breaking news
EDGbaston
-
చరిత్ర సృష్టించిన గిల్.. కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద ఓ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. టెస్టు సారథిగా అరంగేట్రంలోనే సెంచరీఇక ఈ సిరీస్ ద్వారానే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి భారీ శతకం (147) సాధించాడు.తద్వారా టెస్టు జట్టు సారథిగా తొలి ప్రయత్నంలోనే సెంచరీ చేసి అనేక రికార్డులను గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గిల్ కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో మాత్రం గిల్ తన విశ్వరూపం చూపించాడు.డబుల్ సెంచరీ, శతకంతో చెలరేగితొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా భారీ డబుల్ సెంచరీ (269)తో దుమ్ములేపిన ప్రిన్స్.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకం (161) సాధించాడు. తద్వారా ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడు, కెప్టెన్‌గా గిల్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.ఇక తాజాగా లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో గిల్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 44 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ సాబ్.. రెండు ఫోర్ల సాయంతో కేవలం 16 పరుగులే రాబట్టాడు. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు.ఆసియా తొలి కెప్టెన్‌గా..అయితే, మూడో టెస్టులో గిల్ విఫలమైనప్పటికీ.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికి ఐదు ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన గిల్ ఏకంగా 601 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ గడ్డ మీద ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా తొలి కెప్టెన్‌గా గిల్ ప్రపంచ రికార్డు సాధించాడు. అంతకుముందు కోహ్లి పేరిట ఈ రికార్డు ఉండేది.ఇంగ్లండ్ గడ్డ మీద ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా కెప్టెన్లు వీరే🏏శుబ్‌మన్ గిల్ (ఇండియా)- 601* రన్స్- 2025లో..🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 593 రన్స్- 2018లో..🏏మహ్మద్ అజారుద్దీన్ (ఇండియా)- 426 రన్స్- 1990లో..🏏జావేద్ మియాందాద్ (పాకిస్తాన్)- 364 రన్స్- 1992లో..🏏సౌరవ్ గంగూలీ (ఇండియా)- 351 రన్స్- 2002లో...👉ఇక ఓవరాల్‌గా ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్ల జాబితాలో... గిల్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ (597)ను గిల్ అధిగమించాడు. ఇక ఈ లిస్టులో గ్యారీ సోబర్స్ (722), గ్రేమ్ స్మిత్ (714) గిల్ కంటే ముందు వరుసలో ఉన్నారు. చదవండి: చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడను.. ఎందుకంటే: బుమ్రా -
T20 WC 2026: వార్మప్ మ్యాచ్‌ల వేదికలు ప్రకటించిన ఐసీసీ
మహిళల టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నమెంట్‌కు సంబంధించిన అంతర్జాతీయ మండలి (ICC) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మెగా ఈవెంట్ సన్నాహకాల్లో భాగంగా జట్లు ఆడనున్న వార్మప్ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసింది. కాగా వచ్చే ఏడాది జూన్ 12- జూలై 5 వరకు టీ20 ప్రపంచకప్ నిర్వహణకు ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీలో మొత్తం పన్నెండు జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్తాన్‌లు ఇప్పటికే అర్హత సాధించగా.. గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో నాలుగు జట్లు ఈ టోర్నీ ఆడతాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపులో ఆరు జట్లను ఆడిస్తారు.ఇక ఈ టోర్నీని 24 రోజుల పాటు నిర్వహించనుండగా.. ఎడ్జ్‌బాస్టన్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, హాంప్‌షైర్ బౌల్, హెడింగ్లీ, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, ది ఓవల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే, వార్మప్ మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేయని ఐసీసీ.. వేదికలకు మాత్రం ఫైనల్ చేసింది. కార్డిఫ్స్ సోఫియా గార్డెన్స్, డెర్బీ కౌంటీ గ్రౌండ్, లొబరో యూనివర్సిటీ మైదానాల్లో సన్నాహక మ్యాచ్‌లు జరుగుతాయని గురువారం వెల్లడించింది.కాగా 2024 నాటి మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో న్యూజిలాండ్ చాంపియన్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈసారి భారత్ జూన్ 14 నాటి తమ తొలి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఆ తర్వాత గ్లోబల్ క్వాలిఫయర్ నుంచి వచ్చిన జట్టుతో జూన్ 17న మ్యాచ్ ఆడుతుంది. అనంతరం సౌతాఫ్రికాతో జూన్ 21, క్వాలిఫయర్ జట్టుతో జూన్ 25, ఆస్ట్రేలియాతో జూన్ 28న భారత జట్టు తలపడనుంది. ఈ టోర్నీలో భాగంగా మొత్తం 33 మ్యాచ్‌లు జరుగుతాయి.చదవండి: నేను ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ అతడే: శిఖర్ ధావన్ -
MCC: ఆకాశ్ దీప్ డెలివరీ.. రూట్‌కు అన్యాయం?.. ఎంసీసీ స్పందన ఇదే
టీమిండియాతో రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) అవుటైన తీరుపై మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) స్పందించింది. ఇందులో ఎలాంటి వివాదానికి తావులేదని.. భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) సంధించిన డెలివరీ నిబంధనలకు లోబడే ఉందని స్పష్టం చేసింది. ఈ అంశంపై అనవసరపు రాద్దాంతాలు అక్కర్లేదని కొట్టిపారేసింది.తొలి గెలుపుటెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టు గెలవగా.. రెండో టెస్టులో భారత్ జయభేరి మోగించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసి.. ఈ వేదికపై తొలిసారి గెలుపు రుచిచూసింది.పది వికెట్లు తీసిన ఆకాశ్ఇక భారత్ విజయంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (269, 161)తో పాటు పేసర్ ఆకాశ్ దీప్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరిదైన ఐదో రోజు ఏడు వికెట్లు కూల్చాల్చిన తరుణంలో ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో పది వికెట్లు తీసి సత్తా చాటాడు.అయితే, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ పేసర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. బెన్ డకెట్ (25), ఓలీ పోప్ (24), జో రూట్ (6)లను బౌల్డ్ చేసిన ఆకాశ్ దీప్.. హ్యారీ బ్రూక్ (23)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.రూట్ బలయ్యాడా?అదే విధంగా జేమీ స్మిత్ (88), బ్రైడన్ కార్స్ (38) వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, జో రూట్ అవుటైన తీరు పట్ల విమర్శలు వచ్చాయి. ఆకాశ్ దీప్ రూట్‌ను బౌల్డ్ చేసింది నిజమే అయినా.. అది నో బాల్ అని.. అతడి కాలు రిటర్న్ క్రీజును దాటిందని పలువురు విమర్శించారు. అంపైర్ తప్పిదం కారణంగా అనవసరంగా రూట్ బలయ్యాడంటూ కామెంట్లు చేశారు.𝐑𝐨𝐨𝐭 𝐟𝐚𝐥𝐥𝐬 𝐭𝐨 𝐃𝐞𝐞𝐩 🥶#AkashDeep uproots #JoeRoot with a searing in-swinger, his second wicket puts England firmly on the back foot 🤩#ENGvIND 👉 2nd TEST, Day 4 | LIVE NOW on JioHotstar ➡ https://t.co/2wT1UwEcdi pic.twitter.com/avu1sqRrcG— Star Sports (@StarSportsIndia) July 5, 2025ఎంసీసీ వివరణఅయితే, అంపైర్ మాత్రం తన నిర్ణయాన్ని అమలు చేసి రూట్‌ను అవుట్‌గా ప్రకటించాడు. ఈ విషయంపై ఎంసీసీ తాజాగా స్పందించింది. రూట్ విషయలో అంపైర్‌ది సరైన నిర్ణయమని సమర్థించింది. ‘‘గత వారం టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా ఆకాశ్ దీప్ జో రూట్‌ను అవుట్ చేసిన విధానంపై కొందరు సందేహాలు లేవనెత్తారు.అభిమానులతో పాటు కామెంటేటర్లు కూడా అది బ్యాక్ ఫుట్ నో బాల్ అని విశ్వసించారు. నిజానికి దీప్ అసాధారణ రీతిలో క్రీజుపై ల్యాండ్ అయ్యాడు. అతడి బ్యాక్ ఫుట్ రిటర్న్క్రీజు ఆవల నేలను తాకినట్లు కనిపించింది. అయినా సరే.. అంపైర్ దానిని నో బాల్‌గా ప్రకటించలేదని అన్నారు.అయితే, ఈ విషయంలో ఎంసీసీ స్పష్టతనివ్వాలని భావిస్తోంది. నిబంధనల ప్రకారం.. బౌలర్ బ్యాక్ ఫుట్ తొలుత ఎక్కడ ల్యాండ్ అయిందన్న విషయాన్నే ఎంసీసీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఇక్కడ దీప్ పాదం వెనుక భాగం తొలుత నేలను తాకింది. అది రిటర్న్ క్రీజు లోపలే ఉంది.అయితే, అతడి పాదంలో కొంత భాగం రిటర్న్ క్రీజు అవతల నేలను తాకి ఉండవచ్చు. కానీ నిబంధన ప్రకారం.. అతడి పాదం తొలుత రిటర్న్ క్రీజులోపలే ల్యాండ్ అయింది. కాబట్టి ఇది చట్టబద్దమైన డెలివరీయే’’ అని ఎంసీసీ తన ప్రకటనలో పేర్కొంది. చదవండి: భారత్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ -
బాధపడకు తమ్ముడు!.. ఇంకో ఆర్నెళ్ల సమయం ఉంది.. అన్నీ తానై..
లక్నో: భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) విజయవంతమైన బౌలింగ్ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేసిన అతని సోదరి అఖండ్ జ్యోతి సింగ్ భావోద్వేగానికి గురైంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న జ్యోతికి.. ఎడ్జ్‌బాస్టన్‌లోని పది వికెట్ల ప్రదర్శన అంకితమిస్తున్నట్లు మ్యాచ్ ముగిసిన అనంతరం ఆకాశ్‌దీప్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో ఓ వార్తా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన జ్యోతి తన సోదరుడికి తన ఆనారోగ్యంపై చింతించకుండా దేశం కోసం శ్రమించాలని చెప్పినట్లు వెల్లడించింది.మా నాన్న చనిపోయినపుడు..క్యాన్సర్ బారిన పడటంతో తన కుటుంబానికి దూరమైన ఆనందాన్ని ఆకాశ్‌దీప్ తన ఆటతీరు ద్వారా తిరిగి తీసుకొచ్చాడని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తమ కుటుంబాన్ని 2015 ఏడాది పెను విషాదంలో ముంచిందని... మళ్లీ ఇన్నాళ్లకు ఆనందం వెల్లివిరిసిందని జ్యోతి చెప్పింది. ‘మా నాన్న చనిపోయినపుడు ఆకాశ్ ఢిల్లీలో క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే ఆశించిన ఎదుగుదల రాలేదు. దీంతో నేను గట్టిగా చెప్పాను. క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకుంటేనే రాణిస్తావని చెప్పా. ఇక్కడ కుదరకపోతే మరో చోటయినా ప్రయత్నించాలని సూచించాను. దీంతో 2017లో కోల్‌కతాకు మారాక బెంగాల్ అండర్–23 జట్టు తరఫున నిలకడగా రాణించడం మొదలుపెట్టాడు. ఒకే ఏడాది తండ్రి, ఓ తమ్ముడు మరణించడంతో మా కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అయినా సరే దేనికి దిగులు చెందక ఆకాశ్ లక్ష్యాన్ని చేరుకునేందుకు మా వంతు ప్రయత్నం మేం చేశాం’ అని జ్యోతి వివరించింది.జబ్బు గురించి చెప్పాలనుకోలేదు ఈ మ్యాచ్‌ను మేమంతా చూశాం. వికెట్ తీసిన ప్రతీసారి గట్టిగా చప్పట్లతో సంబరం చేసుకున్నాం. దీంతో ఇరుగు పొరుగువారు వచ్చి ఏమైందని అడిగి వెళ్లిపోయారు. దేశానికి విజయాన్నిచ్చిన అతని ప్రదర్శన మాకైతే పండగను తెచ్చింది. ఇక మీడియాలో నా జబ్బు సంగతి చెప్పినట్లు మొదట తెలియదు.ఎందుకంటే నా క్యాన్సర్ గురించి బయటికి వెల్లడించేందుకు మా కుటుంబం సిద్ధంగా లేదు. బహుశా నాపై అప్యాయత కొద్దీ ఆ క్షణం భావోద్వేగానికి గురై అక్కకు అంకితం చేస్తున్నానని చెప్పి ఉండొచ్చు. నేనన్నా... కుటుంబమన్నా అతనికి వల్లమాలిన ప్రేమ. నాకిప్పుడు క్యాన్సర్ మూడో దశలో ఉంది. ఇంకో ఆర్నేళ్ల చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఆ తర్వాతే ఏమవుతుందో చూడాలి. ఐపీఎల్ సమయంలో హాస్పిటల్‌కు... ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించే ఆకాశ్ లీగ్ జరిగే సమయంలో పది వేదికలు మార్చి మార్చి ఆడే అంతటి బిజీ షెడ్యూల్లోనూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నన్ను పరామార్శించేందుకు మ్యాచ్ ముందో, తర్వాతో తప్పకుండా వచ్చేవాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికపై విజయం సాధించాక రెండుసార్లు వీడియో కాల్లో మాట్లాడుకున్నాం.అప్పుడు అతను.. నాతో .. ‘‘అక్క ఏమాత్రం బాధపడకు. దేశం మొత్తం మనవెంటే ఉందని చెప్పడంతో ఆ క్షణం నన్ను నేను నియంత్రించుకోలేక భావోద్వేగానికి గురై ఏడ్చేశాను. నిజం చెబుతున్నా... ఇలాంటి తమ్ముడు చాలా అరుదుగా ఉంటాడు. మాకెప్పుడు అండగా ఉంటాడు. మాకు చెప్పందే ఏదీ చేయడు. ప్రతి విషయాన్ని కుటుంబంతో పంచుకుంటాడు. ఆర్నెళ్ల వ్యవధిలోనే మా నాన్న, ఒక సోదరుడు మరణించడంతో కుటుంబభారాన్ని ఆకాశే అన్నీ తానై మోస్తున్నాడు.ఆకాశమంత ధైర్యం నేను క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆకాశ్ మాటలే నా స్థయిర్యాన్ని పెంచేవి. నా ఆరోగ్యం గురించే ఆలోచించేవాడు. అప్పుడు నేను అతని దృష్టి ఆటపైనే కేంద్రీకరించేందుకు ధైర్యం చెప్పేదాన్ని. ‘నేనిప్పుడు బాగానే ఉన్నాను. నా కోసం బాధపడొద్దు. నాకు తోడుగా నా భర్త ఉన్నాడు. నీవేం విచారించకు’ అని చెబితే... వెంటనే కల్పించుకుని తానేం చేసినా, సాధించినా సోదరిల కోసం, కుటుంబం కోసమే అని బదులిచ్చాడు.మా తల్లిదండ్రులకు మేం ఆరుగురు సంతానం. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలం. ఆకాశ్ అందరికంటే చిన్నవాడు. నేను తనకంటే పదేళ్లు పెద్ద. చిన్నప్పటి నుంచి కూడా మా ఇద్దరి మధ్య ఆప్యాయత ఎక్కువే. మ్యాచ్‌కు ముందు, తర్వాత నాకు వీడియో కాల్ చేసి మాట్లాడతాడు. నేను తీసిన ఈ వికెట్లు నీ కోసం, దేశం కోసం’ అని గర్వంగా చెబుతాడు.రాగానే దహీ వడ తినిపిస్తా ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి రాగానే ఆకాశ్ దీప్‌కు ఇష్టమైన వంట చేసి పెడతా. తనకిష్టమైనవే కాదు... తను ఏం కావాలన్నా సరే వండిపెడతా. నేను చేసే దహీ వడ అంటే అతనికెంతో ఇష్టం. ఆకుకూరలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటాడు. మా ఇంటికి ఎప్పుడొచ్చినా అవే చేసిపెట్టాలంటాడు. చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్ -
అందని ద్రాక్ష పుల్లన!... ఇంత ఏడుపు దేనికి?
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes)పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ఓడిపోయిన తర్వాత ఇలాంటి కుంటిసాకులు చెప్పడం అస్సలు బాగాలేదంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘‘అందని ద్రాక్ష పుల్లన’’ అనుకునే ‘నక్క’ మాదిరి వేషాలు వేయొద్దంటూ తమదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు. రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర తిరగరాస్తూ తొలిసారి ఆతిథ్య జట్టు (IND Beat ENG)పై విజయ ఢంకా మోగించింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి వెయ్యికి పైగా పరుగులు సాధించి.. ఇంగ్లండ్‌ను ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకుని ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.ఉపఖండ పిచ్ మాదిరే ఉందిఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందిస్తూ.. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘నిజం చెప్పాలంటే.. ఈ వికెట్ ఉపఖండ పిచ్ మాదిరే ఉంది. ఆట సాగుతున్న కొద్దీ పరుగులు రాబట్టడం కష్టతరంగా మారింది.పర్యాటక జట్టుకు అలవాటైన పిచ్‌లా మారిపోయిందనిపించింది. భారత బౌలింగ్ దళం తమకు అనుకూలమైన మాదిరి పిచ్‌పై బాగా ఆడింది’’ అని స్టోక్స్ పేర్కొన్నాడు. కాగా ఉపఖండ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయన్న విషయం తెలిసిందే.పేసర్లకు 18 వికెట్లుఅయితే, ఎడ్జ్‌బాస్టన్ పిచ్ పొడిగా ఉంటుంది కాబట్టి బంతి టర్న్ అవుతుందనుకున్నా.. ఈ మ్యాచ్‌లో భారత పేసర్లే 18 వికెట్లు పడగొట్టారు. స్పిన్ ఆల్‌రౌండర్లైన రవీంద్ర జడేజా, వాషింగ్టన్ తలా ఒక్క వికెట్ మాత్రమే తీశారు. దీనిని బట్టి టీమిండియా కొత్త బంతితో ఎంత అద్భుతంగా రాణించిందో అర్థమవుతోంది. అయినప్పటికీ స్టోక్స్ ఇలా పిచ్‌ను సాకుగా చూపి.. టీమిండియా గెలుపును తక్కువ చేసేలా మాట్లాడటం అభిమానులకు రుచించలేదు. దీంతో.. ‘‘ఇంత ఏడుపు దేనికి?.. హుందాగా ఓటమిని అంగీకరించవచ్చు కదా’’ అంటూ అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.వరల్డ్ క్లాస్ టీమ్ ఇక ఏదేమైనా భారత్ వరల్డ్ క్లాస్ టీమ్ అంటూ ప్రశంసించిన స్టోక్స్.. శుమ్‌మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని కొనియాడటం విశేషం. కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ద్విశతకం (269), శతకం (161) బాదగా... పేసర్ ఆకాశ్ దీప్ పది వికెట్లతో చెలరేగాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య జూలై 10- 14 మధ్య జరుగనున్న మూడో టెస్టుకు లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదిక.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు- సంక్షిప్త స్కోర్లు👉భారత్: 587 & 427/6 డిక్లేర్డ్👉ఇంగ్లండ్: 407 & 271👉ఫలితం: ఇంగ్లండ్‌పై 336 పరుగుల తేడాతో భారత్ జయభేరి.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్ -
అక్కా.. ఇది నీ కోసమే.. బంతి అందుకున్న ప్రతిసారీ..: ఆకాశ్ దీప్ భావోద్వేగం
‘‘మా అక్కకు క్యాన్సర్. గత రెండు నెలలుగా ఆమె వ్యాధితో పోరాడుతోంది. ఇంత వరకు నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే, ప్రస్తుతం మా అక్క పరిస్థితి బాగానే ఉంది. తను కోలుకుంటోంది.ఈ మ్యాచ్‌లో నా ఆటతీరుతో ఆమె ఎంతగానో సంతోషించి ఉంటుంది. మా అక్కకు నా ఈ మ్యాచ్‌ను అంకితమిస్తున్నా. ఆమె ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ చెరగకూడదు. ఇది నీ కోసమే అక్కా.. బంతి అందుకున్న ప్రతిసారి నా మనసులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి.నీ రూపమే నా మదిలో మెదులుతుంది. నిన్ను సంతోషరచాలనే నా ప్రయత్నాలు. మేమంతా నీతోనే ఉన్నాం’’ అంటూ టీమిండియా స్టార్ ఆకాశ్ దీప్ (Akash Deep) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston)లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ పేస్ బౌలర్.. తన ప్రదర్శనను క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అక్కకు అంకితమిచ్చాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో గిల్ సేన.. ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ఆది నుంచే ఆధిపత్యంఇలాంటి తరుణంలో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు బరిలో దిగిన భారత్.. ఆది నుంచే ఆధిపత్యం కనబరిచింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగి డబుల్ సెంచరీ (269), సెంచరీ (161) బాది జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ఇంగ్లండ్‌కు 608 పరుగుల మేర భారీ లక్ష్యం విధించగలిగింది.కీలక వికెట్లు కూల్చి.. విజయం అందించిఈ క్రమంలో శనివారం నాటి నాలుగో రోజు ఆట పూర్తవుతుందనగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. తొలిరోజే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే, ఐదో రోజు వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యం కాగా.. ‘డ్రా’ భయం అభిమానులను వెంటాడింది. కానీ ఆకాశ్ దీప్ ఇంగ్లండ్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు.అద్భుతమైన డెలివరీలతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. బెన్ డకెట్ (25), ఓలీ పోప్ (24), జో రూట్ (6), హ్యారీ బ్రూక్ (23), జేమీ స్మిత్ (88) రూపంలో ఏకంగా ఐదు కీలక వికెట్లు కూల్చిన ఆకాశ్.. బ్రైడన్ కార్స్ (38) వికెట్‌తో సిక్సర్ కొట్టాడు. తద్వారా ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ తొలిసారి టెస్టు మ్యాచ్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.బుమ్రా లేడు కాబట్టే..నిజానికి రెండో టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో ఆకాశ్ దీప్‌నకు తుదిజట్టులో చోటు దక్కింది. ఇక అక్క క్యాన్సర్‌తో పోరాడుతున్న వేళ.. ఓవైపు తోబుట్టువు గురించి మనసులో ఆందోళనలు చెలరేగుతున్నా ఈ రైటార్మ్ పేసర్ తన ఏకాగ్రత చెదరనీయలేదు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.#AkashDeep’s 6/99 was nothing short of sensational. A game-changing performance that turned the tide in India’s favour, securing a historic victory.#ENGvIND 👉 3rd TEST, THU, JULY 10, 2:30 PM onwards on JioHotsta pic.twitter.com/JfBGgKQF7T— Star Sports (@StarSportsIndia) July 6, 2025 ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లతో మెరిశాడు. ఇలా రెండో టెస్టులో మొత్తంగా పది వికెట్లు తీసి టీమిండియా చిరస్మరణీయ విజయంలో కీలకంగా మారాడు. మిగతా వాళ్లలో సిరాజ్ మొత్తంగా ఏడు వికెట్లు కూల్చగా.. ప్రసిద్ కృష్ణ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు (జూలై 2-6)వేదిక: ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్హామ్భారత్: 587 & 427/6 డిక్లేర్డ్ఇంగ్లండ్: 407 & 271ఫలితం: ఇంగ్లండ్‌పై 336 పరుగుల తేడాతో భారత్ భారీ విజయంప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్‌మన్ గిల్.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్ -
ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్
ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా చరిత్రను తిరగరాసింది. ఎక్కడైతే వరుస పరాజయాలు చవిచూసిందో అక్కడే ఘన విజయం సాధించి సగర్వంగా తలెత్తుకుంది. తొమ్మిదో ప్రయత్నంలో ఎడ్జ్‌బాస్టన్ వేదికపై తొలిసారి టెస్టు మ్యాచ్‌లో జయభేరి మోగించింది. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును ఏకంగా 336 పరుగుల (India Beat England)తో చిత్తు చేసింది.ఇక భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు ఇదే తొలి విజయం. లీడ్స్‌లో స్టోక్స్ బృందం చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూనే.. సరికొత్త చరిత్ర సృష్టించాడు గిల్. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా సత్తా చాటి విమర్శకులకు సమాధానం ఇచ్చాడు.ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో గిల్ డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)తో చెలరేగి.. ఆతిథ్య జట్టుకు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఆఖరి రోజు వర్షం అడ్డంకిగా మారినా.. పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) తన అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను కట్టడి చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో అతడు మొత్తంగా పది వికెట్లు కూల్చాడు.ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతేఈ నేపథ్యంలో విజయానంతరం కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ఆకాశ్ దీప్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘అతడు తన ప్రాణం పెట్టి పూర్తి నిబద్ధతతో ఆడాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో అద్భుతం చేశాడు. ఇలాంటి వికెట్ మీద ఇలా బౌలింగ్ చేయడం అందరికీ సాధ్యం కాదు. అతడొక అద్భుతం అంతే’’ అంటూ ఆకాశ్‌ను ఆకాశానికెత్తాడు.కెప్టెన్‌కు ఇంకేం ఇబ్బందిఅదే విధంగా మిగతా బౌలర్ల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మా బౌలర్లు చక్కటి ప్రదర్శన కనబర్చారు. పేసర్లే 17 వికెట్లు తీసి ఇస్తే.. కెప్టెన్‌కు ఇంకేం ఇబ్బంది ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా 20 వికెట్లు తీయగల బౌలింగ్ దళం మాకు ఉంది. గతంలో ఎన్నోసార్లు సిరీస్ తొలి మ్యాచ్‌లో ఓడిన తర్వాత తిరిగి పుంజుకున్నాం. మా గెలుపునకు కారణం అదేగత మ్యాచ్ అనంతరం లోపాలపై దృష్టి పెట్టాం. ఈసారి బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుగైన ప్రదర్శన వల్లే విజయం సాధ్యమైంది’’ అని తమ గెలుపునకు గల కారణాన్ని వెల్లడించాడు. ఇక తన వ్యక్తిగత ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నానన్న గిల్.. క్రీజులో ఉన్నప్పుడు బ్యాటర్‌గానే ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.కాగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చినా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ కలిసి అతడు లేని లోటును పూడ్చారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఆరు వికెట్లతో అదరగొట్టగా.. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు కూల్చాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్ దీప్.. ఆరు వికెట్లు కూల్చి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వారిలో సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఒక్కో వికెట్ తీయగా.. స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.చదవండి: Akash Deep: ‘ఆకాశ’మంత ఆనందం... #AkashDeep’s 6/99 was nothing short of sensational. A game-changing performance that turned the tide in India’s favour, securing a historic victory.#ENGvIND 👉 3rd TEST, THU, JULY 10, 2:30 PM onwards on JioHotsta pic.twitter.com/JfBGgKQF7T— Star Sports (@StarSportsIndia) July 6, 2025 -
Akash Deep: ‘ఆకాశ’మంత ఆనందం...
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులోనూ టీమిండియా మెరుగైన ప్రదర్శనే చేసింది. 15 సెషన్ల పాటు సాగిన పోరులో... అధిక భాగం మనదే ఆధిపత్యం. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ శతకాలతో ప్రత్యర్థి ముందు 371 పరుగుల లక్ష్యం నిలిచింది. ఎలాంటి పిచ్‌పైనైనా నాలుగో ఇన్నింగ్స్‌లో ఈ స్కోరు ఛేదించడం కష్టతరమే! అందులోనూ ప్రపంచ అత్యుత్తమ పేసర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టడం అంటే ఆషామాషీ కాదు! అయితే ఇక్కడే ఇంగ్లండ్ ప్లేయర్లు తమ గేమ్ ప్లాన్‌తో ఆకట్టుకున్నారు. ]బుమ్రాను గౌరవించిన ఆతిథ్య ఆటగాళ్లు ఇతర బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిర్జీవ పిచ్‌పై ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగుల పండగ చేసుకుంటుంటే... మనవాళ్లు చేష్టలుడిగి చూస్తుండటం తప్ప మరేం చేయలేకపోయారు. సిరాజ్ ప్రభావం చూపలేకపోగా... ప్రసిధ్ కృష్ణ టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఏ బౌలర్‌కు సాధ్యం కాని చెత్త గణాంకాలు ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ నిర్ణయాలు బెడిసికొట్టడంతో... ఇక సిరీస్‌లో టీమిండియా కోలుకోవడం కష్టమే అనే వార్తలు వినిపించాయి. దీనికి తోడు ఆరు నెలల ముందు నుంచే బుమ్రా ఇంగ్లండ్ పర్యటనలో మూడు టెస్టులే ఆడుతాడు అని మేనేజ్మెంట్ ఊదరగొడుతుండగా... రెండో మ్యాచ్‌కు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. బరి్మంగ్హామ్లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్ గెలిచిన చరిత్రలేని భారత జట్టు... ప్రధాన పేసర్ బుమ్రా లేకుండానే బరిలోకి దిగింది. ఇంకేముంది మరో పరాజయానికి బాటలు పడ్డట్లే అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇలాంటి స్థితిలోనే టీమిండియా అద్భుతం చేసింది. మహామహా ఆటగాళ్లకు సాధ్యం కాని ఘనతను ఖాతాలో వేసుకుంది. యువ సారథి శుబ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేయడం వల్లే టీమిండియా కొండంత స్కోరు చేసిన మాట వాస్తవమే అయినా... ఆత్మవిశ్వాసం లోపించిన బౌలింగ్ దళంలో జవసత్వాలు నింపిన ఘనత మాత్రం ఆకాశ్దీప్కే దక్కుతుంది. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయాల్సిన తీవ్ర ఒత్తిడిలో... కొత్త బంతి అందుకున్న ఆకాశ్‌దీప్ తన రెండో ఓవర్లోనే ఇంగ్లండ్‌కు ‘డబుల్ స్ట్రోక్’ ఇచ్చాడు. ఓ చక్కటి బంతితో డకెట్‌ను బుట్టలో వేసుకున్న ఈ బీహార్ పేసర్... తదుపరి బంతికి ఓలీ పోప్‌ను పెవిలియన్ బాట పట్టించి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఈ రెండు వికెట్లలో క్యాచ్‌లు పట్టిన గిల్, రాహుల్‌కు కూడా సమాన పాత్ర ఉన్నా... జట్టులో ఒక్కసారిగా సానుకూల దృక్పథం తీసుకొచ్చింది మాత్రం ముమ్మాటికీ ఆకాశ్‌దీపే. మరో ఎండ్‌లో సిరాజ్ కూడా రాణించడంతో ఇంగ్లండ్ వెనకడుగు వేసినట్లే అనిపించినా... బ్రూక్, స్మిత్ ట్రిపుల్ సెంచరీ భాగస్వామ్యం తిరిగి ఆతిథ్య జట్టును పోటీలోకి తెచ్చింది. ఈ దశలో మరోసారి ఆకాశ్‌దీప్ డబుల్ ధమాకా మోగించాడు. బ్రూక్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాశ్‌దీప్... వోక్స్‌కు పెవిలియన్ బాట చూపెట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అతడి బౌలింగ్ మరింత పదునెక్కింది. నాలుగో రోజు రెండు వికెట్లు తీసిన ఆకాశ్... ఆఖరి రోజు తన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను బెంబేలెత్తించాడు. వర్షం విరామం అనంతరం కాస్త సీమ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై చక్కటి బంతులతో పోప్, బ్రూక్‌ను అవుట్ చేసి భారత విజయానికి బాటలు వేశాడు. ఈ క్రమంలో కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో అదుర్స్ అనిపించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్‌దీప్ తీసిన ఐదు వికెట్లు వరుసగా డకెట్, రూట్, పోప్, బ్రూక్, స్మిత్వి కావడం అతడి బౌలింగ్ నైపుణ్యాన్ని చాటుతోంది. బుమ్రాలాగా మెరుపు వేగం లేకున్నా... లైన్ అండ్ లెంగ్త్‌తో కూడిన క్రమశిక్షణ కట్టిపడేసింది. తొలి ఇన్నింగ్స్ ప్రదర్శన అనంతరం ‘తదుపరి మ్యాచ్‌లో అవకాశం దక్కుతుందో లేదో’ అని అనుమానం వ్యక్తం చేసిన ఆకాశ్... రెండో ఇన్నింగ్స్ ప్రదర్శనతో తనను జట్టు నుంచి తప్పించలేని పరిస్థితి కలి్పంచాడు. ఈ జోరు ఇలాగే సాగిస్తే సుదీర్ఘకాలం అతడు జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఖాయమే!1692: ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన పరుగులు. భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్‌లో ఇవే అత్యధికం సాక్షి క్రీడా విభాగం -
బర్మింగ్‌హామ్‌లో జైహింద్
బుమ్రాకు విశ్రాంతినివ్వడం... కుల్దీప్ను విస్మరించడం... ప్రసి«ద్‌ను కొనసాగించడం... టాపార్డర్‌ను కూల్చిన అనంతరం ప్రత్యర్థిని కోలుకోనివ్వడం... సరైన సమయంలో ఇన్నింగ్స్ ‘డిక్లేర్’ చేయకపోవడం... ఇన్ని ప్రతికూలతలకు తోడు చివరి రోజు వర్షం సైతం ఆతిథ్య జట్టును ఆదుకునేలా కనిపించడంతో.. ఒకదశలో భారత విజయంపై నీలినీడలు కమ్ముకోగా... ఆకాశ్‌దీప్ సింగ్ వాటిని పటాపంచలు చేస్తూ విజృంభించాడు. యువసారథి శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్ మెరుపులకు... ఆకాశ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తోడవడంతో ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా విజయఢంకా మోగించింది. నాలుగేళ్ల క్రితం ‘గబ్బా స్టేడియం’లో ఆ్రస్టేలియాపై తొలి విజయంలో కీలకపాత్ర పోషించిన గిల్, పంత్, సిరాజ్... ఇక్కడ కూడా సత్తా చాటడంతో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టీమిండియా తొలిసారి టెస్టుల్లో గెలిచింది. గతంలో ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్లో ఇంగ్లండ్‌తో భారత్ 8 టెస్టులు ఆడగా ... ఏడింటిలో ఓడి... ఒకసారి ‘డ్రా’ చేసుకుంది. తొమ్మిదో ప్రయత్నంలో గెలుపు రుచి చూసింది. బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తొలిసారి టెస్టు ఫార్మాట్లో విజయం నమోదు చేసుకుంది. బ్యాటర్ల బీభత్సానికి బౌలర్ల సహకారం తోడవడంతో రెండో టెస్టులో టీమిండియా 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. విదేశాల్లో పరుగుల తేడా పరంగా భారత జట్టుకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. 608 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 72/3తో ఆదివారం చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు చివరకు 68.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్ (99 బంతుల్లో 88; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. భారీ వర్షం కురవడంతో ... చివరిరోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కాగా... ఒకదశలో వరుణుడి సాయంతో ఇంగ్లండ్ గట్టెక్కేలా కనిపించినా... వాన తెరిపినిచి్చన అనంతరం భారత బౌలర్లు విజృంభించి ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లారు. ఆకాశ్‌దీప్ 6 వికెట్లతో అదరగొట్టగా... సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, జడేజా, సుందర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. బర్మింగ్‌హామ్‌లో భారత్‌కు ఇదే మొదటి గెలుపు కాగా... ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా 1–1తో సమం చేసింది. భారత కెప్టెన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. లార్డ్స్‌లో గురువారం నుంచి మూడో టెస్టు జరుగుతుంది. మళ్లీ అతడే... వర్షంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా ఆట ప్రారంభం కావడంతో ఓవర్లను కుదించారు. దీంతో ఏ మూలో భారత విజయంపై అనుమానాలు రేకెత్తగా... వాటిని ఆకాశ్‌దీప్ పటాపంచలు చేశాడు. రెండో ఓవర్ తొలి బంతికే పోప్ (24)ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాశ్... తదుపరి ఓవర్లో బ్రూక్ (23)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ ఆత్మరక్షణలో పడగా... లంచ్ విరామానికి ముందు కెప్టెన్ బెన్ స్టోక్స్ (73 బంతుల్లో 33; 6 ఫోర్లు)ను అవుట్ చేయడం ద్వారా సుందర్ జట్టును విజయానికి మరింత చేరువ చేశాడు. ఇక గెలుపు లాంఛనం మాత్రమే మిగలగా... తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జేమీ స్మిత్ ఎదురుదాడికి దిగాడు. ధాటిగా ఆడుతూ ఓటమి అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్స్‌లు కొట్టిన స్మిత్ మరో షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఓటమి ఖరారైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 587; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 407; భారత్ రెండో ఇన్నింగ్స్: 427/6 డిక్లేర్డ్; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: డకెట్ (బి) ఆకాశ్‌దీప్ 25; క్రాలీ (సి) (సబ్) సుదర్శన్ (బి) సిరాజ్ 0; పోప్ (బి) ఆకాశ్‌దీప్ 24; రూట్ (బి) ఆకాశ్‌దీప్ 6; బ్రూక్ (ఎల్బీ) ఆకాశ్‌దీప్ 23; స్టోక్స్ (ఎల్బీ) (బి) సుందర్ 33; స్మిత్ (సి) సుందర్ (బి) ఆకాశ్‌దీప్ 88; వోక్స్ (సి) సిరాజ్ (బి) ప్రసిధ్ కృష్ణ 7; కార్స్ (సి) గిల్ (బి) ఆకాశ్‌దీప్ 38; టంగ్ (సి) సిరాజ్ (బి) జడేజా 2; బషీర్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (68.1 ఓవర్లలో ఆలౌట్) 271. వికెట్ల పతనం: 1–11, 2–30, 3–50, 4–80, 5–83, 6–153, 7–199, 8–226, 9–246, 10–271. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 21.1–2–99–6; సిరాజ్ 12–3–57–1; ప్రసిధ్ కృష్ణ 14–2–39–1; జడేజా 15–4–40–1; సుందర్ 6–2–28–1. -
ENG Vs IND 2nd Test : ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రక విజయం (ఫోటోలు)
-
పదేసిన ఆకాశ్‌దీప్.. ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రక విజయం
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. చివరి రోజు వరకు సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. విదేశాల్లో భారత్‌కు ఇదే భారీ విజయం. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు ఇదే తొలి విజయం (58 ఏళ్ల తర్వాత). ఈ వేదికపై భారత్ ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. 8 మ్యాచ్‌ల్లో ఏడింట ఓడి, ఓ మ్యాచ్ డ్రా చేసుకుంది. ఈ గెలుపుతో గిల్ ఎడ్జ్‌బాస్టన్‌లో విజయం సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. 608 పరుగల భారీ లక్ష్య ఛేదనలో 72/3 స్కోర్ వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 271 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆకాశ్‌దీప్ (21.2-2-99-6) నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. ఆకాశ్‌దీప్‌కు కెరీర్లో ఇదే తొలి ఐదు వికెట్ల ఘనత. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్‌దీప్ మొత్తంగా 10 వికెట్ల ఘనత కూడా సాధించాడు.ఈ మ్యాచ్‌లో బుమ్రా స్థానంలో బరిలోకి దిగిన ఆకాశ్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచిన జేమీ స్మిత్ (88) డ్రా కోసం విఫలయత్నం చేశాడు.అంతకుముందు టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (162 బాల్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో సిరాజ్ 6, ఆకాశ్‌దీప్ 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269) భారీ డబుల్ సెంచరీతో రికార్డులు తిరగరాశాడు. యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు.ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ భారత్‌పై విజయం సాధించింది. ఈ సిరీస్‌లో మూడో టెస్ట్ జులై 10 నుంచి ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగనుంది. గిల్ కెప్టెన్సీలో భారత్‌కు ఇదే తొలి గెలుపు. -
చెలరేగిన ఆకాశ్‌దీప్.. చారిత్రక గెలుపునకు 2 వికెట్ల దూరంలో టీమిండియా
Update: లంచ్ తర్వాత మరో 2 వికెట్లు తీసిన టీమిండియా. క్రిస్ వోక్స్‌ను (7) ప్రసిద్ద్ కృష్ణ.. జేమీ స్మిత్‌ను ఆకాశ్‌దీప్ (88) ఔట్ చేశారు. 56 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 226/8గా ఉంది. భారత్ గెలుపుకు కేవలం 2 వికెట్లు మాత్రమే కావాలి. ఆకాశ్‌దీప్ ఈ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి 10 వికెట్ల ప్రదర్శనపై కన్నేశాడు. ఆకాశ్‌దీప్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో చారిత్రక గెలుపుకు 4 వికెట్ల దూరంలో ఉంది. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇక్కడ ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఏడింట ఓడి, ఓ మ్యాచ్ డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు. వారి ఆరాటం మరికొద్ది గంటల్లో తీరే అవకాశం ఉంది.608 పరుగల భారీ లక్ష్య ఛేదనలో 72/3 వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. లంచ్ విరామం సమయానికి 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 455 పరుగులు కావాలి. అది అసాధ్యం. భారత్ గెలలాంటే మాత్రం కేవలం 4 వికెట్లు తీస్తే చాలు.వర్షం కారణంగా ఇవాల్టి ఆట గంట 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం కారణంగా 10 ఓవర్లు కోతకు గురైంది. ఈ రోజు కేవలం 80 ఓవర్ల ఆట మాత్రమే జరుగుతుంది. ఆట ప్రారంభం కాగానే టీమిండియా పేసర్ ఆకాశ్‌దీప్ ఇంగ్లండ్‌ను భారీ దెబ్బేశాడు. అతని బౌలింగ్‌లో ఓలీ పోప్ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆతర్వాత కొద్ది సేపటికే ఆకాశ్‌దీప్ మరోసారి రెచ్చిపోయాడు. ఈ సారి ఇన్ ఫామ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (23) ఎల్బీడబ్ల్యూ చేసి ఇంగ్లండ్ డ్రా ఆశలపై నీళ్లు చల్లాడు. అనంతరం స్టోక్స్, జేమీ స్మిత్ ఆరో వికెట్‌కు 70 పరుగులు జోడించి టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈసారి వాషింగ్టన్ సుందర్ అద్బుతమైన బంతితో బెన్ స్టోక్స్‌ను (33) పెవిలియన్‌కు సాగనంపాడు. స్టోక్స్ వికెట్ పడగానే అంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు. 32 పరుగులతో జేమీ స్మిత్ క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగో రోజు ఆటలో బెన్ డకెట్ (25), రూట్‌ను (60) ఔట్ చేసిన ఆకాశ్‌దీప్ ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 4 వికెట్లు తీయగా.. సిరాజ్, సుందర్ తలో వికెట్ దక్కించుకున్నారు. నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (162 బాల్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో సిరాజ్ 6, ఆకాశ్‌దీప్ 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269) భారీ డబుల్ సెంచరీతో రికార్డులు తిరగరాశాడు. యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు.స్కోర్ వివరాలు..భారత్ 587 & 427/6 డిక్లేర్ఇంగ్లండ్ 407 & 153/6 (40.3) -
ENG Vs IND 2nd Test Day 5: గుడ్ న్యూస్.. ఆట మొదలైంది.. అయితే..!
ఎడ్జ్‌బాస్టన్ నుంచి టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ తెలుస్తుంది. చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు ఆటంకం కలిగించిన వరుణుడు ప్రస్తుతం శాంతించాడు. వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో మైదానంలో కప్పి ఉంచిన కవర్లను తొలగించారు. ఔట్ ఫీల్డ్‌ను వేగంగా డ్రై చేశారు. సూర్యుడు మేఘాలను ముసుగు నుంచి బయటికి వచ్చాడు.అయితే ఓవర్ల కోత మాత్రం తప్పలేదు. ఇవాల్టి ఆటలో 90 కాకుండా 80 ఓవర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. వర్షం కారణంగా 10 ఓవర్ల కోత పడింది. భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. దాదాపు 2 గంటలు ఆలస్యంగా భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5:10 గంటలకు ప్రారంభమయ్యింది.సవరించిన సెషన్ టైమింగ్స్‌ను కూడా అంపైర్లు ప్రకటించారు. తొలి సెషన్ 5:10 నుంచి 7 గంటల వరకు.. రెండో సెషన్ 7:40 నుంచి 9:40 వరకు.. మూడో సెషన్ రాత్రి 10 గంటల నుంచి 11:30 గంటల వరకు జరుగనుంది.కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ చారిత్రక గెలుపుకు 7 వికెట్ల దూరంలో ఉంది. ఇంగ్లండ్.. భారత్ నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (162 బాల్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.మరోవైపు టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు.స్కోర్ వివరాలు..భారత్ 587 & 427/6 డిక్లేర్ఇంగ్లండ్ 407 & 72/3 (16) ప్రస్తుత రన్‌రేట్: 4.5 -
ENG VS IND 2n Test Day 5: టీమిండియాకు చేదు వార్త
ఇంగ్లండ్‌పై చారిత్రక గెలుపు సాధించేందుకు 7 వికెట్ల దూరంలో టీమిండియాకు చేదు వార్త. రెండో టెస్ట్ చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు ఎడ్జ్‌బాస్టన్‌లో భారీ వర్షం కురుస్తుంది. స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. అక్కడ వాతావరణం రాత్రిని తలపిస్తుంది. ఫ్లడ్ లైట్లు ఆన్ చేశారు. భారతకాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఇది సాధ్యపడేలా లేదు. మరో గంట పాటు వర్షం ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ నివేదించింది. అయితే మధ్యాహ్నం సమయంలో వర్షం ఉండకపోవచ్చని తెలుస్తుంది. వర్షం కారణంగా తొలి సెషన్ రద్దైతే టీమిండియాకు భారీ నష్టం సంభవిస్తుంది. మిగతా రెండు సెషన్లలో భారత బౌలర్లు ఏడు వికెట్లు తీయాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీ కాదు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.HEAVY RAIN AT EDGBASTON...!!!! [Amit Shah from RevSportz] pic.twitter.com/zdrYfwj3ri— Johns. (@CricCrazyJohns) July 6, 2025కాగా, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారత్ నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి.నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (162 బాల్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.గిల్‌పై విమర్శలుటీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెకెండ్ ఇన్నింగ్స్‌ను లేట్‌గా డిక్లేర్ చేయడాన్ని చాలా మంది క్రికెట్ నిపుణులు తప్పుబడుతున్నారు. కాస్త ముందుగానే ఇంగ్లండ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఇచ్చి ఉంటే మరిన్ని వికెట్లు పడివుండేవని అభిప్రాయపడుతున్నారు.మరోవైపు టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు.స్కోర్ వివరాలు..భారత్ 587 & 427/6 డిక్లేర్ఇంగ్లండ్ 407 & 72/3 (16) ప్రస్తుత రన్‌రేట్: 4.5 -
గెలుపు ముంగిట టీమిండియా.. కానీ ఓ బ్యాడ్ న్యూస్! అదే జరిగితే?
ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా(Teamindia) 7 వికెట్ల దూరంలో నిలిచింది. ఈ మైదానంలో ఇప్పటివరకు కనీసం ఒక్క టెస్టులో కూడా గెలవని భారత జట్టు.. తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించేందుకు సిద్దమైంది.బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. భారత్ నిర్దేశించిన 608 పరుగుల ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి. అయితే గెలుపు ముంగిట భారత జట్టును వరుణుడు భయపెడుతున్నాడు. ఆఖరి రోజుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఆదివారం ఉదయం మ్యాచ్ ప్రారంభ సమయంలో 60 శాతం వర్షం కురిసేందుకు ఆస్కారం ఉన్నట్లు ఆక్యూ వెదర్ తమ రిపోర్టులో పేర్కొంది. అయితే మధ్యాహ్నం సమయంలో వర్షం ఉండకపోవచ్చని ఆక్యూ వెదర్ తెలిపింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైతే ఇంగ్లండ్ కచ్చితంగా డ్రా కోసం ఆడుతోంది.అయితే మరోవైపు కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) ఇన్నింగ్స్‌ను లేట్‌గా డిక్లేర్ చేయడాన్ని చాలా మంది క్రికెట్ నిపుణులు తప్పుబడుతున్నారు. కాస్త ముందుగానే ఇంగ్లండ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఇచ్చి ఉంటే మరిన్ని వికెట్లు పడివుండేవని అభిప్రాయపడుతున్నారు.కాగా ఓవర్‌నైట్ స్కోరు 64/1తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (162 బాల్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.చదవండి: IND vs ENG: శుబ్‌మన్ గిల్ వరల్డ్ రికార్డు.. 148 ఏళ్లలో ఇదే తొలిసారి -
శెభాష్!.. మరోసారి శతక్కొట్టిన గిల్.. అరుదైన రికార్డు
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) తన కెరీర్లోనే అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ గడ్డ మీద వరుస శతకాలతో దుమ్ములేపుతున్నాడు. ఆతిథ్య జట్టుతో లీడ్స్ వేదికగా తొలి టెస్టులో గిల్ భారీ శతకం (147) బాదిన విషయం తెలిసిందే.అనంతరం బర్మింగ్‌హామ్‌లో బుధవారం మొదలైన రెండో టెస్టులోనూ శతక్కొట్టిన శుబ్‌మన్ గిల్.. దానిని డబుల్ సెంచరీగా మార్చాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 387 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 30 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 269 పరుగులు సాధించాడు. అయితే, కెరీర్లో సాధించిన తొలి ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మార్చడంలో గిల్ విఫలమయ్యాడు.జోష్ టంగ్ బౌలింగ్‌లో ఓలీ పోప్‌నకు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరడంతో.. అతడి భారీ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా గిల్ మరోసారి బ్యాట్ ఝులిపించాడు. యాభై ఏడు బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కెప్టెన్ సాబ్.. 129 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకున్నాడు.భారీ ఆధిక్యంలో భారత్ఇదిలా ఉంటే.. 64/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కాసేపటికే వన్‌డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (26) వికెట్ కోల్పోయింది. అయితే, ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం(55)తో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీ (58 బంతుల్లో 65) సాధించాడు. ఇక గిల్ మరోసారి శతక్కొట్టగా.. 68 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. గిల్ సెంచరీ పూర్తి చేసుకునేసరికి, టీ బ్రేక్ సమయానికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (180)తో కలుపుకొని భారత్.. 484 పరుగుల భారీ లీడ్ సాధించింది.భారత రెండో బ్యాటర్‌గా..కాగా టెస్టు మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ.. మరో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన భారత రెండో బ్యాటర్‌గా గిల్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు భారత మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ 1971లొ పోర్ట్ ఆఫ్ స్పెయిన్వేదికగా వెస్టిండీస్‌పై ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో గిల్ తొమ్మిదో ఆటగాడు.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టుషెడ్యూల్: బుధవారం (జూలై 2)- ఆదివారం (జూలై 6)వేదిక: ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్హామ్టాస్: ఇంగ్లండ్- తొలుత బౌలింగ్టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 587 ఆలౌట్ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 407 ఆలౌట్ టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్ -
వాటే ఫామ్!.. ధనాధన్ దంచికొట్టి.. గిల్, పంత్ హాఫ్ సెంచరీలు
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ (Ind vs Eng)తో తొలి టెస్టులో శతకం (147) బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి (Virat Kohli) లేని లోటు పూడుస్తూ.. ఇంగ్లండ్ గడ్డ మీద అతడి రికార్డునే బద్దలు కొట్టాడు.భారీ ద్విశతకం (269)తో ఆకట్టుకుని.. ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా క్రికెటర్, కెప్టెన్‌గా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ శుబ్‌మన్ గిల్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. యాభై ఏడు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. జోష్ టంగ్ బౌలింగ్‌లో ఫోర్ బాది 51 పరుగులు సాధించాడు.𝐅𝐥𝐮𝐞𝐧𝐭. 𝐅𝐞𝐚𝐫𝐥𝐞𝐬𝐬. 𝐅𝐨𝐜𝐮𝐬𝐞𝐝. 🔥Leading with intent, #ShubmanGill crafts a classy fifty, setting the stage for a commanding team effort 🫡#ENGvIND 👉 2nd TEST, Day 4 | LIVE NOW on JioHotstar ➡ https://t.co/2wT1UwEcdi pic.twitter.com/ftaIUA9YIy— Star Sports (@StarSportsIndia) July 5, 2025మరోవైపు.. గిల్‌కు తోడుగా వైస్ కెప్టెన్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 51 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో 44 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసిన టీమిండియా ఆధిక్యం.. 400కు చేరింది.పంత్ అవుటైన తర్వాత స్కోరు ఇలాకాగా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 587 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ (269)తో అదరగొట్టగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్‌వోక్స్, జోష్ టంగ్ రెండేసి వికెట్లు కూల్చారు. బ్రైడన్ కార్స్, కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ఆరు, ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకొని భారత్‌కు 180 పరుగుల ఆధిక్యం లభించింది.ఈ క్రమంలో 64/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కేఎల్ రాహుల్ (55), రిషభ్ పంత్ (65) అర్ధ శతకాలు.. గిల్ అజేయ హాఫ్ సెంచరీ (ప్రస్తుతానికి 58) కారణంగా 46.2 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసి.. 416 పరుగుల ఆధిక్యంలో ఉంది. పంత్ 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షోయబ్ బషీర్ బౌలింగ్‌లో డకెట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్ -
ఇంగ్లండ్ తో రెండో టెస్టుపై పట్టుబిగించిన భారత్
-
ఈ రోజు కోసమే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా: మహ్మద్ సిరాజ్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. తన సంచలన బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా లేని లోటును సిరాజ్ తీర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ మియా ఆరు వికెట్లతో సత్తాచాటాడు.రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేసిన సిరాజ్.. ఆ తర్వాత మూడో రోజు బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్ వంటి కీలక వికెట్లను పడగొట్టాడు. ఇంగ్లీష్ జట్టు టెయిలాండర్లను ఈ హైదారబాదీ వరుస క్రమంలో పెవిలియన్‌కు పంపాడు.ఒక ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. తన ప్రదర్శనపై మూడో రోజు ఆట అనంతరం సిరాజ్ స్పందించాడు. ఇది తనకు ఎంతో ప్రత్యేకమని అతడు చెప్పుకొచ్చాడు."ఇంగ్లండ్ గడ్డపై ఐదు వికెట్ల ప్రదర్శన కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా. అందుకే నమ్మశక్యంగా అనిపించడం లేదు. నిజానికి నేను చాలా బాగా బౌలింగ్ చేస్తున్నా వికెట్లు మాత్రం రావడం లేదు. ఇప్పటి వరకు నాలుగు వికెట్లకు మించి తీయలేదు.ఇప్పుడు ఆరు వికెట్లు సాధించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. పిచ్ నెమ్మదిగా ఉన్నా క్రమశిక్షణతో సరైన చోట బంతులు వేస్తే ఫలితం రాబట్టవచ్చని నమ్మాను. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పరుగులు నిరోధించే ప్రయత్నం చేశాను. మిగతా ఇద్దరితో పోలిస్తే నాకే అనుభవం ఎక్కువ కాబట్టి ఆ సవాల్‌ను స్వీకరించి బాధ్యతగా బౌలింగ్ చేశాను. బుమ్రా లేకపోవడంతో పేస్ బౌలింగ్ ఎటాక్‌ను లీడ్ చేశాను" అని విలేకరుల సమావేశంలో సిరాజ్ పేర్కొన్నాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. జెమీ స్మిత్(207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్స్‌లతో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్(234 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 158) భారీ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ 6వ వికెట్‌కు 303 పరుగులు జోడించారు.భారత బౌలర్లలో సిరాజ్‌తో పాటు ఆకాష్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 180 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన యశస్వి జైశ్వాల్.. తొలి భారత ప్లేయర్‌గా -
ఏం చూస్తున్నావు?.. వేగంగా పరిగెత్తలేవా?: ఆకాశ్ దీప్‌పై గిల్ ఫైర్!
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుత ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి రోజు బాదిన శతకాన్ని ప్రిన్స్.. రెండో రోజు ఆట సందర్భంగా దానిని డబుల్ సెంచరీ (Double Century)గా మలిచాడు. మొత్తంగా 387 బంతులు ఎదుర్కొన్న గిల్.. 30 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 269 పరుగులు సాధించాడు. తద్వారా రికార్డుల మోత మోగించాడు.ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత కెప్టెన్, ఆటగాడిగా గిల్ చరిత్రకెక్కాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత టెస్టు క్రికెట్లో ప్రిన్స్ శకం మొదలైందంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు అతడిని ఆకాశానికెత్తుతున్నారు. మరోవైపు.. గిల్ తన ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మలిస్తే ఇంకా బాగుండేదంటూ కాస్త నిరాశకు లోనవుతున్నారు..@ShubmanGill rewrites the record books in England! 👑📚✅ First Asian captain to score a double century in SENA✅ First visiting captain to score 200 in England since 2003✅ Only the third Indian to score a double century in England!#ENGvIND 👉 2nd TEST, Day 2 | LIVE NOW… pic.twitter.com/VoVrRQT8VT— Star Sports (@StarSportsIndia) July 3, 2025 ఇదిలా ఉంటే.. డబుల్ సెంచరీ వీరుడు గిల్ రెండో రోజు బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా సహనం కోల్పోయాడు. తొలి రోజు నుంచి.. రెండో రోజు వరకు దాదాపు ఐదు సెషన్లలోనూ ఓపికగా ఉన్న గిల్‌కు కోపం రావడానికి కారణం భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep).రనౌట్ రూపంలో బలయ్యేవారే!గురువారం నాటి రెండో రోజు ఆట టీ సమయానికి ముందు.. గిల్ చరిత్రాత్మక ట్రిపుల్ సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ.. షోయబ్ బషీర్ బౌలింగ్ (139.5)లో మిడ్ వికెట్ మీదుగా గిల్ షాట్ బాదాడు. ఈ క్రమంలోనే అవతలి ఎండ్‌లో ఉన్న ఆకాశ్ దీప్‌ను పరుగుకు ఆహ్వానించాడు. కానీ అప్పుడు పరధ్యానంగా ఉన్న ఆకాశ్.. వెంటనే తేరుకుని డైవ్ కొట్టి ఎలాగోలా క్రీజులోకి చేరుకున్నాడు. లేదంటే ఎవరో ఒకరు రనౌట్ రూపంలో బలయ్యేవారే!pic.twitter.com/cXM1utO4a8— Nihari Korma (@NihariVsKorma) July 3, 2025ఏం చూస్తున్నావు?.. తొందరగా పరిగెత్తలేవా?దీంతో కోపోద్రిక్తుడైన గిల్.. ‘‘ఏం చూస్తున్నావు?.. తొందరగా పరిగెత్తలేవా?’’ అంటూ ఆకాశ్ దీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక అప్పటికి 260 పరుగుల వద్ద ఉన్న గిల్.. మరో తొమ్మిది రన్స్ తన స్కోరుకు జతచేసి జోష్ టంగ్ బౌలింగ్‌లో పోప్‌నకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు.. ఆకాశ్ దీప్ ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.ఇదిలా ఉంటే.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల మేర భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ భారీ ద్విశతకం (269) బాదగా.. యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89) కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.చదవండి: IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ! -
గిల్ రికార్డుల హోరు ఇంగ్లండ్ బేజారు
‘హెడింగ్లీలో నేను 147 పరుగులకే అవుటయ్యా... మరింత సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సింది. తప్పుడు షాట్‌తో వెనుదిరిగా’... రెండో టెస్టుకు ముందు భారత జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ చెప్పిన మాట ఇది. తాను నిజంగా నిలబడి పట్టుదలగా ఆడితే ఎలా ఉంటుందో ఇప్పుడు అతను ఎడ్జ్‌బాస్టన్‌లో చూపించాడు. 8 గంటల 29 నిమిషాల అసాధారణ బ్యాటింగ్, ఎక్కడా చిన్న తప్పుకు కూడా అవకాశం ఇవ్వకుండా... 94 శాతం నియంత్రణతో కూడిన చక్కటి షాట్లతో గిల్ అదరగొట్టాడు... ఏకంగా 269 పరుగులు చేసి పలు రికార్డులను అలవోకగా అధిగమిస్తూ పోయాడు. గిల్‌కు జడేజా, వాషింగ్టన్ సుందర్ అండగా నిలవడంతో టీమిండియా భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. ఒక దశలో 211/5తో కష్టాల్లో నిలిచిన జట్టు చివరి 5 వికెట్లకు ఏకంగా 376 పరుగులు జోడించింది. ఆపై బుమ్రా లేని లోటును తీర్చేలా ఆకాశ్‌దీప్, సిరాజ్ చెలరేగిపోయి ఇంగ్లండ్ టాప్–3ని కుప్పకూల్చారు. మూడో రోజూ మన బౌలర్ల జోరు సాగితే టీమిండియాకు మ్యాచ్‌పై పట్టు చిక్కడం ఖాయం. బరి్మంగ్‌హామ్: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసి కూడా ఓడిన భారత్ ఈసారి అంతకంటే మరింత భారీ స్కోరును నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 310/5తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 151 ఓవర్లలో 587 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ క్రికెట్లో స్టోక్స్–మెకల్లమ్ (బజ్‌బాల్) శకం మొదలైన తర్వాత ఆ జట్టుపై ప్రత్యర్థి సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్స్‌లు) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేజార్చుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (103 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో వికెట్‌కు జడేజాతో 203 పరుగులు జోడించిన గిల్... ఏడో వికెట్‌కు సుందర్‌తో 144 పరుగులు జత చేశాడు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. ఫాలోఆన్ తప్పించుకునేందుకు కూడా ఆ జట్టు మరో 311 పరుగులు చేయాల్సి ఉంది. జడేజా చేజారిన సెంచరీ మ్యాచ్ రెండో రోజు తొలి బంతికి సింగిల్‌తో గిల్, జడేజా భాగస్వామ్యం 100 పరుగులకు చేరింది. అనంతరం 80 బంతుల్లో జడేజా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... ధాటిని పెంచిన గిల్ టెస్టుల్లో తన అత్యధిక స్కోరును అందుకోవడంతో పాటు కెరీర్లో తొలిసారి 150 పరుగులు (263 బంతుల్లో) దాటాడు. ఆ తర్వాత మరింత జోరు ప్రదర్శించిన వీరిద్దరు బషీర్ ఓవర్లో చెరో సిక్స్ బాదారు. ఇదే ఊపులో శతకం దిశగా దూసుకుపోయిన జడేజా దురదృష్టవశాత్తూ ఆ అవకాశం కోల్పోయాడు. టంగ్ వేసిన షార్ట్ బంతి నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా... గ్లవ్‌కు తగిలిన బంతి గాల్లోకి లేచి కీపర్ చేతుల్లో పడింది. దాంతో ద్విశతక భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం సుందర్ కూడా చక్కటి షాట్లతో గిల్‌కు తగిన సహకారం అందించాడు. తొలి సెషన్లో భారత్ 25 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి 109 రన్స్ చేసింది. కొనసాగిన జోరురెండో సెషన్లో గిల్ మరింత చెలరేగిపోయాడు. బషీర్ ఓవర్లో సిక్స్ కొట్టిన అతను టంగ్ ఓవర్లో రెండు ఫోర్లతో 195కు చేరుకున్నాడు. ఆ తర్వాత టంగ్ బౌలింగ్‌లోనే ఫైన్ లెగ్ దిశగా సింగిల్ తీయడంతో 311 బంతుల్లో గిల్ డబుల్ సెంచరీ పూర్తయింది. ఆపై 200 నుంచి 250 వరకు చేరేందుకు గిల్‌కు కేవలం 37 బంతులు (8 ఫోర్లు, 1 సిక్స్) సరిపోయాయి. ఈ క్రమంలో బ్రూక్ ఓవర్లో అతను వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఎట్టకేలకు సుందర్‌ను రూట్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్‌కు కాస్త ఊరట లభించింది. రెండో సెషన్లో భారత్ 31 ఓవర్లలో ఓవర్‌కు 4.6 రన్‌రేట్‌తో ఏకంగా 145 పరుగులు సాధించడం విశేషం. టీ విరామానంతరం ‘ట్రిపుల్’పై కన్నేసిన గిల్‌ను నిలువరించడంలో ఇంగ్లండ్ సఫలమైంది. టంగ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడబోయి స్క్వేర్‌లెగ్‌లో సునాయాస క్యాచ్ ఇవ్వడంతో గిల్ అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. మరో 13 పరుగుల తర్వాత భారత్ తమ చివరి 2 వికెట్లు కోల్పోయింది. టపటపా ప్రత్యర్థి చేసిన కొండంత స్కోరు కనిపిస్తుండగా ఒత్తిడిలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. ఆకాశ్‌దీప్ చెలరేగిపోతూ వరుస బంతుల్లో డకెట్ (0), పోప్ (0)లను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆ తర్వాత క్రాలీ (19)ని సిరాజ్ పెవిలియన్ పంపడంతో పరిస్థితి మరింత దిగజారింది. అయితే రూట్, బ్రూక్ పట్టుదలగా నిలబడి ఇంగ్లండ్‌ను ఆదు కున్నారు. ఆరంభంలో కొంత తడబడినా చివరకు 12.5 ఓవర్లు నిలిచి రోజును ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 87; రాహుల్ (బి) వోక్స్ 2; కరుణ్ నాయర్ (సి) బ్రూక్ (బి) కార్స్ 31; గిల్ (సి) పోప్ (బి) టంగ్ 269; పంత్ (సి) క్రాలీ (బి) బషీర్ 25; నితీశ్ రెడ్డి (బి) వోక్స్ 1; జడేజా (సి) స్మిత్ (బి) టంగ్ 89; సుందర్ (బి) రూట్ 42; ఆకాశ్‌దీప్ (సి) డకెట్ (బి) బషీర్ 6; సిరాజ్ (స్టంప్డ్) స్మిత్ (బి) బషీర్ 8; ప్రసిధ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (151 ఓవర్లలో ఆలౌట్) 587. వికెట్ల పతనం: 1–15, 2–95, 3–161, 4–208, 5–211, 6–414, 7–558, 8–574, 9–574, 10–587. బౌలింగ్: వోక్స్ 25–6–81–2, కార్స్ 24–3–83–1, టంగ్ 28–2–119–2, స్టోక్స్ 19–0–74–1, బషీర్ 45–2–167–3, రూట్ 5–0–20–1, బ్రూక్ 5–0–31–0. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) సిరాజ్ 19; డకెట్ (సి) గిల్ (బి) ఆకాశ్‌దీప్ 0; పోప్ (సి) రాహుల్ (బి) ఆకాశ్‌దీప్ 0; రూట్ (బ్యాటింగ్) 18; బ్రూక్ (బ్యాటింగ్) 30; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 77. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–25. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 7–1–36–2, సిరాజ్ 7–2–21–1, ప్రసిధ్ కృష్ణ 3–0–11–0, నితీశ్ రెడ్డి 1–0–1–0, జడేజా 2–1–4–0. -
టీమిండియాతో రెండో టెస్టు.. ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్! అతడికి పిలుపు?
ఇంగ్లండ్-భారత్ మధ్య రెండో టెస్టు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూలై 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ది టెలిగ్రాఫ్ రిపోర్ట్ ప్రకారం.. మాజీ ఆల్‌రౌండర్ మోయిన్ అలీ(Moeen Ali) కోచింగ్ కన్సల్టెంట్‌గా ఇంగ్లండ్ జట్టులో చేరాడు.హెడ్ కోచ్ బ్రాండెన్ మెకల్లమ్‌తో కలిసి మోయిన్ అలీ తన సేవలను అందించనున్నట్లు టెలిగ్రాఫ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విల్ మాక్‌ఫెర్సన్ వెల్లడించారు. సోమవారం అలీ నేతృత్వంలోనే ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ చేసినట్లు ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశమున్నందన మోయిన్‌ను తమ కోచింగ్ సెటప్‌లోకి ఇంగ్లండ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఆఫ్ స్పిన్నర్ అయిన అలీ.. తొలి టెస్టులో విఫలమైన యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు గైడ్ చేసే అవకాశముంది. అంతేకాకుండా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ వంటి మిస్టరీ స్పిన్నర్లను ఎదుర్కొవడంలో ఇంగ్లండ్ బ్యాటర్లకు అలీ చిట్కాలు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అదేవిధంగా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్టులో ఆడడంపై ఇంకా సందిగ్థం కొనసాగుతోంది. మ్యాచ్‌కు ముందే అతని అందుబాటుపై నిర్ణయం ఉంటుందని భారత అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే చెప్పుకొచ్చాడు.ఒకవేళ బుమ్రాకు విశ్రాంతి ఇస్తే ఆకాష్ దీప్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. స్పీడ్ స్టార్ జోఫ్రా అర్చర్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. మూడో టెస్టు నుంచి అతడు అవకాశముంది.టీమిండియాతో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్చదవండి: బుమ్రాపై నిర్ణయం అప్పుడే.. మా దృష్టింతా దానిపైనే: టీమిండియా కోచ్ -
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. చరిత్రకు అడుగు దూరంలో జైశ్వాల్
భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తిరిగి పుంజుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం తమ జోరును ఎడ్జ్‌బాస్టన్‌లో కూడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌కు అరుదైన రికార్డు ఊరిస్తోంది. రెండో టెస్టులో జైశ్వాల్ 97 పరుగులు చేస్తే, టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 2,000 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత క్రికెటర్‌గా రికార్డులెక్కుతాడు. జైశ్వాల్ ఇప్పటివరకు 20 టెస్టుల్లో 52.86 సగటుతో 1,903 పరుగులు చేశాడు.ప్రస్తుతం ఈ రికార్డు భారత లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. సునీల్ గవాస్కర్ ఈ ఫీట్‌ను తన 23వ టెస్ట్‌లో నమోదు చేశారు. 1976 ఏప్రిల్ 7 నుండి 12 వరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించారు. గవాస్కర్ తర్వాతి స్ధానంలో ప్రస్తుత భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నారు. గంభీర్ ఈ ఫీట్‌ను తన 24వ టెస్టు మ్యాచ్‌లో అందుకున్నాడుటెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన భారత ఆటగాళ్లు👉సునీల్ గవాస్కర్ - 23 మ్యాచ్‌లు👉గౌతమ్ గంభీర్ - 24👉రాహుల్ ద్రవిడ్ - 25👉వీరేంద్ర సెహ్వాగ్ - 25👉విజయ్ హజారే - 26👉చెతేశ్వర్ పుజారా – 26👉సౌరవ్ గంగూలీ - 27👉శిఖర్ ధావన్ - 28👉పటౌడీ - 28 -
భారత జట్టులో కీలక మార్పులు.. అతడిపై వేటు! తెలుగోడికి చోటు?
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. జూలై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే రెండో టెస్టులో అమీతుమీ తెల్చుకోవడానికి భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని గిల్ సేన పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో రెండో టెస్టు కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.శార్ధూల్ ఠాకూర్‌పై వేటు..?తొలి టెస్టులో దారుణ ప్రదర్శన కనబరిచిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్(Shardul thakur)పై వేటు వేసేందుకు టీమిండియా మెనెజ్‌మెంట్ సిద్దమైంది. లీడ్స్ టెస్టులో శార్ధూల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన ఠాకూర్.. బౌలింగ్‌లో కేవలం రెండు వికెట్లు పడగొట్టాడు.ఈ క్రమంలో శార్ధూల్ బదులుగా ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish kumar reddy)ని తీసుకోవాలని గంభీర్ అండ్ కో భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో నితీశ్ తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మెల్బోర్న్ టెస్టులో ఓ సెంచరీ కూడా సాధించాడు. దీంతో తిరిగి మళ్లీ అతడిని తుది జట్టులోకి తీసుకోవాలని టీమ్ మెనెజ్‌మెంట్ యోచిస్తుందంట. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలనుకుంటే శార్థూల్ స్ధానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.బుమ్రాకు విశ్రాంతి..?ఇక రెండో టెస్టుకు వర్క్‌లోడ్ కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్‌మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని ఈ సిరీస్‌కు ముందే భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు.దీంతో రెండో టెస్టుకు అతడికి విశ్రాంతి ఇచ్చి తిరిగి లార్డ్స్ టెస్టులో ఆడించాలని గంభీర్ అండ్ కో భావిస్తున్నరంట. తొలి టెస్టులో బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల హాల్‌తో బుమ్రా చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ పడగొట్టకపోయినప్పటికి దాదాపు 20 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఒకవేళ రెండో టెస్టుకు బుమ్రా దూరమైతే అతడి స్ధానంలో అర్ష్‌దీప్ సింగ్ అరంగేట్రం చేసే అవకాశముంది. లేదంటే పేసర్ ఆకాష్ దీప్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
Ind vs Pak: ఫైనల్లో పాక్‌తో భారత క్రికెట్ జట్టు ఢీ! సై అంటే సై..
IBSA World Games 2023: చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండ్ నేపథ్యంలో చంద్రునిపై భారత మువ్వన్నెల పతాకం గర్వంగా రెపరెపలాడిన సంతోషాన్ని యావత్ దేశం సంబరంగా జరుపుకొంటున్న తరుణంలో.. భారత అంధ క్రీడాకారులు బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో సత్తా చాటారు. ప్రపంచ అంధ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడాకారుల పోటీలలో ఆకాశమే హద్దుగా ముందుకు సాగుతున్నారు. మహిళా, పురుష జట్లు గత వారం రోజులుగా జరుగుతున్న ఈ పోటీలలో భారత క్రీడాకారులు క్రికెట్ , జూడో , అథ్లెటిక్స్ విభాగంలో పాల్గొంటున్నారు. పురుషుల క్రికెట్లో భారత్ , ఇంగ్లండ్, పాకిస్తాన్ , బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా .. మహిళల క్రికెట్ విభాగంలో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల జట్లు తలపడ్డాయి. ఫైనల్లో పాకిస్తాన్‌తో ఢీ ఈ క్రమంలో.. పురుషుల క్రికెట్లో భారత్ నాలుగు లీగ్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ఇక శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. శనివారం నాటి ఫైనల్లో దాయాది జట్టు పాకిస్తాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత కాలమానం ప్రకారం 3:30 గంటలకు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థితో అమీతుమీ తేల్చుకోనుంది. మహిళా జట్టు కూడా ఫైనల్‌కు మహిళల క్రికెట్ విభాగంలో భారత జట్టు మూడు మ్యాచ్‌లకు మూడు గెలిచి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఆగష్టు 26 నాటి తుదిపోరులో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో ఫైనల్లో తలపడనుంది . క్రీడాకారులకు అరకొర ఏర్పాట్లు యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న మన ప్రవాసాంధ్రులు ముఖ్యంగా సోలిహల్ యునైటెడ్ క్రికెట్ క్లబ్ (SUCC, UK) సభ్యులు కలిసి ఈ క్రికెట్ జట్టు సభ్యులందరికీ కావాల్సిన భోజనా-వసతి సదుపాయాలని సమకూరుస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్రణవ గ్రూప్ కూడా వీరికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. తగిన సహకారం అందిస్తే కాగా జట్టు యాజమాన్యం, ప్రభుత్వం మరింత బాధ్యతగా ఏర్పాట్లు చేసినట్లయితే ఇంకా అంధ క్రికెట్లో మనవాళ్లు ఎన్నో విజయాలు సాధిస్తారని ప్రవాసాంధ్రులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. 2012 నుంచి భారత పురుషుల జట్టు 3 సార్లు టీ20, రెండుసార్లు వన్డే ప్రపంచ కప్, ఒకసారి ఆసియ కప్ గెలిచి సత్తా చాటింది. ఎన్ని విజయాలు సాధించినా జట్టుకు, క్రీడాకారులకు తగినంత గుర్తింపు , ప్రోత్సాహం లభించడం లేదని క్రికెట్ అభిమానులు ఉసూరుమంటున్నారు. భారత పురుషుల అంధ క్రికెట్ జట్టు అజయ్ కుమార్‌రెడ్డి(కెప్టెన్), వెంకటేశ్వరరావు(వైస్ కెప్టెన్), బసప్ప వడ్డగోల్, మహ్మద్ జాఫర్ ఇక్బాల్, మహారాజా శివసుబ్రమణియన్, ఓంప్రకాశ్ పాల్, మరేశ్భాయిబలుభాయి తుంబ్డా, నీలేశ్ యాదవ్, పంకజ్ భుయే, రాంబీర్ సింగ్, నకుల బద్రానాయక్, ఇర్ఫాన్ దివాన్, ప్రకాశ జయరామయ్య, దీపక్మాలిక్, సునిల్ రమేశ్, దుర్గారావు తొంపాకి, దినేశ్భాయయి చమాయ్దాభాయి రాథ్వా. మహిళల క్రికెట్ జట్టు: వర్ష(కెప్టెన్), వలసనైని రావణ్ణి, సిము దాస్, పద్మినితుడు, కలికా సంధ్య, ప్రియ, గంగవ్వ నీలప్ప హరిజన్, సాండ్రా డేవిస్ కరిమలిక్కల్, బసంతి హన్స్దా, ప్రీతి ప్రసాద్, సుష్మా పటేల్, ఎం.సత్యవతి, ఫులాసరేన్(వైస్ కెప్టెన్), ఝిలిబిరువా, గంగా శంభాజీ కదం, దీపికా టీసీ. చదవండి: Asia Cup: కోహ్లి కాదు.. యో- యో టెస్టులో అతడే టాప్! స్కోరెంతంటే? -
ఎడ్జ్‌బాస్టన్ పిచ్ హైవేలా ఉంది.. జాఫర్ సెటైరికల్ ట్వీట్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆధిపాత్యం చెలాయిస్తోంది. బాజ్‌బాల్ అంటూ దూకుడుగా ఆడి తొలి ఇన్నింగ్స్‌ను 393/8 వద్ద డిక్లెర్ చేసిన ఇంగ్లీష్ జట్టు.. బౌలింగ్‌లో కూడా అదే తీరును కనబరుస్తుంది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు రెండో రోజు లంచ్ సమయానికి మూడు కీలక వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ఆటగాళ్లు ఇప్పటికే పెవిలియన్‌కు చేరారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. తొలి టెస్టు జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌ను చాలా ఫ్లాట్‌గా తాయారు చేశారని, బౌలర్లకు ఏ మాత్రం అనుకూలించడం లేదని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తనదైన స్టైల్లో స్పందించాడు. ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌ను హైవేతో పోలుస్తూ జాఫర్ సెటైరికల్ ట్వీట్ చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ ఫోటోను షేర్చేస్తూ.. "పిచ్‌ను దగ్గరగా చూడండి అంటూ" ట్విటర్లో రాసుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ (118 నాటౌట్) అద్భుతమైన శతకంతో చెలరేగగా.. . జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: Ashes Series 1st Test: స్మిత్ భరతం పట్టిన స్టోక్స్ Closer look at the Edgbaston pitch #Ashes23 pic.twitter.com/0gNSMWdPim — Wasim Jaffer (@WasimJaffer14) June 16, 2023 -
Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు!
Commonwealth Games 2022- బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ క్రీడలకు ఆటగాళ్లు సమాయత్తమవుతున్నారు. జూలై 28 నుంచి ఆగష్టు 8 వరకు ఈ ప్రతిష్టాత్మక క్రీడలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా భారత్, పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్లు పోరుకు సన్నద్ధమవుతున్నాయి. టి20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లతో కలిసి గ్రూప్ ‘ఏ’లో ఉన్నాయి ఈ రెండు జట్లు. ఈ క్రమంలో మొదట ఆసీస్‌తో తలపడనున్న హర్మన్‌ప్రీత్ సేన.. రెండో మ్యాచ్‌లో దాయాది జట్టు పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు.. పాక్ జట్టు బార్బడోస్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. మరి భారత్- పాక్ మ్యాచ్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు కదా! జట్లు ఏవైనా దాయాదుల పోరు ఎల్లప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ గేమ్స్-2022లో మహిళా జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది? లైవ్‌స్ట్రీమింగ్, జట్లు తదితర అంశాలు తెలుసుకుందాం! భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్: ►తేది: జూలై 31, 2022 ►సమయం: భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆరంభం ►వేదిక: ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్, బర్మింగ్‌హామ్, ఇంగ్లండ్ ►ప్రసారాలు: సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తానియా సప్న భాటియా(వికెట్ కీపర్), యస్తిక భాటియా , దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘన సింగ్, రేణుక ఠాకూర్, జెమీమా రోడ్రిగెస్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా. స్టాండ్ బై ప్లేయర్లు: సిమ్రన్ దిల్ బహదూర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్ పాకిస్తాన్ జట్టు: బిస్మా మరూఫ్(కెప్టెన్), ముబీనా అలీ(వికెట్ కీపర్), ఆనమ్ అమిన్, ఐమన్ అన్వర్, డయానా బేగ్, నిదా దర్, గుల్ ఫిరోజా(వికెట్ కీపర్), తుబా హసన్, కైనట్ ఇంతియాజ్, సాదియా ఇక్బాల్, ఈరమ్ జావేద్, అయేషా నసీమ్, అలియా రియాజ్, ఫాతిమా సనా, ఒమైమా సొహైల్. కాగా వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ 107 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా దాయాది జట్టుపై వరుసగా 11వ సారి గెలుపొంది సత్తా చాటింది. చదవండి: Ind Vs WI ODI Series: వాళ్లంతా లేరు కాబట్టి మా పని ఈజీ.. మేమేంటో చూపిస్తాం: విండీస్ కెప్టెన్ Commonwealth Games 2022: కామన్ వెల్త్ గేమ్స్.. భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని -
Ind Vs Eng: టీమిండియా ఫ్యాన్స్‌కు చేదు అనుభవం.. అసభ్య పదజాలంతో దూషిస్తూ..
India Vs England 5th Test Day 4: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా రీషెడ్యూల్డ్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన భారత అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. నాలుగో రోజు ఆట కొనసాగుతున్న సమయంలో కొంతమంది టీమిండియా ఫ్యాన్స్‌ను ఉద్దేశించి జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. అసభ్యకర రీతిలో వారిని దూషించారు. ఈ మేరకు ఓ ట్విటర్ యూజర్ సోషల్ మీడియా వేదికగా తమకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఇంగ్లండ్ అభిమానులు తమను ఉద్దేశించి జాతి వివక్షపూరిత వ్యాఖ్యలతో దూషించారని ఆరోపించారు. ఈ విషయం గురించి అక్కడున్న వాళ్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. తమతో పాటు అక్కడున్న మహిళలు, చిన్నారుల భద్రత కూడా ప్రమాదంలో పడిందని, సిబ్బందిలో ఒక్కరు కూడా తమకు సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆరోపించారు. నాగరిక సమాజంలో ఇలాంటివి అస్సలు ఆమోదయోగ్యం కాదంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, భారత క్రికెట్ నియంత్రణ మండలిని ట్యాగ్ చేస్తూ తమ ఆవేదనను పంచుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. ‘‘టెస్టు మ్యాచ్ సందర్భంగా కొంతమంది జాతి వివక్ష ప్రదర్శిస్తూ అసభ్య పదజాలం వాడినట్లు మా దృష్టికి వచ్చింది. ఇందుకు మేము చింతిస్తున్నాం. ఎడ్జ్‌బాస్టన్ అధికారులతో మేము మాట్లాడుతున్నాం. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తాం. క్రికెట్లో జాతి వివక్షకు తావు లేదు’’ అని ట్వీట్ చేసింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు: ►టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ ►టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 259/3. చదవండి: Dutee Chand: మసాజ్ చేయమని బెదిరించేవారు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన భారత మహిళా అథ్లెట్ Racist behaviour at @Edgbaston towards Indian fans in block 22 Eric Hollies. People calling us Curry C**ts and paki bas****s. We reported it to the stewards and showed them the culprits at least 10 times but no response and all we were told is to sit in our seats. @ECB_cricket pic.twitter.com/GJPFqbjIbz — Lacabamayang!!!!!!! (@AnilSehmi) July 4, 2022 We are very concerned to hear reports of racist abuse at today's Test match. We are in contact with colleagues at Edgbaston who will investigate. There is no place for racism in cricket — England and Wales Cricket Board (@ECB_cricket) July 4, 2022 -
Eng Vs Nz: ప్రయోగాత్మకంగా 18 వేల మందితో...
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌లో కరోనా తగ్గుముఖం పట్టడంతో వివిధ బహిరంగ కార్యక్రమాల్లో నెమ్మదిగా సాధారణ స్థితి చోటు చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడే అవకాశం ఉన్న చోట ఎలాంటి కరోనా ఆంక్షలు పెట్టకుండా ఎక్కువ మందిని అనుమతిస్తే ఎలా ఉంటుంది? అసలు కరోనా తీవ్రత ఏమిటో, తాజా స్థితి ఏమిటో తెలిసిపోతుంది కదా! బ్రిటన్ ప్రభుత్వం ఇదే ఆలోచనతో కొన్ని పైలట్ కార్యక్రమాలు తీసుకొని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జూన్ 10 నుంచి జరిగే రెండో టెస్టులో స్టేడియం సామర్థ్యం లో 70 శాతాన్ని అనుమతించాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగే ఈ టెస్టుకు ప్రతీరోజు కనీసం 18 వేల మంది వరకు హాజరు కావచ్చు. మ్యాచ్‌కు వచ్చే వారంతా 16 ఏళ్లకంటే ఎక్కువ వారై ఉండి, కరోనా నెగెటివ్ రిపోర్టు ఉంటే చాలు. మ్యాచ్ జరిగే సమయంలో మాస్క్‌లు వేసుకోవడం మినహా మరే ఇతర ఆంక్షలు ఉండవు. 2020 సీజన్ మొత్తం ప్రేక్షకులు లేకుండానే ఆడిన ఇంగ్లండ్ క్రికెటర్లకు కూడా ఇది కొత్త ఉత్సాహం ఇస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఏర్పాట్లకు తగినంత సమయం లేకపోవడంతో లార్డ్స్‌లో జరిగే తొలి టెస్టులో మాత్రం ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం 25 శాతం మందినే అనుమతిస్తారు. గత కొద్ది రోజుల్లో బ్రిటన్ ప్రభుత్వం ఎఫ్ఏ కప్ ఫైనల్ (20 వేలు), స్నూకర్ ఫైనల్ (ఇండోర్‌లో వేయి మంది), కొన్ని మ్యూజిక్ కన్సర్ట్లు కలిపి మొత్తం 58 వేల మంది వరకు అనుమతించగా... చివరకు 15 మంది మాత్రమే ఇందులో కోవిడ్–19 పాజిటివ్‌గా తేలారు. -
కరోనా టెస్టింగ్ సెంటర్‌గా క్రికెట్ స్టేడియం..!
బర్మింగ్హమ్: కరోనా వైరస్ నియంత్రణకు ఏమి చేయాలో తెలియక ప్రపంచ మొత్తం అల్లాడుతోంది. దీన్ని ఎలా నియంత్రించాలో తెలియక వరల్డ్ అంతా లాక్డౌన్లోకి వెళ్లిపోతే, కరోనా వైరస్ మాత్రం ఎక్కడా కూడా తగ్గుముఖం పట్టిన దాఖలు కనబడుటం లేదు. ఈ వైరస్ నివారణకు వ్యాక్సిన్ తయారీల కోసం పలు దేశాలు తమ ప్రయత్నాలను ఇప్పటికే ముమ్మరం చేయగా, ప్రస్తుత పరిస్థితిల్లో కరోనా బాధితులు గణనీయంగా పెరిగిపోతూ ఉండటంతో టెస్టుల కోసం పలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కరోనా బాధితులకు కేవలం ఆస్పత్రిల్లోనే చికిత్స చేయడం సాధ్య పడదు కాబట్టి, రైళ్లు, స్పోర్ట్స్ అకాడమీలు ఇలా ప్రతీ దాన్ని వినియోగించుకునే పనిలో ఉన్నాయి ప్రపంచ దేశాలు. ఇంగ్లండ్‌లో ఏకంగా ఒక క్రికెట్ స్టేడియాన్నే సిద్ధం చేశారు. ప్రముఖ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియాన్నికోవిడ్-19 టెస్టింగ్ సెంటర్‌గా మార్చే యోచనలో ఉన్నారు. నేషనల్ హెల్త్ సర్వీసుల్లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ స్టేడియాన్ని కరోనా వైరస్ టెస్టింగ్ సెంటర్‌గా మార్చడానికి కసరత్తులు పూర్తి చేసినట్లు వార్విక్షైర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీల్ స్నో బాల్ తెలిపారు. ‘ మా దేశంలో క్రికెట్ సంబంధిత కార్యక్రమాలు, సమావేశాలు, ఈవెంట్స్, వ్యాపార కార్యకలాపాలు అన్నీ కూడా మే 29వరకూ బంద్ చేశాం. ఈ క్లిష్ట సమయంలో మా సిబ్బంది అంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండటంపైనే దృష్టి సారించింది. దీనికి మా మాజీ ఆటగాళ్ల సాయం కూడా తీసుకుంటున్నాం. ఎడ్జ్‌బాస్టన్‌ను కరోనా వైరస్ సెంటర్‌గా మార్చడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. ఇందుకు అనుమతి లభించిన వెంటనే ఇక్కడ కరోనా టెస్టింగ్ సెంటర్ అందుబాటులోకి వస్తుంది’ అని నీల్ స్నో బాల్ తెలిపారు. ఇక్కడ చదవండి: యువీ, భజ్జీ.. సాయం చేయండి: మాజీ క్రికెటర్ అత్యధిక ధర ఆటగాడి ఎదురుచూపులు..! -
బ్రిటన్ పార్లమెంట్‌కు తొలిసారిగా సిక్కు మహిళ ఎన్నిక
లండన్: బ్రిటన్ ఎన్నికల్లో తొలిసారిగా ఓ సిక్కు మహిళ చరిత్రాత్మక విజయం సాధించి, పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన ప్రీత్‌కౌర్ గ్రిల్ బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ నుంచి పోటీ చేసి 24,124 ఓట్లు సాధించి ఎంపీగా ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి కరోలిన్ స్క్వైర్‌పై గ్రిల్ 6,917 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎడ్జ్‌బాస్టన్‌కు ఎంపీగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అదే పార్టీకి చెందిన మరో సిక్కు అభ్యర్థి తన్మన్జీత్ సింగ్ దేశి కూడా కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిపై 16,998 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. స్లోగ్ సీటు నుంచి తన్మన్జీత్ పోటీ చేసి 34,170 ఓట్లు సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిక్కులకు అవకాశం ఇచ్చినందుకు లేబర్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పార్టీ నుంచి పోటీ చేసిన మరో సిక్కు అభ్యర్థి కుల్దీప్ సహోతా ప్రత్యర్థి చేతిలో 720 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బ్రిటన్ పార్లమెంట్‌కు ఇద్దరు సిక్కు అభ్యర్థులు గెలుపొందడం ఇదే తొలిసారి. -
బ్రిటన్‌లో 'తొలి గులాబి' మ్యాచ్
లండన్: క్రికెట్ పుట్టినిళ్లుగా పేరున్న బ్రిటన్ తన తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్‌కు వేధికను ఖరారు చేసింది. వచ్చే ఏడాది ఎడ్గ్బాస్టన్లో తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహించనున్నట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు వెస్టిండిస్‌తో తలపడనుంది. అంతర్జాతీయ క్రికెట్లో కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ మొట్టమొదటి డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడిలైడ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య గత ఏడాది జరిగింది. 138 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో సాగిన టెస్ట్‌గా ఆ మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ఎరుపు, తెలుపు బంతులు కాకుండా కొత్తగా గులాబీ రంగు బంతులను తొలిసారి వాడారు. కాగా, వచ్చే వారంలో పాకిస్తాన్, వెస్టిండిస్‌తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడునుంది. దీంతో డే నైట్ టెస్ట్ మ్యాచ్‌లకు ఆతిధ్యం ఇచ్చిన దేశాల్లో మూడో స్థానంలో బ్రిటన్ నిలువనుంది. పగలు పని చేసేవారు కూడా టెస్ట్ మ్యాచ్‌లను వీక్షిండానికి ప్రోత్సాహం కల్పించడమే తమ లక్ష్యం అని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తెలిపింది. వచ్చే ఏడాది ఆగష్టు17-22 మధ్య జరిగే మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఫ్లడ్ లైట్ల వెలుతురులో వెస్టిండిస్‌తో తలపడనుంది. -
ఇంగ్లండ్ ఆటతీరుపై ఇయాన్ బోథమ్ ఆగ్రహం!
లండన్: ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన వన్డేల్లో ఇంగ్లండ్ క్రికెటర్ల ఆటతీరు ఓ జోక్ తలపించిందని ఆదేశ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ అన్నారు. ఇంగ్లండ్ జట్టు ఆడిన తీరు ఆగ్రహం తెప్పించిందని ఆయన అన్నారు. ప్రపంచ కప్ కు ఆరునెలల ముందు ఇంగ్లండ్ జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉందని బోథమ్ మండిపడ్డారు. ఇలా దారుణమైన ఆటను ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ జట్టు ప్రపంచ కప్ కు బదులు 'ఎగ్ కప్' గెలుచుకుంటే అదృష్టమే అని వ్యాఖ్యలు చేశారు. పరాజయాల నుంచి ఇంగ్లాండ్ గుణపాఠం నేర్చుకోవడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చేసిన తప్పులే మళ్లీ.. మళ్లీ చేస్తుండటం తనను నిరాశకు గురిచేస్తోందని బోథమ్ అన్నారు.