టీ20 ప్రపంచకప్ 2026కి ముందు స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా ఘనంగా బోణీ కొట్టంది. పార్ల్ వేదికగా నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వికెట్ల పరంగా సౌతాఫ్రికా టీ20 చరిత్రలో విండీస్‌పై ఇదే భారీ విజయం.
ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో, ఆతర్వాత బ్యాటింగ్‌లో సత్తా చాటింది. బౌలింగ్‌లో జార్జ్ లిండే (4-0-25-3), కార్బిన్ బాష్ (4-0-35-2), కేశవ్ మహారాజ్ (4-0-44-2), రబాడ (4-0-35-0), మఫాకా (4-0-30-0) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.
హెట్‌మైర్ (48), రోవ్‌మన్ పావెల్ (29 నాటౌట్), బ్రాండన్ కింగ్ (27), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (22) తలో చేయి వేయడంతో ఈ స్కోర్ చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో జాన్సన్ ఛార్ల్‌స్ 13, మాథ్యూ ఫోర్డ్ 16, రూథర్‌ఫోర్డ్ 6, జేసన్ హోల్డర్ ఒక్క పరుగు చేసి ఔటయ్యారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా సునాయాసంగా విజయతీరాలకు చేరింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (86 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో సౌతాఫ్రికాను గెలుపు తీరాలు దాటించాడు. అతని ప్రిటోరియస్ (44), రికెల్టన్ (40 నాటౌట్) సహకరించారు.
ఫలితంగా సౌతాఫ్రికా 17.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సౌతాఫ్రికా కోల్పోయిన ఏకైక వికెట్ రోస్టన్ ఛేజ్‌కు దక్కింది. ఈ సిరీస్‌లోని రెండో టీ20 జనవరి 29న సెంచూరియన్ వేదికగా జరుగనుంది.


