
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు.
భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.
మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.
వరుస షాక్‌లు
అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్‌దీప్ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో తొలి టెస్ట్‌లో సెంచరీలు చేసిన బెన్ డకెట్, ఓలీ పోప్‌లను డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
మరో ఎదురుదెబ్బ
13 పరుగుల వద్ద వరుస బంతుల్లో ఇన్ ఫామ్ బ్యాటర్లు డకెట్, పోప్ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 25 పరుగుల వద్ద జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో క్రాలే పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 33/3గా ఉంది. రూట్ (5), బ్రూక్ (5) క్రీజ్‌లో ఉన్నారు.