
Update: లంచ్ తర్వాత మరో 2 వికెట్లు తీసిన టీమిండియా. క్రిస్ వోక్స్‌ను (7) ప్రసిద్ద్ కృష్ణ.. జేమీ స్మిత్‌ను ఆకాశ్‌దీప్ (88) ఔట్ చేశారు. 56 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 226/8గా ఉంది. భారత్ గెలుపుకు కేవలం 2 వికెట్లు మాత్రమే కావాలి. ఆకాశ్‌దీప్ ఈ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి 10 వికెట్ల ప్రదర్శనపై కన్నేశాడు. ఆకాశ్‌దీప్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు.
ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో చారిత్రక గెలుపుకు 4 వికెట్ల దూరంలో ఉంది. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇక్కడ ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఏడింట ఓడి, ఓ మ్యాచ్ డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు. వారి ఆరాటం మరికొద్ది గంటల్లో తీరే అవకాశం ఉంది.
608 పరుగల భారీ లక్ష్య ఛేదనలో 72/3 వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. లంచ్ విరామం సమయానికి 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 455 పరుగులు కావాలి. అది అసాధ్యం. భారత్ గెలలాంటే మాత్రం కేవలం 4 వికెట్లు తీస్తే చాలు.
వర్షం కారణంగా ఇవాల్టి ఆట గంట 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం కారణంగా 10 ఓవర్లు కోతకు గురైంది. ఈ రోజు కేవలం 80 ఓవర్ల ఆట మాత్రమే జరుగుతుంది. ఆట ప్రారంభం కాగానే టీమిండియా పేసర్ ఆకాశ్‌దీప్ ఇంగ్లండ్‌ను భారీ దెబ్బేశాడు. అతని బౌలింగ్‌లో ఓలీ పోప్ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆతర్వాత కొద్ది సేపటికే ఆకాశ్‌దీప్ మరోసారి రెచ్చిపోయాడు. ఈ సారి ఇన్ ఫామ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (23) ఎల్బీడబ్ల్యూ చేసి ఇంగ్లండ్ డ్రా ఆశలపై నీళ్లు చల్లాడు. అనంతరం స్టోక్స్, జేమీ స్మిత్ ఆరో వికెట్‌కు 70 పరుగులు జోడించి టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు.
ఈసారి వాషింగ్టన్ సుందర్ అద్బుతమైన బంతితో బెన్ స్టోక్స్‌ను (33) పెవిలియన్‌కు సాగనంపాడు. స్టోక్స్ వికెట్ పడగానే అంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు. 32 పరుగులతో జేమీ స్మిత్ క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగో రోజు ఆటలో బెన్ డకెట్ (25), రూట్‌ను (60) ఔట్ చేసిన ఆకాశ్‌దీప్ ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 4 వికెట్లు తీయగా.. సిరాజ్, సుందర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (162 బాల్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.
దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో సిరాజ్ 6, ఆకాశ్‌దీప్ 4 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269) భారీ డబుల్ సెంచరీతో రికార్డులు తిరగరాశాడు. యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు.
స్కోర్ వివరాలు..
భారత్ 587 & 427/6 డిక్లేర్
ఇంగ్లండ్ 407 & 153/6 (40.3)