షమీకి తప్పని నిరాశ
సఫారీతో టెస్టులకు టీమిండియా ఎంపిక
న్యూఢిల్లీ: స్టార్ వికెట్ కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్ మళ్లీ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఆకట్టుకున్న పేసర్ ఆకాశ్‌దీప్‌కూ సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఇంగ్లండ్‌లో నాలుగో టెస్టు సందర్భంగా పంత్ కాలికి గాయమైంది. దీంతో విండీస్‌తో సిరీస్‌కు సైతం దూరమయ్యాడు. ప్రస్తుతం భారత్ ‘ఎ’ జట్టు కెప్టెన్ పంత్ దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన మ్యాచ్‌లో రాణించాడు.
అయితే వెటరన్ సీమర్ మహ్మద్ షమీని సెలక్టర్లు పట్టించుకోలేదు. టీమిండియా బెర్తుకోసం రంజీల్లో శ్రమిస్తున్న అతని పేరును సెలక్టర్లు పరిశీలించకపోవడం చూస్తుంటే ఇక 35 ఏళ్ల షమీ కెరీర్ ముగిసినట్లేననే ఊహాగానాలకు ఊపిరి పోసినట్లయ్యింది. సఫారీతో ఈ నెల 14 నుంచి కోల్‌కతాలో తొలిటెస్టు, 22 నుంచి గువాహటి రెండో టెస్టులో జరుగుతుంది.
భారత టెస్టు జట్టు: గిల్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, పడిక్కల్, పంత్, జురేల్, జడేజా, సుందర్, బుమ్రా, అక్షర్, నితీశ్ రెడ్డి, సిరాజ్, కుల్దీప్, ఆకాశ్‌దీప్.


