దక్షిణాఫ్రికాలో మళ్లీ తూటా పేలింది. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఆగంతకులు జరిపిన కాల్పుల్లో పది మంది మరణించారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు.
ఆదివారం జొహన్నెస్‌బర్గ్ శివారులోని బెకర్స్‌డాల్ టౌన్‌షిప్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. కాల్పుల ఘటన తర్వాత ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమస్యాత్మక ప్రాంతం కావడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని అధికారులు అంటున్నారు.
🚨🇿🇦 BREAKING - MASS SHOOTING IN SOUTH AFRICA: 10 KILLED, 10 INJURED
Gunmen stormed a tavern in Bekkersdal Township and opened fire on a crowd without warning.
The attackers fled before police arrived, leaving victims dead and wounded across the scene.
No suspects have been… pic.twitter.com/ChXsPxgEwl— Mario Nawfal (@MarioNawfal) December 21, 2025
దక్షిణాఫ్రికాలో కఠినమైన ఆయుధ చట్టం అమల్లో ఉంది. ఫైర్‌ఆర్మ్స్ కంట్రోల్ యాక్ట్ 2000 ప్రకారం.. గన్ లైసెన్స్ పొందడానికి కంపిటెన్సీ టెస్ట్, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, పోలీసుల అనుమతి తప్పనిసరి. అలాగే ఆయుధాన్ని భద్రంగా ఉంచే చోటును కూడా పరిశీలిస్తారు. అయినప్పటికీ గన్ కల్చర్ ఆ దేశంలో పెద్ద సమస్యగా మారింది. సామూహిక కాల్పుల ఘటనలు తరచూ చోటు చేసుకుంటన్నాయి.
దక్షిణాఫ్రికాలో నెల వ్యవధిలో జరిగిన సామూహిక కాల్పుల ఘటన ఇది (Mass Shooting In South Africa). ఈ నెల 6న ప్రిటోరియా సమీపంలో అక్రమంగా మద్యం అమ్మే చోట దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారితో సహా 12 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు.


