
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే నాలుగో టెస్ట్‌కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. సిరీస్‌లో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌కు ముందు ముగ్గురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఈ విషయాన్ని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అధికారికంగా ధృవీకరించినట్లు తెలుస్తుంది. నితీశ్ కుమార్ రెడ్డి సిరీస్‌లోని మిగతా రెండు మ్యాచ్‌లకు దూరం కాగా.. పేసర్లు అర్షదీప్ సింగ్, ఆకాశ్‌దీప్ నాలుగో టెస్ట్‌కు దూరమయ్యారని గిల్ పేర్కొన్నట్లు సమాచారం.
పైన పేర్కొన్న విషయాల్లో నితీశ్, అర్షదీప్ అందుబాటులో ఉండరన్న విషయంపై క్లారిటీ ఉన్నప్పటికీ.. ఆకాశ్‌దీప్ విషయంలో మాత్రం గిల్ పూర్తి సమచారాన్ని అందించినట్లు తెలుస్తుంది. ఆకాశ్‌దీప్‌కు ప్రత్యామ్నాయంపై కూడా గిల్ మాట్లాడినట్లు సమాచారం. అన్షుల్ కంబోజ్, ప్రసిద్ద్ కృష్ణల్లో ఎవరిని ఆడిస్తారనే విషయంపై మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు నిర్ణయం తీసుకుంటామని గిల్ చెప్పినట్లు తెలుస్తుంది.
అలాగే కరుణ్ నాయర్ భవితవ్యంపై కూడా గిల్ మాట్లాడినట్లు సమాచారం. కరుణ్‌కు మరో అవకాశం ఉంటుందని గిల్ పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తుంది. కరుణ్ ఈ సిరీస్‌లో తన స్థాయి ప్రదర్శన చేయలేదన్న విషయాన్ని అంగీకరించిన గిల్.. అతనికి మరో అవకాశం ఉంటుందని చెప్పినట్లు సమాచారం. ఈ సిరీస్‌లో కరుణ్ ఫామ్‌ను అందిపుచ్చుకుంటాడని గిల్ ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
పంత్ విషయంలోనూ గిల్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. నాలుగో టెస్ట్‌లో పంత్ వికెట్‌కీపింగ్ చేస్తాడని గిల్ ధృవీకరించినట్లు తెలుస్తుంది. ఈ విషయాలతో పాటు గిల్ మూడో టెస్ట్ సందర్భంగా జరిగిన ఓ విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 90 సెకెన్లు ఆలస్యంగా బరిలోకి దిగిందని, ఇలా చేయడం క్రీడాస్పూర్తికి విరుద్దమని గిల్ అసహనం వ్యక్తిం చేసినట్లు సమాచారం.
నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవెన్..
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.
టీమిండియా (అంచనా)..
యశస్వి జైస్వాల్, KL రాహుల్, కరుణ్ నాయర్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK), ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.