
PC: Starsports/X
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుత ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి రోజు బాదిన శతకాన్ని ప్రిన్స్.. రెండో రోజు ఆట సందర్భంగా దానిని డబుల్ సెంచరీ (Double Century)గా మలిచాడు. మొత్తంగా 387 బంతులు ఎదుర్కొన్న గిల్.. 30 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 269 పరుగులు సాధించాడు. తద్వారా రికార్డుల మోత మోగించాడు.
ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత కెప్టెన్, ఆటగాడిగా గిల్ చరిత్రకెక్కాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత టెస్టు క్రికెట్‌లో ప్రిన్స్ శకం మొదలైందంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు అతడిని ఆకాశానికెత్తుతున్నారు. మరోవైపు.. గిల్ తన ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మలిస్తే ఇంకా బాగుండేదంటూ కాస్త నిరాశకు లోనవుతున్నారు.
.@ShubmanGill rewrites the record books in England! 👑📚
✅ First Asian captain to score a double century in SENA
✅ First visiting captain to score 200 in England since 2003
✅ Only the third Indian to score a double century in England!#ENGvIND 👉 2nd TEST, Day 2 | LIVE NOW… pic.twitter.com/VoVrRQT8VT— Star Sports (@StarSportsIndia) July 3, 2025
ఇదిలా ఉంటే.. డబుల్ సెంచరీ వీరుడు గిల్ రెండో రోజు బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా సహనం కోల్పోయాడు. తొలి రోజు నుంచి.. రెండో రోజు వరకు దాదాపు ఐదు సెషన్లలోనూ ఓపికగా ఉన్న గిల్‌కు కోపం రావడానికి కారణం భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep).
రనౌట్ రూపంలో బలయ్యేవారే!
గురువారం నాటి రెండో రోజు ఆట టీ సమయానికి ముందు.. గిల్ చరిత్రాత్మక ట్రిపుల్ సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ.. షోయబ్ బషీర్ బౌలింగ్ (139.5)లో మిడ్ వికెట్ మీదుగా గిల్ షాట్ బాదాడు. ఈ క్రమంలోనే అవతలి ఎండ్‌లో ఉన్న ఆకాశ్ దీప్‌ను పరుగుకు ఆహ్వానించాడు. కానీ అప్పుడు పరధ్యానంగా ఉన్న ఆకాశ్.. వెంటనే తేరుకుని డైవ్ కొట్టి ఎలాగోలా క్రీజులోకి చేరుకున్నాడు. లేదంటే ఎవరో ఒకరు రనౌట్ రూపంలో బలయ్యేవారే!
— Nihari Korma (@NihariVsKorma) July 3, 2025
ఏం చూస్తున్నావు?.. తొందరగా పరిగెత్తలేవా?
దీంతో కోపోద్రిక్తుడైన గిల్.. ‘‘ఏం చూస్తున్నావు?.. తొందరగా పరిగెత్తలేవా?’’ అంటూ ఆకాశ్ దీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక అప్పటికి 260 పరుగుల వద్ద ఉన్న గిల్.. మరో తొమ్మిది రన్స్ తన స్కోరుకు జతచేసి జోష్ టంగ్ బౌలింగ్‌లో పోప్‌నకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు.. ఆకాశ్ దీప్ ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఇదిలా ఉంటే.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల మేర భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ భారీ ద్విశతకం (269) బాదగా.. యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89) కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.
చదవండి: IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ!