో విజయం సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. 608 పరుగల భారీ లక్ష్య ఛేదనలో 72/3 స్కోర్ వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 271 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆకాశ్‌దీప్ (21.2-2-99-6) నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. ఆకాశ్‌దీప్‌కు కెరీర్లో ఇదే తొలి ఐదు వికెట్ల ఘనత. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్‌దీప్ మొత్తంగా 10 వికెట్ల ఘనత కూడా సాధించాడు.ఈ మ్యాచ్‌లో బుమ్రా స్థానంలో బరిలోకి దిగిన ఆకాశ్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచిన జేమీ స్మిత్ (88) డ్రా కోసం విఫలయత్నం చేశాడు.అంతకుముందు టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (162 బాల్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో సిరాజ్ 6, ఆకాశ్‌దీప్ 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269) భారీ డబుల్ సెంచరీతో రికార్డులు తిరగరాశాడు. యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు.ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ భారత్‌పై విజయం సాధించింది. ఈ సిరీస్‌లో మూడో టెస్ట్ జులై 10 నుంచి ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగనుంది. గిల్ కెప్టెన్సీలో భారత్‌కు ఇదే తొలి గెలుపు. -
చెలరేగిన ఆకాశ్‌దీప్.. చారిత్రక గెలుపునకు 2 వికెట్ల దూరంలో టీమిండియా
Update: లంచ్ తర్వాత మరో 2 వికెట్లు తీసిన టీమిండియా. క్రిస్ వోక్స్‌ను (7) ప్రసిద్ద్ కృష్ణ.. జేమీ స్మిత్‌ను ఆకాశ్‌దీప్ (88) ఔట్ చేశారు. 56 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 226/8గా ఉంది. భారత్ గెలుపుకు కేవలం 2 వికెట్లు మాత్రమే కావాలి. ఆకాశ్‌దీప్ ఈ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి 10 వికెట్ల ప్రదర్శనపై కన్నేశాడు. ఆకాశ్‌దీప్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో చారిత్రక గెలుపుకు 4 వికెట్ల దూరంలో ఉంది. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇక్కడ ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఏడింట ఓడి, ఓ మ్యాచ్ డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు. వారి ఆరాటం మరికొద్ది గంటల్లో తీరే అవకాశం ఉంది.608 పరుగల భారీ లక్ష్య ఛేదనలో 72/3 వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. లంచ్ విరామం సమయానికి 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 455 పరుగులు కావాలి. అది అసాధ్యం. భారత్ గెలలాంటే మాత్రం కేవలం 4 వికెట్లు తీస్తే చాలు.వర్షం కారణంగా ఇవాల్టి ఆట గంట 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం కారణంగా 10 ఓవర్లు కోతకు గురైంది. ఈ రోజు కేవలం 80 ఓవర్ల ఆట మాత్రమే జరుగుతుంది. ఆట ప్రారంభం కాగానే టీమిండియా పేసర్ ఆకాశ్‌దీప్ ఇంగ్లండ్‌ను భారీ దెబ్బేశాడు. అతని బౌలింగ్‌లో ఓలీ పోప్ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆతర్వాత కొద్ది సేపటికే ఆకాశ్‌దీప్ మరోసారి రెచ్చిపోయాడు. ఈ సారి ఇన్ ఫామ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (23) ఎల్బీడబ్ల్యూ చేసి ఇంగ్లండ్ డ్రా ఆశలపై నీళ్లు చల్లాడు. అనంతరం స్టోక్స్, జేమీ స్మిత్ ఆరో వికెట్‌కు 70 పరుగులు జోడించి టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈసారి వాషింగ్టన్ సుందర్ అద్బుతమైన బంతితో బెన్ స్టోక్స్‌ను (33) పెవిలియన్‌కు సాగనంపాడు. స్టోక్స్ వికెట్ పడగానే అంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు. 32 పరుగులతో జేమీ స్మిత్ క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగో రోజు ఆటలో బెన్ డకెట్ (25), రూట్‌ను (60) ఔట్ చేసిన ఆకాశ్‌దీప్ ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 4 వికెట్లు తీయగా.. సిరాజ్, సుందర్ తలో వికెట్ దక్కించుకున్నారు. నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (162 బాల్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో సిరాజ్ 6, ఆకాశ్‌దీప్ 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269) భారీ డబుల్ సెంచరీతో రికార్డులు తిరగరాశాడు. యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు.స్కోర్ వివరాలు..భారత్ 587 & 427/6 డిక్లేర్ఇంగ్లండ్ 407 & 153/6 (40.3) -
ENG VS IND 2nd Test: ఆరేసిన సిరాజ్.. 407 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) భారీ సెంచరీలు చేసి ఇంగ్లండ్‌ను గట్టెక్కించారు. 84 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఇంగ్లండ్‌ను బ్రూక్, స్మిత్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 303 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్‌ను తిరిగి ఆటలోకి తెచ్చారు. బ్రూక్, స్మిత్ ద్వయం సగం వికెట్లు కోల్పోయినా డిఫెన్స్‌లో పడకుండా భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో స్మిత్ 80, బ్రూక్ 137 బంతుల్లో సెంచరీలు పూర్తి చేశారు.387 పరుగుల వద్ద బ్రూక్ ఔటయ్యాక ఇంగ్లండ్ మరో 20 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు కోల్పోయింది. జేమీ స్మిత్ అర్హమైన డబుల్ సెంచరీని మిస్ అయ్యాడు. అతనికి మరికొద్ది బంతులు అవకాశం దొరికినా డబుల్ పూర్తి చేసేవాడు. బ్రూక్‌ను ఆకాశ్‌దీప్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది. ఆతర్వాత కొద్ది సేపటికే ఆకాశ్‌దీప్ క్రిస్ వోక్స్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. చివరి 3 వికెట్లను సిరాజ్ పడగొట్టాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు (డకెట్, పోప్, స్టోక్స్, కార్స్, టంగ్, బసీర్) డకౌట్ అయ్యారు. క్రాలే 19, రూట్ 22, వోక్స్ 5 పరుగులు చేశారు. ఇంగ్లండ్ స్కోర్‌లో 80 శాతం పరుగులు బ్రూక్, స్మిత్‌లే చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ (6/70), ఆకాశ్‌దీప్ (4/88) అద్భుతంగా బౌలింగ్ చేసి మొత్తం వికెట్లు తీశారు. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. మొత్తంగా భారత్‌కు 180 పరుగుల కీలకమైన ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్.. శుక్రవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 28 పరుగుల చేసి ఔట్ కాగా.. కే ఎల్ రాహూల్ 28 , కరుణ్ నాయర్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 244 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
ENG VS IND 2nd Test Day 2: పట్టుబిగిస్తున్న భారత్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.వరుస షాక్లుఅనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్‌దీప్ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో తొలి టెస్ట్‌లో సెంచరీలు చేసిన బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.మరో ఎదురుదెబ్బ13 పరుగుల వద్ద వరుస బంతుల్లో ఇన్ ఫామ్ బ్యాటర్లు డకెట్, పోప్ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 25 పరుగుల వద్ద జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో క్రాలే పెవిలియన్‌కు చేరాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. 20 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 77/3గా ఉంది. రూట్ (18), బ్రూక్ (30) క్రీజ్‌లో ఉన్నారు. -
ENG VS IND 2nd Test: నిప్పులు చెరిగిన ఆకాశ్‌దీప్, సిరాజ్.. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.వరుస షాక్లుఅనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్‌దీప్ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో తొలి టెస్ట్‌లో సెంచరీలు చేసిన బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.మరో ఎదురుదెబ్బ13 పరుగుల వద్ద వరుస బంతుల్లో ఇన్ ఫామ్ బ్యాటర్లు డకెట్, పోప్ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 25 పరుగుల వద్ద జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో క్రాలే పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 33/3గా ఉంది. రూట్ (5), బ్రూక్ (5) క్రీజ్‌లో ఉన్నారు. -
IND VS AUS 1st Test: హర్షిత్ రాణానా.. ఆకాశ్దీపా..?
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రేపటి నుంచి (నవంబర్ 22) ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 7:50 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంబానికి ముందు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. టాస్ ఆలస్యమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే మ్యాచ్ మిగతా రోజుల్లో మాత్రం వర్షం పడే అవకాశం లేదని తెలుస్తుంది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఈ సిరీస్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంటుంది.ఇదిలా ఉంటే, తొలి టెస్ట్‌లో టీమిండియాకు తుది జట్టు కూర్పు పెద్ద సమస్యగా మారింది. ఫైనల్ ఎలెవెన్‌లో ఎవరిని ఉంచాలో అర్దం కాక భారత మేనేజ్మెంట్ తలలు పట్టుకుని కూర్చుకుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానాన్ని కేఎల్ రాహుల్‌తో భర్తీ చేయాలని ఆలోచిస్తున్నా, అది కాస్త మిస్ ఫైర్ అవుతుందేమోనని ఆందోళన చెందుతుంది. అభిమన్యు ఈశ్వరన్ వైపు మొగ్గు చూపుదామా అంటే అతనికి అనుభవం లేదు. మరోవైపు వన్‌డౌన్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ సైతం గాయపడిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు అతని విషయంలో ఏమీ చెప్పలేమని మేనేజ్మెంట్ గోప్యత మెయిన్టైన్ చేస్తుంది. అతనికి ప్రత్యామ్నాయంగా దేవ్‌దత్ పడిక్కల్‌ను ఆడిస్తే బాగుంటుందా అని పరిశీలిస్తుంది.టీమిండియాకు ఉన్న మరో సమస్య మూడో స్పెషలిస్ట్ పేసర్. ఈ స్థానానికి ఆకాశ్‌దీప్‌ను ఎంపిక చేయాలా లేక యువ పేసర్ హర్షిత్ రాణాకు అవకాశం ఇవ్వాలా అనే విషయంలో యాజమాన్యం తీవ్రమైన కసరత్తు చేస్తుంది. కెప్టెన్ బుమ్రా, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ హర్షిత్ రాణావైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. చివరి నిమిషంలో ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఓ స్పిన్నర్ ఫార్ములాతో బరిలోకి దిగాలని యోచిస్తుంది. పేస్ విభాగంలో తొలి రెండు స్థానాలకు బుమ్రా, సిరాజ్ సెట్ కాగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా అశ్విన్ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. ఆసీస్ జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు చాలామంది ఉండటంతో మేనేజ్మెంట్ రైట్ ఆర్మ ఆఫ్ స్పిన్నర్ అయిన అశ్విన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఆల్‌రౌండర్ కోటాలో నితీశ్‌కుమార్ రెడ్డి పేరు కూడా ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, అశ్విన్, బుమ్రా, హర్షిత్ రాణా, సిరాజ్ -
న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్.. టీమిండియాలో కీలక మార్పు..?
న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడో టెస్ట్‌లో టీమిండియా కీలక మార్పు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. ముంబైలోని వాంఖడే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున అదనపు స్పిన్నర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇలా చేస్తే స్పెషలిస్ట్ పేసర్‌గా బుమ్రా ఒక్కడికే అవకాశం దక్కుతుంది. అదనపు స్పిన్నర్ కోటాలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి రావచ్చు. అక్షర్‌కు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నందున్న మేనేజ్మెంట్ ఇతనివైపే మొగ్గు చూపుతుంది. ఒకవేళ అక్షర్ తుది జట్టులోకి వస్తే ఆకాశ్‌దీప్‌పై వేటు పడుతుంది. ఆకాశ్‌దీప్ రెండో టెస్ట్ మొత్తంలో కేవలం ఆరు ఓవర్లు మాత్రమే వేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అయితే అతను బంతిని కూడా పట్టుకోలేదు. వాంఖడే ట్రాక్ ఇంచుమించు పూణే పిచ్ మాదిరే ఉండే అవకాశం ఉన్నందున టీమిండియా తప్పక నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. ఆకాశ్‌దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ పేరును సైతం పరిశీలించే అవకాశాలు లేకపోలేదు. అయితే కుల్దీప్కు గజ్జల్లో గాయమైందని ప్రచారం జరుగుతుంది. ఈ కారణంగానే అతన్ని ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఎంపిక చేయలేదని తెలుస్తుంది.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ జయభేరి మోగించింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ముడో టెస్ట్ ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది.కివీస్‌తో మూడో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ -
పిచ్ చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం: గంభీర్
బెంగళూరు: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో భారత జట్టు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగి మంచి ఫలితాలు సాధించింది. బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ కూడా తమ బౌలింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని న్యూజిలాండ్‌పై కూడా టీమిండియా అమలు చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్ తర్వాత జరగబోయే ఆస్ట్రేలియా పర్యటనకు కూడా పేసర్లకు ఇది సన్నాహకంగా పనికొస్తుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. రేపటి నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జట్టు ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ‘పరిస్థితులు, పిచ్, ప్రత్యర్థిని బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుంది. మా డ్రెస్సింగ్ రూమ్‌లో పెద్ద సంఖ్యలో అత్యుత్తమ ఆటగాళ్లు ఉండటం సానుకూలాంశం. వారిలోంచి ఎవరినైనా ఎంచుకోవచ్చు. అందరూ జట్టును గెలిపించగల సమర్థులే అని మా నమ్మకం. చిన్నస్వామి స్టేడియంలో పిచ్‌ను చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం’ అని జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇటీవల శ్రీలంక చేతిలో 0–2తో టెస్టు సిరీస్‌లో ఓడిన కివీస్... 37 వికెట్లను స్పిన్నర్లను సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో కుల్దీప్, అక్షర్‌లకు కూడా తొలి టెస్టులో చోటు ఇస్తారా అనేది ఆసక్తికరం. ‘వారిద్దరూ ప్రతిభావంతులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరినీ మేం పక్కన పెట్టడం లేదు. అయితే జట్టును గెలిపించగల 11 మందిని ఎంపిక చేయడమే అన్నింటికంటే ముఖ్యం’ అని గంభీర్ స్పష్టం చేశాడు. -
IND VS ENG 4th Test Day 1: మెరిసిన ఆకాశ్‌దీప్.. సెంచరీతో కదంతొక్కిన రూట్
రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి రోజు ఆటలో పర్యాటక ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్‌ను చేయగలిగింది. జో రూట్ కెరీర్లో 31వ టెస్ట్ సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11), ఓలీ పోప్ (0), జానీ బెయిర్‌స్టో (38), బెన్ స్టోక్స్ (3), బెన్ ఫోక్స్(47), టామ్ హార్ట్లీ (13) ఔట్ కాగా.. రూట్ (106), రాబిన్సన్ (31) క్రీజ్‌లో ఉన్నారు. భారత అరంగేట్రం బౌలర్ ఆకాశ్‌దీప్ 3 వికెట్లతో విజృంభించగా.. సిరాజ్ 2, రవీంద్ర జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి రోజు హైలైట్స్.. టీమిండియా అరంగేట్రం పేసర్ ఆకాశ్‌దీప్ అద్బుతమైన ఇన్ స్వింగర్‌తో జాక్ క్రాలేను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఆ బంతిని ఆకాశ్ క్రీజ్ దాటి సంధించడంతో అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో ఆకాశ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. టెస్ట్ క్రికెట్లో ఓ ప్రత్యర్థిపై 1000 పరుగులు మరియు 100 వికెట్లు తీసిన తొలి ఆసియా క్రికెటర్‌గా.. ఇంగ్లండ్‌పై 100 టెస్ట్ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో రూట్ చేసిన సెంచరీ టెస్ట్‌ల్లో అతనికి 31వది. అన్ని ఫార్మాట్లలో కలిపితే 47వది. ఈ సెంచరీతో రూట్ ప్రస్తుత క్రికెటర్లలో (అన్ని ఫార్మాట్లలో) అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (80) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో (47) కలిసి రూట్ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (45) ఉన్నాడు. తాజా సెంచరీతో రూట్ ఫాబ్ ఫోర్లో (కోహ్లి, రూట్, స్మిత్, కేన్) మూడో అత్యుత్తమ ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ జాబితాలో విలియమ్సన్ (32), స్టీవ్ స్మిత్ (32) టాప్‌లో ఉండగా.. రూట్ (31), కోహ్లి (29) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ సెంచరీతో రూట్ మరో భారీ రికార్డును సైతం ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీలు (10) చేసిన ఆటగాడిగా రూట్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో రూట్.. స్టీవ్ స్మిత్‌ను (9) అధిగమించాడు. -
భారత్ ఆశలు సజీవం
* కొరియాపై 2-1తో విజయం * చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ లండన్: గత మూడు దశాబ్దాలుగా ఊరిస్తోన్న చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ పతకాన్ని ఈసారైనా సాధించాలనే పట్టుదలతో ఉన్న భారత్ తమ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. దక్షిణ కొరియాతో మంగళవారం జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కిది రెండో గెలుపు. తాజా విజయంతో భారత్ పాయింట్ట పట్టికలో ఏడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్ తరఫున కెప్టెన్ సునీల్ 39వ నిమిషంలో... నికిన్ చందన తిమ్మయ్య 57వ నిమిషంలో ఒక్కో గోల్ చేశారు. కొరియా జట్టుకు 57వ నిమిషంలో కిమ్ జుహున్ ఏకైక గోల్‌ను అందించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్‌కు పలుమార్లు గోల్ చేసే అవకాశాలు వచ్చాయి. తుదకు 39వ నిమిషంలో భారత్ సఫలమైంది. ఆకాశ్‌దీప్ అందించిన పాస్‌ను డి ఏరియాలో ఉన్న సునీల్ లక్ష్యానికి చేర్చాడు. ఆ తర్వాత 57వ నిమిషంలో కొరియా స్కోరును సమం చేసింది. అయితే కొరియాకు ఆ ఆనందం నిమిషం కూడా నిలువలేదు. కొరియా స్కోరును సమం చేసిన వెంటనే భారత్ రెండో గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మిగతా మూడు నిమిషాలు ప్రత్యర్థికి మరో గోల్ చేయనీకుండా అడ్డుకొని భారత్ విజయాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం విశ్రాంతి దినం. గురువారం జరిగే చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. -
భారత్‌ను ఆదుకున్న ఆకాశ్‌దీప్
జర్మనీని నిలువరించిన టీమిండియా హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీ రాయ్‌పూర్: తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన భారత హాకీ జట్టు రెండో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది. హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్లో భాగంగా ఒలింపిక్ చాంపియన్ జర్మనీతో శనివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను భారత్ 1-1తో ‘డ్రా’గా ముగించింది. ఆట ఆరో నిమిషంలో నిక్లాస్ వెలెన్ గోల్‌తో జర్మనీ ఖాతా తెరువగా... భారత్ తరఫున 47వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ గోల్ సాధించి స్కోరును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఆట మొదలైన తొలి నిమిషం నుంచే సమన్వయంతో ఆడుతూ జర్మనీ గోల్‌పోస్ట్‌పై దాడులు చేశారు. మూడో నిమిషంలో భారత్‌కు గోల్ చేసే అవకాశం వచ్చినా చింగ్లెన్సనా సింగ్ కొట్టిన షాట్‌ను జర్మనీ గోల్‌కీపర్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత సర్దార్ సింగ్ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో తల్వీందర్ సింగ్ అందుకోలేకపోయాడు. అయితే జర్మనీ జట్టు కూడా దూకుడుగా ఆడేందుకే ప్రయత్నించింది. ఆరో నిమిషంలో మథియాస్ ముల్లర్ ముగ్గురు భారత ఆటగాళ్లను తప్పిస్తూ కుడి వైపు నుంచి దూసుకెళ్లి ‘డి’ ఏరియాలో సహచరుడు నిక్లాస్ వెలెన్కు పాస్ ఇచ్చాడు. నిక్లాస్ మిగతా కార్యాన్ని పూర్తి చేసి జర్మనీకి తొలి గోల్‌ను అందించాడు. గోల్ సమర్పించుకున్నప్పటికీ భారత ఆటగాళ్లు డీలా పడకుండా ఉత్సాహంతో ఆడారు. ఫినిషింగ్ లోపం వెంటాడినా చివరకు ఆకాశ్‌దీప్ గోల్‌తో భారత్ స్కోరును సమం చేయగలిగింది. మంగళవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది.