ఇదేం పద్ధతి?.. బీసీసీఐపై రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ ఫైర్‌ | Rohit Sharma Fans As Gill Shown As CT Winning Captain BCCI Awards | Sakshi
Sakshi News home page

చరిత్ర చెరిగిపోదు: బీసీసీఐపై రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ ఫైర్‌

Mar 16 2026 11:30 AM | Updated on Mar 16 2026 12:24 PM

Rohit Sharma Fans As Gill Shown As CT Winning Captain BCCI Awards

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీరుపై టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అసలు ఇదేం పద్ధతి.. చరిత్ర చెరిగిపోదు.. మీ కుట్రలు ఫలించవు’’ అంటూ తీవ్ర స్థాయిలో సోషల్‌ మీడియా వేదికగా ఫైర్‌ అవుతున్నారు. బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం ‘నమన్‌-2026’లో దొర్లిన తప్పిదమే ఇందుకు కారణం.

రెండు ఐసీసీ టైటిళ్లు
విరాట్‌ కోహ్లి (Virat Kohli) తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టిన రోహిత్‌ శర్మ 2024లో టీ20 ప్రపంచకప్‌, 2025లో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీని భారత్‌కు అందించాడు. తద్వారా మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni-3)తర్వాత టీమిండియాకు అత్యధిక టైటిళ్లు అందించిన సారథిగా చరిత్రకెక్కాడు.

ఇక 2024లో టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ.. గతేడాది టెస్టులకూ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న హిట్‌మ్యాన్‌కు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది,

వన్డే కెప్టెన్‌గా ఇప్పటికీ సిరీస్‌ గెలవని గిల్‌
గతేడాది.. అనూహ్య రీతిలో ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి.. శుబ్‌మన్‌ గిల్‌ను సారథిగా నియమించింది. గిల్‌ కెప్టెన్సీలో భారత్‌ ఇప్పటి వరకు ఒక్క వన్డే సిరీస్‌ కూడా గెలవలేదు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతిలో ఓడిన గిల్‌ సేన.. సొంతగడ్డపై మరీ దారుణంగా న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది.

ఇదిలా ఉంటే.. నమన్‌ అవార్డుల పురుషుల విభాగంలో భారత అత్యుత్తమ క్రికెటర్‌ అవార్డు గిల్‌కు దక్కింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో 754 పరుగులు చేసి అటు బ్యాటర్‌గా, ఇటు సారథిగా గిల్‌ అత్యుత్తమ ఆటతీరు కనబరిచినందుకు ఈ అవార్డు వరించింది.

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 విన్నింగ్‌ కెప్టెన్‌?
ఈ నేపథ్యంలో గిల్‌ మాట్లాడుతున్న సమయంలో.. నిర్వాహకులు.. ‘శుబ్‌మన్‌ గిల్‌, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 విన్నింగ్‌ కెప్టెన్‌’’ అని అతడి పేరును స్క్రీన్‌పై వేశారు. ఇదే రోహిత్‌ శర్మ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

ఇంత వరకు ఒక్క వన్డే సిరీస్‌ గెలవని కెప్టెన్‌కు ఏకంగా చాంపియన్స్‌ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్‌ అని వేయడం ఏమిటని, రోహిత్‌ శర్మ ఘనత చెరిపేసినా చెరిగిపోదని బీసీసీఐకి చురకలు అంటిస్తున్నారు. మరికొందరు మాత్రం పొరపాటున తప్పు దొర్లి ఉంటుందని కామెంట్‌ చేస్తుండగా.. రోహిత్‌ను అవమానించేందుకే ఇలా చేశారంటూ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.

చదవండి: : అతడికి 6 ఓవర్లు చాలు.. మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement