
దులీప్ ట్రోఫీ-2025 ప్రారంభానికి ముందు ఇషాన్ కిషన్ నేతృత్వం వహిస్తున్న ఈస్ట్ జోన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. కీలక పేసర్ ఆకాశ్‌దీప్ జట్టు నుంచి తప్పించబడ్డాడు. కారణం ఏమో తెలీదు కాని, ఆకాశ్‌దీప్ స్థానంలో అస్సాం మీడియం పేసర్ ముక్తర్ హుసేన్ జట్టులోకి వచ్చాడు. ఎన్‌సీఏ ఆకాశ్‌దీప్‌ను విశ్రాంతి తీసుకోవాలని సిఫార్చు చేసినట్లు పీటీఐ చెబుతుంది.
ఆకాశ్‌దీప్ కొద్ది రోజుల కిందట ప్రకటించిన 15 మంది సభ్యుల ఈస్ట్ జోన్ జట్టులో ఉన్నాడు. అతను టీమిండియా పేసర్లు మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్‌లతో కలిసి బంతిని పంచుకోవాల్సి ఉండింది. అయితే అతను అనూహ్యంగా జట్టు నుంచి తప్పించబడ్డాడు.
ఆకాశ్‌దీప్ తాజాగా ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో సంచలన ప్రదర్శనలు నమోదు చేశాడు. టీమిండియా గెలిచిన బర్మింగ్హమ్ టెస్ట్‌లో 10 వికెట్ల ప్రదర్శన సహా ఓవల్ టెస్ట్‌లో నైట్ వాచ్‌మన్‌గా కీలకమైన హాఫ్ సెంచరీ చేశాడు.
కాగా, ఈస్ట్ జోన్ జట్టుకు టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతడికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) అభిమన్యు ఈశ్వరన్ ఎంపికయ్యాడు. జట్టులో విధ్వంసకర ఆటగాడు రియాన్ పరాగ్ చోటు దక్కించుకున్నాడు. భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.
దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ జట్టు- ఇషాన్ కిషన్ (wk/c), అభిమన్యు ఈశ్వరన్, సందీప్ పట్నాయక్, విరాట్ సింగ్, డెనిష్ దాస్, శ్రీరామ్ పాల్, శరణ్‌దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ జైస్వాల్, ముఖేష్ కుమార్, ముక్తార్ హుసేన్, మొహమ్మద్ షమీ
స్టాండ్‌బై ప్లేయర్‌లు- ముఖ్తార్ హుస్సేన్, ఆశీర్వాద్ స్వైన్, వైభవ్ సూర్యవంశీ, స్వస్తిక్ సమాల్, సుదీప్ కుమార్ ఘరామి, రాహుల్ సింగ్